Bigg Boss Non Stop Voting: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా.. తారుమరైనా ఓట్లు?
బిగ్ బాస్ మూడో వారం క్లైమాక్స్ కు వచ్చేసింది. మొదటి రెండు వారాల్లో ఎవరూ ఊహించని విధంగా గ్లామరస్ బ్యూటీలు ఇంట్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సారి ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువగానే ఉంది. ఇక ఇటీవల పరిణామాలను బట్టి ఇక ఓటింగ్స్ లో కూడా తేడాలు వస్తున్నాయి. ఇక షోలో ఈ వారం డేంజర్ జోన్ లో ఎలిమినేట్ అవ్వడానికి ఎవరెవరు ఉన్నారు అనే వివరాల్లోకి వెళితే..

అభిప్రాయ బేధాలు, గొడవలు
బిగ్ బాస్ షోలో రోజురోజుకు పరిణామాలు ఒక్కసారిగా చేంజ్ అవుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎవరు కూడా టాస్క్ లో విషయంలో అస్సలు తగ్గడం లేదు. సీనియర్ బిగ్ కంటెస్టెంట్స్ ను వారియర్స్ గా సెట్ చేసిన బిగ్ బాస్ కొత్త వారిని ఛాలెంజర్లుగా మార్చారు. ఇక రెండు గ్రూపుల మధ్య కొనసాగుతున్న టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్యలో అభిప్రాయ బేధాలు గొడవలు గట్టిగానే జరుగుతున్నాయి.

కొన్ని పొరపాట్ల వలన..
బిగ్ బాస్ లో మొదటివారం సీనియర్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత శ్రీ రాపాక ఎలిమినేట్ అవ్వడం ఓ వర్గం వారిని ఆశ్చర్యాన్ని కలిగించింది. తప్పకుండా ఈ ఇద్దరు ఒక నాలుగైదు వారాలు ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ చేసిన కొన్ని పొరపాట్ల వలన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఒకేసారి 12 మంది
ఇక ఈ వారం ఏకంగా 12 మందిని నామినేషన్ లిస్ట్ లోకి రప్పించడం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 12 మందిని డేంజర్ జోన్ లో పడేశారు. ఒక విధంగా ఎక్కువ స్థాయిలో ఓటింగ్స్ రావడం కోసమే బిగ్ బాస్ ఈ విదంగా స్ట్రాటజీని వాడినట్లు అనిపిస్తోంది. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నవారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది.

అఖిల్ సార్ధక్ vs బిందు మాధవి
ఇక ఓటింగ్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టాప్ లిస్ట్ లో బిందు మాధవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత అఖిల్ సార్ధక్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్రత చాలా ఎక్కువైంది. ప్రతీ విషయంలో అయితే ఒకరికొకరు చాలానే గొడవ పడుతున్నారు. కొన్నిసార్లు అయితే బిందుమాధవి అతని పరువు తీసే విధంగా కౌంటర్ సైతం గట్టిగానే ఇస్తుంది.

ఓటింగ్స్ లిస్ట్ లో..
ఇక వీరి తర్వాత మిగతా కంటెస్టెంట్ కూడా ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఓటింగ్స్ లో బిందు మాధవి అనంతరం అఖిల్ సార్ధక్, యాంకర్ శివ, అరియానా, మిత్రశర్మ, తేజస్వి, నటరాజ్, అజయ్, కొనసాగుతున్నారు. చైతు కెప్టెన్ కాబట్టి అతను ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు.

డేంజర్ జోన్ లో..
మొత్తం పదిహేను మందిలో పన్నెండు మంది నామినేషన్‌లో ఉండగా అందులో ఇప్పటికే దాదాపు 10 మంది సేఫ్ అయినట్లుగా క్లారిటీ వచ్చింది. ఇక ఓటింగ్ లిస్ట్ లో చివరలో ఉన్న ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చివరలో ఉన్న స్రవంతి, మహేశ్‌లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తోంది. మొన్నటివరకు తేజస్వి గట్టిగానే పోరాడింది. ఇక ఆమె మెరుగైన స్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ గా ఈ వారం స్రవంతి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కొత్త టాక్ వినిపిస్తోమది


Click it and Unblock the Notifications











