Bigg Boss NonStop : ఈసారి కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ఔట్.. నిలబడుతుందనుకుంటే పంపేస్తున్నారే!

ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో వారం చివరికి చేరింది. ఎప్పటిలాగే ఆదివారం నాడు ఒకరు హౌస్ లోపల నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం మీద ప్రతి వారం లాగానే ఈ వారం కూడా లీకులు బయటకు వచ్చాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

17 మందిని

17 మందిని

ఈ సారి బిగ్ బాస్ యాజమాన్యం 17 మందిని హౌస్ లోపలికి పంపింది ముందుగా వారిలో కొంతమంది వారియర్లు అని కొంత మందిని ఛాలెంజర్ లు అని పేరు పెట్టి విభజించి వారి చేత ఆటలు ఆడింది. ఆ తర్వాత వారిద్దరినీ కలిపేసి ఇక మీదట చాలెంజర్లూ, వారియర్లు అని వేరువేరుగా ఉండదు అని కూడా చెప్పుకొచ్చింది.

ప్రతి వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ 4 వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అజయ్, అరియానా గ్లోరీ, అనిల్ రాథోడ్, బిందు మాధవి, యాంకర్ శివ, సెవెన్ ఆర్ట్స్ సరయు, మిత్రశర్మ ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం మీద నుంచి పెద్ద ఎత్తున రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

డబల్ ఎలిమినేషన్

డబల్ ఎలిమినేషన్

అంతే కాక ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దానికి తగ్గట్లుగానే మొదటి వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమెను మరలా హౌస్ లోపలికి పంపించే ఉద్దేశంతోనే మొదటి వారం ఎలిమినేట్ చేశారని ముందుగా మాట్లాడుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఆమె మళ్ళీ హౌస్ లోపలికి వెళ్లబోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

అయితే ఈ విషయం నిజంగా జరుగుతుందా లేదా అనేది తెలియదు కానీ ఇప్పుడు డబల్ ఎలిమినేషన్ కూడా అనుమానంగానే కనిపిస్తోంది. డబల్ ఎలిమినేషన్ ఉంటుందని అందులో అనిల్ రాథోడ్, మిత్రశర్మ లను బయటకు పంపించే అవకాశం ఉంటుందని ఓటింగ్ లెక్కల ప్రకారం అంచనాలు వెలువడ్డాయి.

తాజా లెక్కల ప్రకారం

తాజా లెక్కల ప్రకారం

కానీ తాజా లెక్కల ప్రకారం ఈ వారం 7 ఆర్ట్స్ సరయు హౌస్ లోపల నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఓటింగ్ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఎలిమినేషన్ కోసం ఉన్న కంటెస్టెంట్ లలో బిందుమాధవి, శివ, అరియనా, ఈ ముగ్గురికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఓట్లు కూడా వీరికి బాగానే పడుతున్నాయి అని చెప్పవచ్చు.. వీరి తర్వాత జనానికి తెలిసిన పేరు సరయు మాత్రమే కాబట్టి ఆమెకు కూడా ఓట్లు పడతాయని అందరూ అనుకున్నారు..

జనానికి పెద్దగా తెలియదు కాబట్టి అనిల్ రాథోడ్, మిత్రశర్మ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోవచ్చు అని ప్రచారం జరిగింది. కానీ జరిగింది మాత్రం వేరుగా కనిపిస్తోంది. ఇక్కడ ఓట్ల లెక్కలను అసలు పరిగణలోకి తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఈ వారం మాత్రం సరయు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

సరయు ఎలిమినేట్

సరయు ఎలిమినేట్

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న మొదటి వారం బయటకు వెళ్ళిపోయింది. బిగ్ బాస్ ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చినా ఇప్పుడు కూడా ఆమె సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు అని అంటున్నారు.. ముఖ్యంగా హౌస్ లో ఉన్న కొంత మందితో ఆమె గొడవ పెట్టుకుంటున్న తీరు అందరికీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆమెను బయటకు పంపే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి అని అంటున్నారు.

అందులో భాగంగానే ఎలిమినేట్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో లీకులు బయటకు వచ్చాయి.. అయితే డబల్ ఎలిమినేషన్ ఉండవచ్చు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ చేయాల్సి వస్తే సరయుతో పాటుగా అనిల్ ని కూడా హౌస్ నుంచి బయటకు పంపే సూచనలున్నాయి.. మిత్రశర్మ అనే ఎవరికీ తెలియకపోయినా ముందు నుంచి కూడా బిగ్ బాస్ ఆమెను కాపాడుతూ వస్తున్న ఫీలింగ్ కలుగుతోంది జనానికి.

రిఎంట్రీ

రిఎంట్రీ

కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే అసలు ఏమాత్రం లేవు అని భావిస్తున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.. ఇక ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం ఆదివారం నాడు నాగార్జున క్లారిటీ ఇవ్వబోతున్నారు అయితే ఇది డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా సింగిల్ ఎలిమినేషన్ ఉండబోతుందా అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అలాగే ఒకవేళ ముమైత్ ఖాన్ కనుక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే ఆమె ప్రభావం ఆట మీద ఎలా ఉండబోతుంది అనే విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇచ్చినా సరే ఆమె అయితే ఆటను ప్రభావితం చేసే అవకాశాలు లేవు అని కొందరు భావిస్తున్నారు. మరి చూడాలి ముమైత్ ఖాన్ రిఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X