Bigg Boss Nonstop: అరియానాకి దిమ్మ తిరిగి పోయే షాకిచ్చిన శివ.. పాపం అరియానా డీల్స్ అన్నీ పాయే!

ఇప్పటికే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో 5 వారాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఐదుగురు హౌస్ మెట్స్ ఎలిమినేట్ కాగా అందులో ఒకరు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు హౌస్ కి తదుపరి కెప్టెన్ ఎవరు అని ఎన్నుకునే పనిలో పడ్డారు బిగ్ బాస్. దానికి సంబంధించిన తాజా ప్రో విడుదలైంది ఆ పురములలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి ఆ వివరాల్లోకి వెళితే.

రోబో టాస్క్

రోబో టాస్క్


బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో రోబో టాస్క్ అనేది ఆసక్తికరంగా స్టార్ట్ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఈ రోబో టాస్క్ ఆడమని ఇచ్చాడు బిగ్ బాస్. బజర్ మోగినపుడు రోబో పార్ట్స్ వస్తాయని, వాటిని కలక్ట్ చేసి కంపెనీ వాళ్లకి అమ్మి బిట్ క్వాయిన్స్ తీస్కోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా బిందు, అరియానా, అషూ కంపెనీ హోల్డర్స్ గా ఉన్నారు. మిగతా వాళ్లు రోబో పార్ట్స్ ని కలక్ట్ చేస్తూ డీలర్స్ గా ఉండాల్సి ఉంటుంది.

అషూరెడ్డి డీల్స్

అషూరెడ్డి డీల్స్

ఈ గేమ్ కు సంచాలక్ గా మహేష్ విట్టాని ఉంచాడు బిగ్ బాస్. ఇక ఈ ఆట ఎలా అయినా గెలవాలని హౌస్ లో ఎవరికి వారు డీల్స్ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా అషూరెడ్డి కాయిన్స్ ఇస్తూ డీల్స్ సెట్ చేసుకునే పనిలో పడింది. నటరాజ్ మాస్టర్ ని తన బొమ్మలని ప్రొటక్ట్ చేసే విధంగా డీల్ సెట్ చేస్కొని మిత్రాతో కూడా డీల్ సెట్ చేసుకుంది. ఇక అరియానాతో బొమ్మలని కాపాడుకునేందుకు మనం ట్రై చేయాలని కూడా ఒక డీల్ సెట్ చేసుకుంది.

బిందుతో డీల్

బిందుతో డీల్


లాస్ట్ లో ఒకవేళ నాకు బొమ్మలన్నీ రెడీ అయిపోతే కాయిన్స్ నీకు ఇచ్చేస్తా అని, దాని ద్వారా నువ్వు నీ బొమ్మలని రెడీ చేసుకోమని కూడా ఆమె డీల్ సెట్ చేసింది. యాంకర్ శివను కూడా ఆమె డీల్ చేసుకుందాం అని అడిగింది కానీ, శివ ముందుగానే బిందుతో డీల్ మాట్లాడుకున్నాడు. తన కాయిన్స్ అన్నీ లాస్ట్ లో వస్తాయని వేరే వాళ్లకి అమ్మి కాయిన్స్ కలక్ట్ చేస్తానని చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో శివ ఎక్కువ బొమ్మలని కలక్ట్ చేశాడు.

పార్ట్ లు దొంగతనం చేయడంతో

పార్ట్ లు దొంగతనం చేయడంతో


ఆరియానా దగ్గర పార్ట్ లు దొంగతనం చేయడంతో ఆమె శివ వెంట పడింది. నేను నీకు సపోర్ట్ చేద్దామనుకుంటున్నాను నాకు నువ్వు ఇలా చేస్తావా అంటూ అతని వెంట పడి అతని దగ్గర ఉన్న వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ పప్పులు ఏమి ఉడక లేదు. ఆమె వస్తువులు పోయాయి అని ఆమె బాధ పడుతుంటే నటరాజు మాస్టర్ దానికి మరింత ఆజ్యం పోసి ఇ ఆమె మరింత బాధ పడేలా చేస్తున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
 అఖిల్ కీలకంగా

అఖిల్ కీలకంగా


అయితే ముమైత్ ఖాన్ కూడా అరియానాతో కలిసి డీల్ సెట్ చేసింది. వాళ్లిద్దరూ కలసి గేమ్ ఆడుతున్నట్లుగా మిగతా హౌస్ మేట్స్ కి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నిజానికి సీజన్ 4లో కూడా ఇలాగే రోబో టాస్క్ అనేది గేమ్ మొత్తాన్ని మార్చేసింది. లాస్ట్ టైమ్ అరియానా, హారిక, అభిజీత్, అవినాష్ ఇలా అందరూ టాస్క్ లో తమ టాలెంట్ చూపించి అఖిల్ అండ్ కోని ఓడించారు. ఇప్పుడు అఖిల్ ఈ రోబో టాస్క్ ఎలా గెలుస్తాడు అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X