Bigg Boss Non Stop: ఆంటీతో అనుభవం అని ఒకరు.. 120 మందితో ఎఫైర్ అని మరొకరు.. షోలో బూతులే బూతులు

తెలుగు బుల్లితెరపై సరికొత్త కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే కనీవినీ ఎరుగని రీతిలోస్పందనను అందుకున్న షో బిగ్ బాస్. అందుకే దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. దేనికీ దక్కనంత రేటింగ్‌ను సంపాదించుకుంటోంది. ఫలితంగా ఇండియాలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఐదు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో గతంలో ఎప్పుడూ లేని విధంగా బూతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా షోలో ఇద్దరు కంటెస్టెంట్లు తమ అనుభవం గురించి బయటపెట్టారు. ఆ సంగతులు మీకోసం!

 అందులోనే ప్రసారం.. వివరాలివే

అందులోనే ప్రసారం.. వివరాలివే

‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఫిబ్రవరి 26 నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక, వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ఎన్నో ఆశలతో ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే, హాట్‌స్టార్‌లో కొన్ని ఎపిసోడ్స్‌ను ఇస్తున్నారు.

ఓటీటీ సీజన్‌‌లో ఎంటరైంది వీళ్లే

ఓటీటీ సీజన్‌‌లో ఎంటరైంది వీళ్లే


బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎన్నో అంచనాలతో వైభవంగా మొదలైంది. ప్రీమియర్ ఎపిసోడ్‌లో అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యారు.

రెండు గ్రూపులు... పోటాపోటీగానే

రెండు గ్రూపులు... పోటాపోటీగానే

గతంలో మాదిరిగా కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి పాత కొత్త కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ ముందుకు సాగుతోంది.

రచ్చ రచ్చ.. సెన్సార్ లేకుండానే

రచ్చ రచ్చ.. సెన్సార్ లేకుండానే


బిగ్ బాస్ షో సెన్సార్‌తో నడిచేది. అయితే, ఓటీటీ వెర్షన్ 24 గంటలూ ప్రసారం అవుతోన్న నేపథ్యంలో దీనికి ఎలాంటి కట్స్, బీప్స్ ఉండడం లేదు. దీంతో ఈ షో ఆరంభం నుంచే రచ్చ రచ్చగా సాగుతోంది. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా బోల్డు టాస్కులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఆరంభంలోనే ఓటీటీ సీజన్‌ అందరి దృష్టినీ ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.

నో ఫిల్టర్ గేమ్.. బూతు ప్రశ్నలతో

నో ఫిల్టర్ గేమ్.. బూతు ప్రశ్నలతో

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు ‘నో ఫిల్టర్' టాస్కును ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ రౌండ్‌గా కూర్చుంటారు. అప్పుడు ఒకరు వీల్‌ను తిప్పుతారు. అందులో బాణం గుర్తు ఎవరి వైపు ఉంటే వాళ్లు బిగ్ బాస్ పంపిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నలను ముందుగా రివీల్ చేయరు.. కంటెస్టెంట్లే ఒకటి ఎంచుకోవాలి.

ఆంటీతో అనుభవం అని ఒకరు

ఆంటీతో అనుభవం అని ఒకరు


‘నో ఫిల్టర్' టాస్కులో భాగంగా కంటెస్టెంట్లు అందరికీ ఎంతో బోల్డుగా ఉన్న ప్రశ్నలు వచ్చాయి. మరీ ముఖ్యంగా యాంకర్ శివకు ‘మీరు ఎప్పుడైనా పెళ్లైన మహిళతో డేట్ చేశారా' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికతడు ‘అవును. నాకు అప్పట్లో ఒక ఆంటీతో ఎఫైర్ ఉండేది. నా మొదటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఆమెతోనే' అంటూ బదులిచ్చాడు. దీంతో అందరూ కేకలేస్తూ అల్లరి చేశారు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants List | Bigg Boss Telugu OTT | Oneindia Telugu
120 మందితో అని మరొకరు ఇలా

120 మందితో అని మరొకరు ఇలా


‘నో ఫిల్టర్' టాస్కులో నటరాజ్ మాస్టర్‌కు ‘మీకు పెళ్లికి ముందు ఎంత మందితో ఎఫైర్ ఉంది' అన్న ప్రశ్న వచ్చింది. దీనికాయన ‘దాదాపు 120 మందితో ఉండేది. వాళ్లందరూ నన్ను లవ్ చేశారు. కానీ, నేను చేయలేదు' అని నోరుజారి కవర్ చేసుకున్నాడు. ఆ తర్వాత మహేశ్ విట్టా ‘వాళ్లందరూ ఇప్పుడు ఓట్లు వేస్తే మీరు టాప్ 5కి వచ్చేస్తారు' అని పంచ్‌లు కూడా వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X