Bigg Boss Non Stop: అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లాన్.. అందుకే ఆ సెలబ్రిటీలు రాలేదట?

బిగ్ బాస్ అంటేనే మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న రియాల్టీ షో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈసారి నాన్ స్టాప్ గా ఓటీటీ ద్వారా ప్రసారం కాబోతున్న సరికొత్త సీజన్ మరింతగా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. 17 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయిన నాన్ స్టాప్ షోను నాగార్జున మరోసారి హోస్ట్ గా స్టార్ట్ చేశారు. అయితే మొదటి నుంచి షో హైలెట్ అయ్యే విధంగా టాస్క్ లలో డోస్ పెంచనున్నారట. అంతే కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నట్లుగా మరొక టాక్ వస్తోంది.

ఈ ఓటీటీ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని కొందరు కంటెస్టెంట్స్ ఆఫర్ రాగానే గ్రీన్ సైన్ ఇచ్చారట. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

నాన్ స్టాప్ గా..

నాన్ స్టాప్ గా..

గడిచిన మూడు సీజన్లలో నాగార్జున తన హోస్టింగ్ తో ఏ స్థాయిలో ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ షో ద్వారా పోస్టింగ్ తో మంచి గుర్తింపును అందుకున్న నాగార్జున ఈసారి ఓటీటీలో కూడా తనదైన శైలిలో షోను కొనసాగించబోతున్నారు. శనివారం మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు షోలోకి మొత్తంగా 17 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఇక ఎనభై నాలుగు రోజుల పాటు ఈ షో కొనసాగుతోంది.

17 మంది కంటెస్టెంట్స్

17 మంది కంటెస్టెంట్స్

17మంది కంటెస్టెంట్లతో 24గంటల పాటు నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు షో రెడీ సిద్ధమయ్యింది. ఇక మొదటి కంటెస్టెంట్‌గా అషూ రెడ్డి ఎంట్రీ ఇవ్వగా ఆ తరువాత మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ ఎంట్రీ ఇచ్చాడు.

అరియానా, నటరాజ్ మాస్టర్, నగ్నం బ్యూటీ శ్రీరాపాక, యాంకర్‌ శివ,అఖిల్‌ సార్థక్‌, సరయు, తేజస్వి మదివాడ, హమీదా, నిఖిల్‌, మిత్రా శర్మ, ముమైత్‌ ఖాన్‌, అనిల్‌ రాథోడ్‌, అజయ్‌ కతుర్వార్‌, బిందు మాదవి.. షోలోకి అడుగు పెట్టారు.

చివరి నిమిషంలో

చివరి నిమిషంలో

ఇక బిగ్ షో స్టార్ట్ అవ్వడానికి ముందుకు చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. రావాల్సిన కొందరు కంటెస్టెంట్స్ కూడా రాలేదని టాక్ వస్తోంది. అసలైతే కంటెస్టెంట్స్ లిస్ట్ కొన్ని వారాల క్రితమే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. మరికొందరు హింట్ కూడా ఇచ్చేశారు. ఇక వచ్చిన ఫైనల్ లిస్ట్ లో మాత్రం కొందరు మిస్ అవ్వగా వారిని వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ షోలోకి స్పెషల్ గా రప్పించనున్నారట.

లెగ్ ప్రాబ్లం వల్ల..

లెగ్ ప్రాబ్లం వల్ల..

బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొన్న రోల్ రైడా చివరి నిమిషంలో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. లెగ్ ప్రాబ్లం వల్ల చివరి నిమిషంలో తప్పుకున్నాడట. ఇక అతన్ని వచ్చే వారం లేదా ఆ తరువాత ఎప్పుడైనా పరిస్థితులను బట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు

ఇక రోల్ రైడాతో పాటు మరికొందరు కూడా బిగ్ బాస్ లోకి స్పెషల్ గా ఎంట్రీలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదర్శ్ తనీష్ లు కూడా ప్రత్యేకంగా షోలోకి ఎంట్రీ ఇస్తారని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. తప్పకుండా ఈసారి షోలో విభిన్నమైన ఎంట్రీలు ఉంటాయని సమాచారం. మరో ఓటీటీ షో జనాలను ఎంత వరకు ఆకట్టుకొంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X