Bigg Boss Non stop: బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్ అయినట్లేనా.. మారిన ఓట్ల లెక్కలు.. బిందుమాధవి డౌన్?
తెలుగులో బిగ్ బాస్ షో అసలు మొదట సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఊహించని విధంగా హోస్ట్ గా ఎవరు చేసినా కూడా మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి. బిగ్ బాస్ షో టెలివిజన్ లోనే కాకుండా ఓటీటీ రంగంలో కూడా మంచి గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. మొదట బిగ్ బాస్ నాన్ స్టాప్ పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగానే వచ్చినప్పటికీ ఆ తరువాత చాలా తొందరగానే క్లిక్ అయింది. ఇక ఈ సారి ముందుగానే బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్ అని అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటివరకు బిందు మాధవి ఓటింగ్స్ జాబితాలో ముందు ఉండగా.. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కంటెస్టెంట్ మరొకరు భారీగా ఓట్లను అందుకుంటున్నట్టుకు తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.

నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తున్నా..
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజురోజుకు వీక్షకుల సంఖ్యను పెంచుకుంటుంది. ఒక విధంగా మొదట్లో అయితే సెలబ్రిటీల ఎంట్రీల విషయంలో మాత్రం నెటిజన్లు కొంత అప్సెట్ అయితే అయ్యారు. మళ్లీ పాతవారిని యధావిధిగా తీసుకోవడం ఏమాత్రం బాగోలేదు అని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక అలాంటి కామెంట్స్ ఎన్ని వస్తున్న కూడా బిగ్ బాస్ మాత్రం టాస్క్ ల విషయంలో డోస్ పెంచి మంచి ఎంటర్టైన్మెంట్ ను అయితే అందించే ప్రయత్నం చేశాడు.

సరికొత్తగా నాన్ స్టాప్ షో
వారియర్స్ ఛాలెంజర్స్ ఏ మాత్రం తగ్గకుండా టైటిల్ విన్నర్ గా నిలిచేందుకు పోరాడుతున్నారు. ఇప్పటివరకు టెలివిజన్ రంగంలో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మొదటిసారి హాట్ స్టార్ ఓటీటీ లోకి అడుగు పెట్టింది. ఒక విధంగా హిందీ లో కంటే విభిన్నంగా తెలుగులోనే స్టార్ట్ చేశారు అని చెప్పవచ్చు. మాజీ కంటెస్టెంట్స్ అలాగే కొత్త తరహా సెలబ్రిటీలను తీసుకువచ్చి ఎప్పటికప్పుడు గేమ్ ను మార్చేస్తున్నారు. ఇక ఎలిమినేషన్ లో అయితే ఎవరూ ఊహించని సెలబ్రిటీలు బయటకు వెళ్ళి పోతూ ఉండటం విశేషం.

మొన్నటి వరకు టాప్ లో బిందుమాధవి
ఇక ఎవరు ఉన్నా లేకపోయినా ఫైనల్ గా మాత్రం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో షోలో విన్నర్ గా నిలిచేది ఎవరో తెలిసిపోయింది అంటూ సోషల్ మీడియాలో కూడా అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. మొన్నటి వరకు బిందుమాధవి అని సోషల్ మీడియాలో టాక్ అయితే గట్టిగానే వచ్చింది. ఎందుకంటే ఆమె ప్రతి వారం కూడా జనాల నుంచి బాగానే ఓట్లు అందుకుంటూ వచ్చింది.
Recommended Video


అతనే టాప్ లో..
ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ గా నిలిచే కంటెస్టెంట్ గా అఖిల్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వారాల్లో ఓట్ల విషయంలో అతనే మొదటి స్థానంలో ఉన్నాడు అని తప్పకుండా అతనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడు అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒకవిధంగా అఖిల్ గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడు అని కూడా ఇతర కంటెస్టెంట్స్ లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి అఖిల్ గెలుస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











