Bigg Boss Non Stop: వైల్డ్ కార్డ్ ఎంట్రీకి బిగ్ ప్లాన్.. మొదటిసారి విదేశీ సెలబ్రెటీ కోసం ప్రయత్నాలు?

టెలివిజన్ రంగంలో మంచి రేటింగ్ అందుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఓటీటీలో కూడా నాన్ స్టాప్ షో గా విజయవంతంగా కొనసాగుతోంది. రోజురోజుకీ వీక్షకుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లతో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ముఖ్యంగా వీకెండ్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది అని అర్థం అవుతోంది. అయితే మొదట్లో కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అని కూడా కామెంట్స్ వచ్చాయి. ఇక రెండవ వారం అనంతరం సరికొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారనున్న ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి సారి బిగ్ బాస్ తెలుగు షోలో కి ఒక విదేశీ సెలబ్రిటీని కూడా తీసుకురాబోతున్నారట ఆ వివరాల్లోకి వెళితే..

సరికొత్త టాస్క్ లతో..

సరికొత్త టాస్క్ లతో..


బిగ్ బాస్ నాన్ స్టాప్ షో పై రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. పెరుగుతున్న టాస్క్ ల డోస్ కు కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి సర్వ శక్తులను కూడా బయటపెట్టే సమయం కూడా దగ్గరపడుతోంది. ప్రతి వారం కూడా ఎలిమినేషన్ చాలా ఆసక్తికరంగా ఉండాలి అని బిగ్ బాస్ కూడా సరికొత్త టాస్క్ లతో మలుపులు తిరిగేలా చేస్తున్నాడు. కొన్ని కొన్ని సార్లు టాస్క్ ల విషయంలో కూడా కంటెస్టెంట్స్ కన్ఫ్యూజన్ కి గురి అవుతున్నారు. ఇక కంటెస్టెంట్స్ మధ్యలో మొదట ఒక స్నేహాన్ని క్రియేట్ చేసిన బిగ్ బాస్ ఆ తర్వాత వివిధ రకాల గేమ్ ప్లాన్స్ తో మళ్లీ వారి మధ్య గొడవలు చాలా తెలివిగా క్రియేట్ చేస్తున్నారు.

 రెండు గ్రూపులుగా.. గొడవలు..

రెండు గ్రూపులుగా.. గొడవలు..

బిగ్ బాస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ రప్పించడం మొదట్లో కొంత నెగిటివ్ టాక్ ను అందించింది. ఈసారి కొత్తవారిని తీసుకు వస్తారు అనుకుంటే మళ్లీ పాత వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అని కొన్ని నెగిటివ్ ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే బిగ్ బాస్ మాత్రం ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కంటెంట్లో డోస్ పెంచడం మొదలు పెట్టాడు. కొత్త కంటెస్టెంట్స్ ను ఛాలెంజర్స్ గా మార్చిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ను వారియర్స్ గా ఒక గ్రూపు కింద రెడీ చేశాడు. ఇక ఈ రెండు గ్రూపుల మధ్య ఆటను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు.

ఈ వారం ఎలిమినేట్..

ఈ వారం ఎలిమినేట్..

అయితే ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ లపై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే శ్రీ రాపాక వెళ్ళిపోవచ్చు అని తెలుస్తోంది.

మిత్రశర్మ కూడా..

మిత్రశర్మ కూడా..


అంతేకాకుండా అంతకు ముందు వారం మిత్రశర్మ కూడా వెళ్ళిపోవచ్చు అని ఒక టాక్ అయితే వచ్చింది. ఇక ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం వెళ్ళిపోవచ్చు అభిప్రాయాలు అయితే వెలువడుతున్నాయి. నాగార్జున కూడా ఈ ఆదివారం ఒక ట్విస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

 అతను వస్తాడని అనుకుంటే..

అతను వస్తాడని అనుకుంటే..

ఇక ఈ వారం లేదా ఆ తర్వాత వారంలో ఒక మరొక కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి రప్పించే అవకాశం ఉన్నట్లుగా మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరు వస్తారు విషయం లో కూడా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. గతంలోనే రోల్ రిడా అందరితో పాటు హౌస్ లోకి రావాల్సిందే. కానీ అతని కాలికి గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చింది. అతను కూడా మళ్లీ వస్తాడని టాక్ వచ్చింది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
 చిచా చార్లెస్ ఎంట్రీ?

చిచా చార్లెస్ ఎంట్రీ?

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే కంటెస్టెంట్స్ లో మొదటిసారి బిగ్ బాస్ ఒక విదేశీ సెలబ్రిటీని హౌస్ లోకి రప్పించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయిన ఆఫ్రికన్ యుగాండా వ్యక్తి చార్లెస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతను ఎక్కువగా తెలుగు సినిమా డైలాగ్స్ అలాగే తెలుగు పాటలతో చిచా చార్లెస్ గా గుర్తింపు అందుకున్నాడు. అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా మై విలేజ్ షో యూట్యూబ్ చానల్స్ లో కూడా షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. ఇక అతన్ని రప్పించి షోకి బజ్ తీసుకురావాలని నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X