Bigg Boss 6కి యాంకర్ శివ సహా మరికొందరు.. ఎవరెవరు పేర్లు ఉన్నాయంటే?

ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ -1 ఎట్టకేలకు అంతిమ దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ -1 విన్నర్ ఎవరు అనేది తేలిపోనుంది. అయితే ఈ సిరీస్ లో విన్నర్ ఎవరు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా సీజన్ 6 గురించి కూడా చర్చ మొదలైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సీజన్ 6లో యాంకర్ శివ అవకాశం సాధించాడని అంటున్నారు. ఆ వివరాలు

 సక్సెస్ అవ్వలేదు

సక్సెస్ అవ్వలేదు

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ -1కి బాగా పెర్ఫామ్ చేసిన పార్టిసిపెంట్స్ ని ఇప్పుడు సీజన్ - 6లో నేరుగా టెలివిజన్ లోకి సెలెక్ట్ చేయబోతున్నట్లుగా కొత్తగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీజన్ - 6లో వెళ్ళబోయేది వీరే అంటూ కొంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈసారి సీజన్ అనేది ఓటీటీలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

బాగా హైలెట్ అయ్యారు

బాగా హైలెట్ అయ్యారు

ఎందుకంటే మాములుగా టెలివిజన్ లో ప్రసారం అయ్యే షోకి వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే, కొంతమంది పార్టిసిపెంట్స్ మాత్రం బాగా హైలెట్ అయ్యారు. ఈ క్రమంలోనే అలా హైలైట్ అయిన కొంత మందిని సీజన్ - 6లో తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాంకర్ శివ, మిత్రా శర్మ, అజయ్, ఆర్జే చైతూ వంటి వారు ఈ లిస్టులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వీరితో పాటు అనిల్ రాథోడ్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.

సీజన్ 6కి అనుమానమే

సీజన్ 6కి అనుమానమే

బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాల్టీ షోలో కంటెస్టెంట్లుగా ఎవరు వుండబోతున్నారో, ఆ షో ప్రారంభానికి నెలల ముందే ఓ లిస్ట్ బయటకు వచ్చేసింది. అందులో పేర్లు దాదాపుగా అలాగే ఫైనల్ లిస్టులో కనిపించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ ఫైవ్, సీజన్ ఫోర్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఇక ముందు నుంచి బిందు మాధవి పేరు కూడా వినిపించి కానీ ఆమె ఈ సీజన్ లో విన్నర్ అవుతోంది కాబట్టి సీజన్ 6కి అనుమానమే.

అప్రోచ్ అయి

అప్రోచ్ అయి

ఇక ఈ సీజన్లో ఉన్న నలుగురు ఐదుగురు మాత్రమే కాక ప్రస్తుతం జబర్దస్త్ టీమ్ లో కొంతమందితో బిగ్ బాస్ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నారు. అలాగే, ఫేడ్ అవుట్ అయిన మాజీ హీరోయిన్స్ ని కొందరిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్లుగా సమాచారం. ఇక అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే కనుక బిగ్ బాస్ సీజన్ - 6 ని కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.

ఆగస్టు 7వ తేదీ?

ఆగస్టు 7వ తేదీ?

అందుతున్న సమాచారం మేరకు జూలై 31వ తేదీ, లేదా ఆగస్టు 7వ తేదీన ఈ షోని స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇక వచ్చే సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది. సీజన్ 3 నుంచి ఆయనే బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X