Bigg Boss Non Stop : అషుని దారుణంగా ఆడుకున్న తేజస్వి.. నన్ను చూసి జలస్ అంటూ నోరు మూయించి!
బిగ్బాస్ నాన్ స్టాప్ లో భాగంగా 17 మంది సెలబ్రిటీలను హౌస్ లోపలికి పంపించిన సంగతి తెలిసిందే. అయితే అందులో గత సీజన్లో కంటెస్టెంట్ లకు వారియర్స్ అని పేరు పెట్టగా కొత్తగా వచ్చిన వారి పేర్లు చాలెంజర్లు అని విభజించిన బిగ్ బాస్ యాజమాన్యం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టే విధంగా అనేక టాస్క్ లను సిద్ధం చేసింది. అందులో భాగంగానే రెండు టీములు మధ్య అనేకసార్లు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక్కోసారి ఒకే టీమ్ కు చెందిన సభ్యుల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది.. వివరాల్లోకి వెళితే

వారియర్స్ కి టాస్క్
తాజాగా వారియర్స్ కి బిగ్ బాస్ నిర్వాహకులు ఒక టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా వారు గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో వారు చేసిన పొరపాట్లు ఏమిటి? ఆ పొరపాట్ల వల్ల నేర్చుకున్నది ఏమిటి? అనేది అందరి ముందు అర్థం అయ్యేలా చెప్పాలి అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత వారు చెప్పిన విషయాలు నచ్చితే కనుక చాలెంజర్స్ సభ్యులు థంబ్స్ అప్ చూపించవచ్చు.

నీకోసం ఆడుతున్నావా?
అలాగే వారిని కొన్ని విషయాల మీద ప్రశ్నించే అవకాశం కూడా దొరుకుతుంది. అలా తన అనుభవాలను అషూ బయట పెడుతున్న సమయంలో యాంకర్ శివ కల్పించుకుని 'జనాల కోసం ఆడుతున్నావా'? నీకోసం ఆడుతున్నావా? అని ప్రశ్నించాడు. ఆ సమయంలో శివ వెనకాల ఉన్న తేజస్వీ కల్పించుకుని ఎస్ థాంక్యూ మై ఫ్రెండ్ అంటూ వెటకారంగా అషును టార్గెట్ చేస్తూ మాట్లాడింది.

నీకోసం ఆడుతున్నావా?
ఆమె అలా అంటూ ఉండగా అషు హర్ట్ అయింది కానీ మళ్ళీ తేజస్వి కల్పించుకుని జనాలు చూస్తున్నారు కాబట్టి అలా ఉండాలి అనే ఆలోచన నీకు ఎప్పుడూ ఉంది, అది కూడా జనానికి కనిపిస్తుంది కదా అంటూ కౌంటర్లు వేసి కిచెన్ సెక్షన్ లోకి వెళ్ళిపోయింది. అయితే దానికి అషూ బాధపడుతూ నేను మాట్లాడుతున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు అని కోరింది.

నోరు మూయించే ప్రయత్నం
ఆ వెంటనే తగులుకున్న తేజస్వి నేను నటరాజ్ మాస్టర్ తో ఆరోజు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయి కామెంట్లు చేశావు అని అంటూ ఉండగా అది నా కళ్ళ ముందే జరిగింది అని అషు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఆమెను మాట్లాడనివ్వకుండా వెంట వెంటనే కౌంటర్లు వేస్తూ తేజస్వి ఆమె నోరు మూయించే ప్రయత్నం చేసింది.

కన్విన్స్ చేయడానికి
అయితే ఆ తర్వాత అషుని వాష్ రూమ్ కి తీసుకువెళ్లి కన్విన్స్ చేయడానికి అరియానా ప్రయత్నించింది. కానీ ఈ విషయాన్ని నామినేషన్ల వరకు తీసుకు వెళ్లడం నాకు ఇష్టం లేదు కానీ ఆమె ఇలాగే సాగతీస్తే కనుక దీనిని అక్కడి వరకు తీసుకు వెళతాను అని చెప్పుకొచ్చింది.

వంట చేసుకుంటూనే
అయితే తేజస్వి మాత్రం ఈ విషయాన్ని అక్కడితో వదలకుండా నట్రాజ్ మాస్టర్ తో వంట చేసుకుంటూనే డిస్కషన్ పెట్టింది. ఇంట్లోకి రాగానే నువ్వు మోస్ట్ జలస్ ఫీలయ్యే మనిషి తో గొడవ పెట్టుకుంటావు, టఫ్ అని ఫీల్ అయిన వాళ్ళని గొడవలోకి లాగడానికి ప్రయత్నిస్తావు అంటూ తనని అషు టార్గెట్ చేసింది అనే విషయాన్ని జనానికి అర్ధమయ్యే విధంగా నట్రాజ్ మాస్టర్ తో మాట్లాడుతున్నట్లు ఆమె వెల్లడించే ప్రయత్నం చేసింది.


Click it and Unblock the Notifications











