Bigg Boss Nonstop: షాకింగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్.. ఇప్పుడు మిస్సైతే అప్పుడు?
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో విజయవంతంగా సాగుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకుని ఆరో వారం చివరికి చేరుకుంటోంది. ఈ క్రమంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

రీ ఎంట్రీ
ఈ నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 4 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయు బయటకు వెళ్లారు. అయితే ముమైత్ ఖాన్ మాత్రం రీ ఎంట్రీ ఇచ్చింది.

సేఫ్ అయ్యారు
ఆరో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ టాస్క్ ఎన్నో గొడవలతో సాగింది. అయితే ఇందులో మొత్తంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్‌లు ఉన్నారు. కెప్టెన్ అఖిల్‌తో పాటు ఆరియానా గ్లోరీ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది.

డబల్ ఎలిమినేషన్
అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆరో వారం నామినేషన్స్ లో ఉన్న వారికి బిగ్ బాస్ షాకివ్వబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని అంచనాలు వెలువడుతున్నాయి.

ఏదొక వారం
ఎవరూ ఊహించని విధంగా ముమైత్ ఖాన్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ముమైత్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత ఐదవ వారంలో మళ్లీ హౌస్ లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ముమైత్ రాకతో కచ్చితంగా ఏదొక వారం డబల్ ఎలిమినేషన్ చేయాలి, అయితే అది ఈ వారమే ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

వెళ్లి పోయే అవకాశం
ఓటింగ్ లెక్కల ప్రకారం బిందు మాధవి టాప్ ప్లేస్ లో, యాంకర్ శివ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మహేష్ విట్టా, హమీద, అషురెడ్డి ఉన్నారని అంటున్నారు. ఇక మిగిలిన నామినేట్ అయిన అందరూ వాళ్లు డేంజర్ జోన్ లో ఉన్నారు. అజయ్, మిత్రా శర్మ , ముమైత్ ఖాన్, స్రవంతికి తక్కువ ఓట్లు పోల్ అయినట్లు చెబుతున్నారు. ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగితే ఈ నలుగురిలో ఇద్దరు ఇంటికి వెళ్లి పోయే అవకాశం ఉంది.

మిడ్ వీక్ ఎలిమినేషన్
ఒక వేళ ఒక మేల్, ఒక ఫిమేల్ ని పంపించాలనుకుంటే స్రవంతి, అజయ్ లు బయటకు వెళ్లొచ్చు. మిత్రాశర్మను మొదటి నుంచి బిగ్ బాస్ ఎందుకో వెనకేసుకు వస్తున్నాడు కాబట్టి ఆమె ఈ వారం కూడా సేవ్ అవుతుందని అంచనా. ఇక అజయ్, స్రవంతి కాకుండా ముమైత్, స్రవంతిని బయటకు పంపించేసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇది బిగ్ బాస్ కాబట్టి. అయితే ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ లేకుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎవరు బయటకు వస్తారు
అయితే ఇప్పటిదాకా అది తమిళ బిగ్ బాస్ లో జరిగింది కానీ మనదగ్గర జరగలేదు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం ఒకరిని ఎన్నుకుని వారిని ఎలిమినేటి చేస్తారు. అదే జరిగితే కంటెస్టెంట్స్ ఎవరు బయటకు వస్తారు అన్నాది కూడా ఆసక్తికరమే. చూడాలి మరి ఏమవుతుందో?


Click it and Unblock the Notifications











