Bigg Boss NonStop : ఆ లేడీ కంటెస్టెంట్ తో పులిహోర కలిపిన యాంకర్ శివ.. మొహం మీదే చెప్పేసిందిగా!

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ప్రారంభమైంది కానీ ఈ కొత్త ఫార్మేట్ కి ప్రేక్షకులు ఇంకా అలవాటు పడినట్లు కనిపించడం లేదు. ఎప్పుడు ఏమి ప్రసారమవుతుంది అనే విషయం అర్థం కాక కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ప్రేక్షకులు ఇంకా లైన్లో పడలేదు కానీ లోపల కంటెస్టెంట్ లు మాత్రం దుమ్ముదులిపే పనిలో పడ్డారు.. అప్పుడే ఫిమేల్ కంటెస్టెంట్ లతో మేల్ కంటెస్టెంట్ లు పులిహోర కలిపే పనిలో పడ్డారు. అరియానా గ్లోరీతో పులిహోర కలిపేందుకు యాంకర్ శివ ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. విషయం అర్థం చేసుకున్న అరియనా ఎప్పటిలాగే తన అతి ప్రవర్తనతో ఆయన నోరు మూయించింది. ఆ వివరాల్లోకి వెళితే..

 కాస్త వింతగా

కాస్త వింతగా

యూట్యూబ్ యాంకర్ గా తెలుగు ప్రజలందరికీ యాంకర్ శివ సుపరిచితమే. ఎక్కువగా కాంట్రవర్సీ అయిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తూ వారిని మరింత కాంట్రవర్సీకి గురిచేసే ప్రశ్నలడుగుతూ వారి సమాధానాలు యాంకర్ శివ ఫేమస్ అయ్యాడు. అతనితో ఏం మాట్లాడితే ఏం తంటానో? అని బయట సెలబ్రిటీలు భయపడుతూ ఉంటారు. కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం అతని ప్రవర్తన కాస్త వింతగా కనిపిస్తోంది.

సెట్ చేసుకోవాలని

సెట్ చేసుకోవాలని

ఎందుకంటే లోపలికి వచ్చి రాగానే లవ్ ట్రాక్ ఒకదానిని సెట్ చేసుకోవాలని శివ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని, ఎందుకంటే లోపలికి వచ్చి రావడంతోనే ఎవరో ఒక అమ్మాయితో జట్టు కట్టేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే నిన్న వచ్చి రావడంతోనే మిత్రశర్మతో పులిహోర కలిపేందుకు ప్రయత్నించడంతో ఆమె అన్న అనేసింది.

పులిహోర కలిపేందుకు

పులిహోర కలిపేందుకు

దీంతో అప్పటి నుంచి యాంకర్ శివ హర్ట్ అయ్యాడు. వచ్చి రాగానే అన్నయ్య అని బాంబు పేల్చావుగా అని ఆమె దగ్గర బాధపడుతున్నట్లు కూడా కనిపించింది. ఎవరైతే ఏముంది? అమ్మాయి అయితే చాలు కదా అన్నట్లు ఇప్పుడు అరియానా గ్లోరీతో కూడా పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు.

మెలికలు తిరిగి పోవడానికి

మెలికలు తిరిగి పోవడానికి

చపాతీలు తింటున్న సమయంలో బయట నీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని శివ ప్రశ్నించాడు. అతని ఉద్దేశం నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని అయితే అరియనా మాత్రం ఎప్పటిలాగే తన అతి ప్రవర్తన మొదలు పెట్టింది. బయట నా మీద ఆధారపడి పాల వాళ్ళు పేపర్ వాళ్ళు అలాగే చాలామంది ఉన్నారని కామెడీ చేసింది. శివ తనతో ఫ్లర్ట్ చేస్తున్నాడు అనే విషయం అర్థం చేసుకుని ఆమె ముందు తెగ మెలికలు తిరిగి పోవడానికి ప్రయత్నం చేసింది.

పులిహోర కలిపితే

పులిహోర కలిపితే

ఆ తర్వాత ఈ విషయం ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి అనుకుందో ఏమో ఇంతమంది ఉండగా ఫ్లర్ట్ చేసేందుకు నేనే కనబడ్డానా నాతో పులిహోర కలుపుతున్నావు? అంటూ యాంకర్ శివని ప్రశ్నించింది. శివ కూడా ఏమీ తక్కువ తిన్నట్టు కనిపించడం లేదు. అవును అమ్మాయిల్ని పడేయాలంటే ముందు పులిహోర కలపాలి కదా అందుకే కలుపుతున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు సైలెంట్ గా ముగించింది కానీ ఆ తరువాత నాకు పులిహోర కలిపితే మాత్రం ఎత్తి అక్కడ కూర్చో పెడతా చూసుకో అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. శివ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆమె మీద ఫోకస్ ఎవరి మీదకు షిఫ్ట్ చేస్తాడనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X