Bigg Boss Nonstop : కంటెస్టంట్ లకు షాక్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరూ ఔట్ కానున్నారా?
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికి మూడు వారాలు విజయవంతంగా సాగింది. మూడు వారాలలో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఈ నాలుగోవారం ఎలిమినేషన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చెప్పలేని విధంగా మారింది. రోజుకి ఒకరు ఓటింగ్ లిస్ట్ లో లీస్ట్ కు వెళుతున్నారు. అన్ అఫీషియల్ పోలింగ్స్ చూస్తుంటే ఈసారి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా? లేక ఫిమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా అనేది కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ వారం ఏకంగా ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఏకంగా 17 మంది
బిగ్ బాస్ నాన్ స్టాప్ గా పేరు పెట్టిన ఈ ఓటీటీ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 3 వారాల్లో మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక, మూడో వారం ఆర్జే చైతూలు ఎలిమినేట్ అయిపోయారు.

మూడో వారంలో
బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడో వారం నామినేషన్స్ ప్రకారం బిందు మాధవి, స్రవంతి చోకారపు, మిశ్రా శర్మ, మహేశ్ విట్టా, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్, అజయ్, ఆర్జే చైతూ, తేజస్వీలు నామినేట్ అయ్యారు. నాలుగో వారం నామినేషన్స్‌లో ఉన్న బిందు ఎక్కువ ఓట్లతో టాప్‌లో ఉందట. లాస్ట్ వారం అఖిల్ కి టఫ్ ఫైట్ ఇచ్చిన బిందుమాధవి తన ఓటింగ్ పర్సెంటేజ్ ని అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోంది.

యాంకర్ శివ కూడా
ఆమె తరువాత సెకండ్ ప్లేస్ లో యాంకర్ శివ ఉన్నాడు. యాంకర్ శివ కూడా దాదాపుగా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడని అంటున్నారు. అనఫిషియల్ వోటింగ్ లెక్కల ప్రకారం వీరిద్దరి తర్వాత అరియానా, అజయ్ వీరిద్దరూ ఉన్నారు. వీరిద్దరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అయితే, అరియానా అజయ్ మధ్య హోరాహోరీ జరుగుతోంది అని ఒక్కోసారి అరియాణా లీడింగ్ లోకి వస్తె ఒక్కోసారి అజయ్ లీడింగ్ లోకి వస్తున్నాడని తెలుస్తోంది.

సేఫ్ జోన్ లోనే
వీరి తర్వాత సరయు కూడా ఈసారి సేఫ్ జోన్ లోనే ఉందని అంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలోనే ఎలిమినేషన్ జరుగుతుందని అంటున్నారు. మిత్రాశర్మా ఇంకా అనిల్ రాధోడ్ వీరిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

డబుల్ ఎలిమినేషన్
అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు ? ఈసారి మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారా ? లేదా ఫిమేల్ కంటెస్టెంట్ ని చేస్తారా అనే చర్చ జరుగుతూ ఉండడంతో ఇద్దరినీ ఎలిమినేట్ చేసే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు అని టాక్. అయితే ఇప్పటి వరకు ఈ విషయం మీద క్లారిటీ లేదు కానీ ఎప్పటిలాగే శనివారం సాయంత్రానికి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











