Bigg Boss Non Stop: మరోసారి టార్గెట్ అయిన బిందుమాధవి.. చుక్కలు చూపించిన నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నుంచి మొదట్లోనే ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ మళ్ళీ ఊహించని విధంగా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె మళ్ళీ హౌస్ లోకి వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక ముమైత్ ఖాన్ వచ్చి రాగానే హౌస్ లో కోర్టు జడ్జిగా దర్శనమివ్వడం విశేషం. ఆమె ఎంట్రీని చూసి అఖిల్ సార్ధక్ కూడా షాక్ అయ్యాడు. ఇక ముమైత్ గతంలో ఎలిమినేషన్ కుట్రలో పాల్గొన్న వారిపై రివెంజ్ ఎలా తీర్చుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇక నేడు ఎలాంటి పరిణామాలతో ఎపిసోడ్ హైలెట్ కానుంది. ఇక లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలోని హైలెట్ పాయింట్స్ పై ఒక లుక్కేస్తే..

లాయర్లుగా శివ, నటరాజ్

లాయర్లుగా శివ, నటరాజ్

ముమైత్ ఖాన్ జడ్జిగా ఉండగా ఒకవైపు నటరాజ్ మాస్టర్, మరోవైపు యాంకట్ శివ లాయర్లుగా ఇరు పక్షాల తరపున వాదించే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటివరకు జరిగిన టాస్క్ ల విషయంలో అలాగే ఎలిమినేషన్స్ కు సంబంధించిన పరిణామాలను కూడా లాయర్లు ఇద్దరు కూడా గట్టిగానే వాదించారు. మిగతా వారిని అనేక రకాల ప్రశ్నలను అడుగుతూ ఇబ్బందుల్లో పడేశారు.

బిందుమాధవిపై టార్గెట్

బిందుమాధవిపై టార్గెట్

ఇక ఫుడ్ ని విసిరేసిన విషయాన్ని లేవనెత్తిన నటరాజ్ మాస్టర్ మరోసారి బిందుమాధవిని టార్గెట్ చేసినట్లు అనిపించింది. ఇక ఆమెకు మద్దతుగా శివ లాయర్ గా వాదించి కౌంటర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. మా స్మగ్లర్లు చేసిన ఫుడ్ తింటున్నారు అనే మాట అన్నప్పుడు తప్పు కానిది.. మేము ప్లేట్ విసిరేస్తే తప్పు అయ్యిందా అని అడిగాడు.

నవ్వేసిన బిందుమాధవి

నవ్వేసిన బిందుమాధవి

ఇక నామినేషన్ లో జరిగిన పొరపాట్లను హైలెట్ చేస్తూ నామినేట్ అవుతామని తెలిసి నామినేషన్ జరిగేటప్పుడు లోపలికి వెళ్లి మళ్ళీ ఆ తరువాత తిరిగి వచ్చి నామినేట్ చేయడం అనేది నమ్మకం లేనిది అని నటరాజ్ మాస్టర్ బిందుమాధవి లోపాలను ఎత్తి చూపారు. అందుకు బిందుమాధవి నవ్వేసింది. ఇక వాళ్ళు స్టార్ట్ చేసి సారి చెబితే అది మంచిదే.. ఇక బిందుమాధవి స్టార్ట్ చేసి క్షమాపణ కోరితే అది తప్పంటా..

మధ్యలో మిత్ర శర్మ

ఇక మిత్ర శర్మ ఆడ అనే విషయం గురించి తీసిన నటరాజ్ మాస్టర్.. ఆమెకు ఆడ అనే విషయం కూడా తెలియదు అని ఆమె చెబితే గాని బోనులోకి వచ్చి అఖిల్ దొంగ సాక్ష్యం చెప్పే ఆలోచనతో లేడు అనే విధంగా నటరాజ్ మాస్టర్ మరో పాయింట్ ను లేవనెత్తారు. ఇక అందుకు మిత్ర లేచి అలా కాదు అని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేసింది.

అఖిల్ సేఫ్ గేమ్?

అఖిల్ సేఫ్ గేమ్?

ఇక నిన్ను ఆడ అనడం నువ్వు విన్నవా అని ఆడిగాము.. దానికి నువ్వు ఏం చెప్పావు అని శివ అడిగాడు. ఇక పొరపాటున మిత్ర నేను టీమ్ కోసం నిలబడుతున్నాను అని చెప్పగానే.. నటరాజ్ మాస్టర్ ఆ మాటను అందుకొని.. అదుగో ఆమె టీమ్ అని అంటోందని చెప్పాడు. ఇక ఆ మాటలతో ప్రత్యర్ధి టీమ్ కు మరింత బలం వచ్చింది. ఇక సందు చూసి అఖిల్ నేను ఒడిపోయినా పరవాలేదు అంటూ మిత్ర శర్మకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
 బిందుమాధవికి నెటిజన్ల మద్దతు

బిందుమాధవికి నెటిజన్ల మద్దతు

ఇక అందరి వాదనలు విన్న ముమైత్ ఖాన్ ఎలాంటి తీర్పును ఇచ్చి గేమ్ ను మలుపు తిప్పుతుందో చూడాలి. ఇక బిందుమాధవిని టార్గెట్ చేస్తుండడంతో నెటిజన్లు ఆమెకు మద్దతు గట్టిగానే ఇస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థి పోటీగా అఖిల్ సార్ధక్ ఉన్న విషయం తెలిసిందే. అభిమానుల నుంచి అయితే బిందుమాధవికి మంచి సపోర్ట్ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో అఖిల్ నుంచి ఆమెకు ఎలాంటి చాలెంజ్ లు ఎదురవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X