Bigg Boss Nonstop : పాపం శివ.. కెప్టెన్సీ ఆశలు గల్లంతు.. కొత్త కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారంటే?

తెలుగు పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఓటీటీ విజయవంతంగా నడుస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట నడుస్తున్న ఈ షోలో కంటెస్టెంట్స్ మధ్య ప్రస్తుతం కెప్టెన్సీ ఫైట్ నడుస్తోంది. 'బిగ్ బాస్' కెప్టెన్సీ కోసం ఇచ్చిన టాస్క్ ఈ సారి చాలా డిఫరెంట్ గా ఉంది. గతంలో నాలుగో సీజన్ లో ఇచ్చిన ఒక టాస్క్ ను పోలి ఉన్న ఈ టాస్క్ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఈసారి కెప్టెన్సీ పోటీదారుల్లో ఉన్న వారు ఎవరు గెలిచారు? ఎవరు గెలవలేదు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్'

‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్'

ఇప్పటిదాకా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ప్రకారం ఆడి గెలిచిన నలుగురు కెప్టెన్సీ పోటీదారుల టాస్ కోసం బరిలో దిగారు. యాంకర్ శివ, హమీదా, అషు రెడ్డి, ముమైత్ ఖాన్ ఎంపికయ్యారు. 'బిగ్ బాస్' ఇచ్చిన టా‌స్క్‌ను బిందు మాధవి చదివి వినిపించింది. ‘బిగ్ బాస్' కెప్టెన్ కావడానికి తోటి సభ్యుల మద్దతు కూడా ముఖ్యం కాబట్టి.. ఈ సారి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ‘బిగ్ బాస్'.. ‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్'.. టాస్క్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అషు రెడ్డిని కెప్టెన్సీకి

అషు రెడ్డిని కెప్టెన్సీకి

కంటెస్టెంట్స్ రీజన్స్ చెప్పి ఎవరు యూ ఆర్ నాట్ మై కెప్టెన్ అనేది చెప్పాలి. ఈ క్రమంలో వారు బాణాలు తమకు ఇష్టం లేని వారి మెడలో ఉన్న లవ్ సింబల్ మీద గుచ్చాలి. అలా కెప్టెన్సీ దగ్గర వరకు వచ్చిన శివ పైన కంటెస్టెంట్స్ అందరూ ‘యూఆర్ నాట్ మై కెప్టెన్' అని చెప్పారు. అయితే ఇదంతా జరగడానికి ముందు శివ అషు రెడ్డిని కెప్టెన్సీకి మద్దతివ్వాలని కోరాడు.

 వద్దని గోల గోల

వద్దని గోల గోల

అయితే, అషురెడ్డి మరి నాకేంటి అని అడిగింది. మొత్తంగా ఒకరి తర్వాత మరొకరు కంటెస్టెంట్స్ శివను ‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్' అని సెలెక్ట్ చేశారు. ద లేజియెస్ట్ పర్సన్ ఇన్ హౌజ్ శివ అని కూడా అరియానా తీర్పు ఇచ్చేసింది. ఆ తర్వాత ముమైత్ ఖాన్ ను ‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్' అని మహేశ్ బాణాలు గుచ్చి బోతుండగా, ముమైత్ వద్దని గోల గోల చేసింది.

శివ ఆశలు గల్లంతయ్యాయి

శివ ఆశలు గల్లంతయ్యాయి

ఇదంతా లో ప్రోమో లో చూపించగా తాజాగా బిగ్ బాస్ కొత్త కెప్టెన్గా అషురెడ్డి ఎంపికయినట్టు లీక్ అయిన సమాచారం అందుతోంది. యాంకర్ శివకు ఎక్కువగా యు ఆర్ నాట్ మై కెప్టెన్ అని బాణాలు గుచ్చు కోవడంతో ఇప్పటిదాకా కెప్టెన్ అవుతాడు అనుకున్న శివ ఆశలు గల్లంతయ్యాయి..

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
కెప్టెన్ ఎవరంటే?

కెప్టెన్ ఎవరంటే?

మిగతా వాళ్లతో పోలిస్తే అషు రెడ్డి పెద్ద గొడవలు పెట్టుకోకుండా అందరితో కాస్త సఖ్యతగా మెలగడం తో ఆమె కెప్టెన్ అయ్యేందుకు మార్గం సుగమమైంది.. ఇక ఆమె రేషన్ మేనేజర్ గా ఎవరిని తీసుకుంటుంది అనేది షో లోనే చూసి తెలుసుకోవాలి. ఆమె కెప్టెన్ అయింది కాబట్టి ఒక వారం పాటు ఆమె సేఫ్ జోన్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. చూడాలి రాబోతున్న ఎపిసోడ్స్ లో ఇంకా ఏమేం విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X