Bigg Boss NonStop: పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు బంపర్ ఆఫర్, చైతూ ఏమన్నాడంటే?

బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ గా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో నిరంతరం 24 గంటలు ఈ షో ప్రసారమవుతోంది. అయితే షో ప్రసారమవడం ప్రారంభమైన రెండో రోజు హౌస్ లో సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.. చాలెంజర్లు, వారియర్లు అంటూ రెండు టీములుగా విభజించడంతో హౌస్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తనను పెళ్లి చేసుకుంటావా అంటూ ఆర్జే చైతుని వివాదాస్పద భామ సరయు ప్రశ్నించగా దానికి చైతు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

హౌస్ కి అలవాటు పడేందుకు

హౌస్ కి అలవాటు పడేందుకు

ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో సరదా సరదాగా సాగుతుంది. ఇంకా ప్రారంభమై ఎక్కువ రోజులు గడవక పోవడంతో హౌస్ సభ్యుల మధ్య పూర్తిస్థాయిలో గొడవలు లాంటివి ఏవీ ప్రారంభం కాలేదు.. ఇప్పుడిప్పుడే హౌస్ కి అలవాటు పడేందుకు హౌస్ సభ్యులు ప్రయత్నిస్తుండగా బిగ్ బాస్ కూడా వారికి పూర్తిస్థాయిలో ఇంకా టాస్క్ లు లాంటివి ఏమీ ఇవ్వకుండా వారికి అలవాటు పడేందుకు అవకాశం ఇస్తున్నారు.

నిద్రలేపి సమాయత్తం

నిద్రలేపి సమాయత్తం


పెద్దగా పని కూడా లేకపోవడంతో హౌ సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అందరికంటే ముందు నిద్రలేచిన ఆర్జే చైతూ తర్వాత కెమెరా దగ్గరకు వెళ్లి కబుర్లు చెబుతూ కనిపించాడు.. మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉదయాన్నే పాట పెట్టి మరీ వాళ్లందరినీ నిద్రలేపి సమాయత్తం చేస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం ఉదయం పది కావస్తున్నా ఇంకా పాట పెట్టలేదు.

టైం రిస్ట్రిక్షన్స్

టైం రిస్ట్రిక్షన్స్

24 గంటలు స్ట్రీమింగ్ అని చెప్పారు కాబట్టి టైం రిస్ట్రిక్షన్స్ లాంటివేమీ పెట్టినట్లు కనిపించడం లేదు. గార్డెన్ ఏరియాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో అరియానా చైతుతో మాట్లాడుతూ తమ గోవా టూర్ గురించి ప్రస్తావించింది. ఇది విన్న తేజస్వి మాదివాడ నీకు అరియానా ముందే తెలుసా? అని చైతూని అడగడంతో ఇండస్ట్రీలో ఐదేళ్ల నుంచి ఉంటున్నా ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించాడు.
 పెళ్లి చేసుకోమని బంపర్ ఆఫర్

పెళ్లి చేసుకోమని బంపర్ ఆఫర్


తెలియడం వేరు క్లోజ్ గా ఉండడం వేరు కదా అని అనడంతో చైతన్య స్పందిస్తూ బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిన తరువాత నేను అరియనా కలిసి గోవా టూర్ వెళ్లామని, అక్కడ మేము ఏదో చేసాము అని చెప్పబోతూ ఉండగానే ఏదో గుర్తు వచ్చిన విధం గా అక్కడితో టాపిక్ మార్చేశాడు. అయితే ఆసక్తికరంగా సరయు ఆర్జే చైతూను తనను పెళ్లి చేసుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే చైతు కూడా దాన్ని సరదాగానే తీసుకున్నారు.

ఆఫర్ కి డిస్కౌంట్

ఆఫర్ కి డిస్కౌంట్


ఆయనతో మాట్లాడుతూ ఈ ఆఫర్ కి డిస్కౌంట్ లాంటివి ఉంటాయా అని ప్రశ్నించాడు.. అయితే తనకు డిస్కౌంట్ ఇచ్చే ఉద్దేశం ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక వీరితో పాటు నటరాజ్ మాస్టర్ అలాగే హమీద కూడా కిచెన్ లో సందడి చేశారు.. తాను ఒకటి చెబితే హమీద మరొకటి అర్థం చేసుకుని మాట్లాడడంతో దోశలు వేస్తున్న నటరాజ్ మాస్టర్ అట్ల కర్ర చూపిస్తూ వాతలు పెడతా అనడంతో ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X