Bigg Boss Non Stop: సీజన్ 5 నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్.. అదిరిపోయే ట్విస్ట్?
బిగ్ బాస్ లో రోజురోజుకు సరికొత్త టాస్క్ లతో షో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముడొవరం నామినేషన్ లో ఏకంగా 12 మందిని నామినేషన్ లోకి రప్పించడం బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ రానున్న రోజుల్లో షోను మరింత ఆసక్తికరంగా మార్చాలి అని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక రాబోయే మరికొన్ని రోజుల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. బిగ్ సీజన్ 5 నుంచి కూడా ఒక కంటెస్టెంట్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రప్పిస్తారని టాక్. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

ఇద్దరు అవుట్
ఈసారి ఓటీటీ ద్వారా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది. వీలైనంతవరకూ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ టాస్క్ లతో బిగ్ బాస్ రోజురోజుకీ షోలో వాతావరణాన్ని చాలా విభిన్నంగా మార్చేస్తున్నాడు. వీలైనంతవరకు కంటెస్టెంట్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఇప్పటికే రెండు వారాల ఎలిమినేషన్స్ లో ముమైత్ ఖాన్ శ్రీ రాపాక ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు.

అత్యధిక ఓట్లు
ఇక మూడవ వారం ఎవరు వెళ్ళిపోతారు అనే విషయం కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఈ సారి బిగ్ బాస్ అయితే ఏకంగా 12 మందిని నామినేషన్స్ లిస్టులో కి తీసుకు రావడం విశేషం. ఒక విధంగా వారందరికీ భారీస్థాయిలో ఓట్లు పడే విధంగా ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ వారం అత్యధిక ఓట్లు కూడా నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు
అయితే ఈసారి నాన్ స్టాప్ షోలో వైల్డ్ కార్డ్ కూడా చాలా గట్టిగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. ముందుగా ఐదవ సీజన్ లో పాల్గొన్న కంటెంట్ను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్ లో 5వ సీజన్ నుంచి నటరాజ్ మాస్టర్, హామీదా కటూన్, 7 ఆర్ట్స్ సరయు ముగ్గురు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ముగ్గురి పేర్లు వైరల్..
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో 5వ సీజన్ నుంచి రాబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఒక ముగ్గురు పేర్లు చాలా బలంగా వైరల్ అవుతున్నాయి. విశ్వా, ప్రియాంక సింగ్, అనీ మాస్టర్ ముగ్గురు లోని పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి అంతేకాకుండా గ్లామర్ బ్యూటీ శ్వేత వర్మ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అతను కూడా..
అలాగే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ లో మరొక మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరు కూడా హాట్ టాపిక్ గా మారింది. సింగర్ ర్యపర్ రోల్ రిడా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అసలైతే అతను 17 మంది తో పాటు హౌస్ లోకి అడుగు పెట్టాల్సింది. ఇక అతని కాలికి గాయం కావడంతో హఠాత్తుగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ రెండో సీజన్ లో పాల్గొన్న రోల్ రిడా ఈసారైనా హౌస్ లో చివరి వరకు పోరాడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











