Bigg Boss NonStop : అషు రెడ్డి మీద దారుణమైన పని చేసిన చైతు.. షాకయిన హౌస్ మేట్స్ .. అసలు ఏమైందంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైన రెండో రోజే ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవడమే కాక వారి మధ్య గొడవలు కూడా ప్రారంభం అయ్యే విధంగా ఇప్పటికే బిగ్ బాస్ నాన్ స్టాప్ నిర్వాహకులు ఒక చాలెంజ్ కూడా ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళితే

వారియర్స్ టీం కి బిగ్ బాస్ షాక్
ఒకరకంగా సీనియర్స్ గా భావిస్తున్న వారియర్స్ టీం కి బిగ్ బాస్ షాకిచ్చాడు. ఇక మీదట హౌస్ లో ఎలాంటి బెనిఫిట్స్ కావాలి అనుకున్నా జూనియర్స్ అయిన ఛాలెంజర్స్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన విధంగా కొన్ని రూల్స్ పెట్టాడు. బిగ్ బాస్ కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం కేవలం కొత్త కంటెస్టెంట్ లకు మాత్రమే బెడ్రూం యాక్సెస్ పరిమితం చేశారు. ఛాలెంజర్స్ అనుమతి లభిస్తే వారియర్స్ లో ఒకరికి బెడ్రూంలో నిద్రపోయే అవకాశం ఇవ్వడానికి ఛాలెంజర్స్ కు అనుమతి ఇచ్చారు.

లగేజ్ కూడా
అంతేకాక వారియర్స్ కు సంబంధించిన పూర్తి లగేజ్ కూడా ఛాలెంజర్స్ కంట్రోల్ లోకి వెళ్ళింది. లగేజ్ నుంచి ఒక్కొక్క వారియర్ ఐదు వస్తువులు మాత్రమే తీసుకోవాలి కానీ ఆ వస్తువులు తీసుకోవాలి అన్నా సరే ఛాలెంజర్స్ అనుమతి కావాల్సిందే. అంతేకాక రూల్ ప్రకారం చాలెంజర్స్ అందరూ భోజనం చేసిన తర్వాత వారియర్స్ భోజనం చేయాలి. అంతేకాక వారియర్స్ మాత్రమే ఒకచోట కూర్చుని భోజనం చేయాలి అని కూడా బిగ్ బాస్ ఒక లేఖ ద్వారా తెలియజేశాడు.

జాబ్ మేళా
వారియర్స్ లో ఉన్న వాళ్ళందరూ పాత కంటెస్టెంట్ లు కాబట్టి వారికి ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి వారికే ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి ఇంటి పనులన్నీ ఇకమీదట వారియర్స్ మాత్రమే చేయాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు.. చెప్పిన పనులు చేయకపోయినా బిగ్ బాస్ రూల్స్ తప్పినా వారియర్స్ ను శిక్షించే అవకాశాన్ని కూడా ఛాలెంజర్స్ కు బిగ్ బాస్ కల్పించాడు. అందులో భాగంగానే వారియర్స్ అందరికీ పనులు కేటాయించడం కోసం ఒక జాబ్ మేళా కూడా బిగ్ బాస్ ఏర్పాటు చేశాడు.

వారియర్స్ కు బాధ్యతలు
ఆ జాబ్ మేళాలో భాగంగా చాలెంజర్స్ అందరూ మాట్లాడుకుని నట్రాజ్ మాస్టర్, తేజస్వి, అరియానా, అఖిల్ లకు చెఫ్ బాధ్యతలు అప్పగించారు. మరో పక్క అషు రెడ్డి, మహేష్ విట్టా, హమీద, సరయులను హౌస్కీపింగ్ టీంగా ఏర్పాటు చేశారు. వీరందరికీ ముమైత్ ఖాన్ మేనేజర్గా వ్యవహరించనుంది. అంతా బాగానే ఉంది కానీ ఛాలెంజర్స్ ఇప్పుడు వారియర్స్ తో సేవలు చేయించుకోవచ్చు అనే రూలు ఉండడంతో చైతూ మంచినీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు.

ముఖం మీద ఊసేసి
దీంతో అషు వెళ్లి మంచి నీళ్లు వాటర్ బాటిల్ నిండా తీసుకువచ్చింది. తీసుకు వచ్చిన తర్వాత ఆ మంచినీళ్లు తాగించమని అడిగాడు. అలా తాగిస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా తన నోట్లో ఉన్న నీళ్లు అషు మొహం మీద పడేలా ఊసేశాడు చైతు. దీంతో అషు సహా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయ్యారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగించడం వల్ల నోట్లో వాటిని ఉండబట్టలేక ఊసేశాను అని చైతు క్లారిటీ ఇచ్చాడు. కానీ చైతూ కావాలనే చేశాడనే విషయం చూసిన వారందరికీ ఇట్టే అర్థం అవుతుంది. అయితే ఈ విషయాన్ని అషు సీరియస్ గా తీసుకోకపోవడంతో అక్కడితో సాల్వ్ అయినట్లు అయింది.


Click it and Unblock the Notifications











