Bigg Boss Nonstop : అఖిల్ సరయు మధ్య లవ్ ట్రాక్.. ఆ మాటలకు అర్ధం అదేనా? ప్లానింగ్ మాములుగా లేదుగా!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ షో ఫార్మేట్ ఉండటంతో అలవాటు పడేందుకు కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే షో మొదలైన రెండు రోజులకే నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో హౌస్ సభ్యుల మధ్య వాడి వేడి చర్చలు జరిగాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ షో మొత్తాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే గతంలో ముందే వెళ్లిపోయిన కొంతమంది కంటెస్టెంట్ లను మళ్ళీ తీసుకువచ్చి హౌస్ లో ప్రవేశ పెట్టడంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే లవ్ ట్రాక్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఫినాలే వరకు వెళ్లి

ఫినాలే వరకు వెళ్లి

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా ఎంటరైన అఖిల్ సార్థక్ ముందు ప్రేక్షకులు ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ ఫోర్ లో అతని ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోహెల్ తో స్నేహం చేస్తూ స్నేహం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిన ఆయన మనస్తత్వం కొంత మందికి నచ్చింది కూడా. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫినాలే వరకు వెళ్లి రన్నరప్గా నిలిచారు. ఆయన ఈ నాన్ స్టాప్ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

కప్పు గెలవాలని

కప్పు గెలవాలని


బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో బోల్డ్ కంటెస్టెంట్ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చిన సరయూ ఎవరూ ఊహించని విధంగా మొదటి వారమే హౌస్ లో నుంచి బయటికి వెళ్లి పోవాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ మరో అవకాశం ఇవ్వడంతో ఆమె కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సారి ఎలా అయినా కప్పు గెలవాలని ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు కనిపిస్తోంది.

సార్థకం చేసుకునేందుకు

సార్థకం చేసుకునేందుకు


అయితే హౌస్ లో చివరివరకూ కొనసాగాలి అంటే దానికి లవ్ ట్రాక్ ఒక్కటే దారి అనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ నడిపేందుకు కంటెస్టెంట్ లు ఆసక్తి చూపిస్తున్నారు. యాంకర్ శివ ఇప్పటికే అదే పనిలో ఉండగా ఇప్పుడు కొత్తగా అఖిల్ సార్థక్ కూడా అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.. ముందు నుంచి అఖిల్ కు కాస్త పులిహోర రాయుడు అనే పేరు ఉంది ఇప్పుడు దాన్ని సార్థకం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

అఖిల్ మీద ఇంట్రెస్ట్

అఖిల్ మీద ఇంట్రెస్ట్


అయితే సరయు కూడా అఖిల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా ఉంది. తాజాగా అజయ్, ముమైత్ ఖాన్, సరయు, అఖిల్ ఒకచోట కూర్చుని ఉండగా వీరందరి మధ్య అదే డిస్కషన్ వచ్చింది. అఖిల్ మీద తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని వెల్లడించింది.

ముఖం ఎర్ర బడడంతో

ముఖం ఎర్ర బడడంతో


అయితే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అంటే కనీసం సమయం స్పెండ్ చేయాలి కదా అలా స్పెండ్ చేసే అవకాశమే లేకుండా పోతుందని ఆమె బాధ పడింది. ఆమె అలా అంటుంటే అఖిల్ మరోపక్క ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. అదే సమయంలో అఖిల్ ముఖం ఎర్ర బడడంతో ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ అజయ్, ముమైత్ ఖాన్ ఇద్దరిని ఆట పట్టించారు. ఈ వ్యవహారం చూస్తుంటే త్వరలోనే కొత్త లవ్ ట్రాక్ మొదలయ్యే అవకాశం ఉంది అని చెప్పక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X