Bigg Boss Nonstop : ఓవరాక్షన్ మాములుగా లేదుగా.. అరియానాని ముద్దడిగిన యాంకర్ శివ.. ఎక్కడ ఇవ్వాలంటే?
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షో ప్రారంభమయి ఒక వారం కావస్తుంది. మధ్యలో లైవ్ స్ట్రీమింగ్ ఆపి వేశారు కానీ లోపల మాత్రం ఎలాంటి బ్రేకులు లేకుండానే హౌస్ కొనసాగుతోంది. శనివారం కావడంతో నాగార్జున రాబోతున్నారు. ఒకరిని ఎలిమినేట్ కూడా చేయబోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే యాంకర్ శివ అరియానాను ముద్దు అడిగిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యాంకర్ శివ ఎందుకు అరియానాను ముద్దు అడిగాడు? అనే వివరాల్లోకి వెళితే...

సేవలు చేయాలి
బిగ్ బాస్ షోలో గత సీజన్లో పాల్గొని వచ్చినవారిని వారియర్స్ గా, కొత్తగా వచ్చిన వారిని ఛాలెంజర్స్ గా విభజించి సంగతి తెలిసిందే. చాలెంజర్స్ కు వారియర్స్ సేవలు చేయాలి అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. వారియర్స్‌కు పనులు కేటాయించేందుకు బిగ్ బాస్ జాబ్ మేళా పెట్టగా అందులో వారియర్స్‌ను చాంఫియన్స్ ఇంటర్వ్యూ చేసి పనులు కేటాయించారు. ఆ పనులకు సంబంధించిన ట్యాగ్‌ను వారికి ఇచ్చారు.

టీములుగా
అలా ఫైనల్ గా ఛాలెంజర్స్ అందరూ డిసైడ్ చేసుకొని.. నటరాజ్ మాస్టర్, తేజస్వి,అరియనా, అఖిల్ లను చెఫ్ లుగా ఎంపిక చేశారు. హౌస్ కీపింగ్ టీమ్ గా.. అషు, మహేష్, హమీద, సరయులను ఎంపిక చేశారు. మేనేజర్ గా ముమైత్ ను ఫైనల్ చేశారు. అయితే వాళ్లకు ఇచ్చిన ట్యాగులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని బిగ్ బాస్ సూచించారు. దీంతో ఆ ట్యాగ్లను దక్కించుకుని వాటి ద్వారా వారియర్స్ టీమ్ సభ్యులను ఇబ్బంది పెట్టడానికి చాలెంజర్స్ టీం సభ్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కూడా.

దాన్ని అడ్డు పెట్టుకుని
అయితే ఆ టాగ్ ను అడ్డం పెట్టుకుని ఇప్పుడు యాంకర్ శివ అరియానను ముద్దు కావాలని అడగడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఉదయాన్నే డి విటమిన్ కోసం గార్డెన్ ఏరియాలో అరియాన, యాంకర్ శివ ఇద్దరు కూర్చున్నారు. ఆ సమయంలో అది ఎక్కడ ఉందో నీకు చూపిస్తాను అని యాంకర్ శివ అంటాడు. కానీ దానికి ఒక పనిష్మెంట్ ఉంటుందని కూడా అంటాడు. అది అంటే చెఫ్ ట్యాగ్ ఆ? సరే ఏమిటి ఆ పనిష్మెంట్ అని ఆమె అడుగుతుంది.

క్లారిటీ లేదు
దీంతో శివ ఇక్కడ కూర్చుని ముద్దు పెట్టాలి అని అడుగుతాడు. అయితే ఎక్కడ కూర్చుని, ఎక్కడ ముద్దు పెట్టాలి అని అడిగాడు అనే విషయం మాత్రం అర్థం కాకుండా టెలికాస్ట్ చేశారు. నిజానికి షో ప్రారంభమైన నాటి నుంచి యాంకర్ శివ ఏదో ఒక లేడీ కంటెస్టెంట్ తో లవ్ ట్రాక్ నడపాలని ఉద్దేశంతో వచ్చినట్లు కనిపిస్తోంది.

ఎబ్బెట్టుగా
మిత్రశర్మ మొదలు బిందుమాధవి, ఆరియానా ఇలా ఎవరో ఒకరితో అయిన లవ్ ట్రాక్ కుదుర్చుకోవడానికి అనేక తంటాలు పడుతున్నాడు. శివ విషయం అర్థం చేసుకున్న ఆ భామలు కూడా అతనితో జాగ్రత్తగా అంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ముద్దు అడగడం అనేది మాత్రం కాస్త ఎబ్బెట్టుగానే అనిపిస్తోంది


Click it and Unblock the Notifications











