Bigg Boss NonStop: హాట్ హాట్ గా నామినేషన్లు.. మీద మీదకు వెళ్లి మరీ రచ్చ!
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే 5 వారాలు పూర్తి కాగా ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయిన బయటకు వెళ్లారు. అందులో ఒకరు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

తేజస్వీ మదివాడ ఎలిమినేట్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అన్నీ షాకింగ్ గానే జరుగుతున్నాయి. ఎలిమినేషన్స్ కూడా ఎప్పటికప్పుడు బాగా హైలైట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు వారాల్లో ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం ముమైత్, రెండో వారం శ్రీ రాపాక, మూడో వారం చైతూ, నాలుగో వారం సరయు ఎలిమినేషన్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. ఐదో వారానికి సంబంధించిన జరిగిన నామినేషన్స్‌లో చాలా మంది ఉన్నా తేజస్వీ మదివాడ ఎలిమినేట్ అయింది.

నామినేషన్లు హాట్ హాట్ గా
ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ లు కూడా హాట్ హాట్ గా జరుగుతున్నట్లు తాజా ప్రోమోతో క్లారిటీ వచ్చింది. ముందుగా మండుతున్న మంట మండుతున్న ఒక బౌల్ ఇచ్చి అందులో నచ్చని వారి ఫోటో వేయాలని కోరారు. ముందుగా వచ్చిన అరియనా తనకు మిత్రా బిహేవియర్ నచ్చడం లేదు అంటూ పేర్కొంది. గేమ్ కాకుండా ఇంప్రెషన్స్ ఫామ్ చేయడం అనేది నాకు నచ్చలేదు, ఇంప్రెషన్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పి ఆమె ఫోటో మంటల్లో వేసింది.

ఇది గేమ్ అంటూ
ఆ తరువాత బిందు మాధవి ఫోటోను చేతుల్లోకి తీసుకుని డబుల్ స్టాండర్డ్, అయినా ఏ స్టాండర్డ్ అయినా నా ఆట నేను ఆడుతున్నా, జనాలకు నువ్వు టూ టైప్స్, త్రి టైప్స్ ఆడుతున్నవ్ అంటే నేనేం చేస్తా అని అడిగితే ఇప్పటికీ నువ్వు డబుల్ స్టాండర్డ్ అనే అంటానని బిందు మాధవి చెప్పుకొచ్చింది. ఇక తరువాత బిందు మాధవి అరియనా ఫోటో తీసుకుని గేమ్ లో ఇలా డబుల్ స్టాండర్డ్ ఆడవద్దు, మీరు చెప్పిన దాని మీద నిలబడాలి అంటే నా ఇష్టం, నాకు నో ప్రాబ్లమ్ ఇది గేమ్ అంటూ అరియానా చెప్పుకొచ్చింది.

కంపలా అరుస్తూ
ఇక తరువాత వచ్చిన అజయ్ మహేష్ విట్టా ఫోటో తీసుకుని నువ్వు శ్రవంతితో మాట్లాడుతూ అఖిల్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి మీరంతా అతనికి సపోర్ట్ చేస్తున్నారా? అని అన్నావ్, అదే కాక నువ్వు ఊరికే పోక్ చేయడం నాకు నచ్చడం లేదని అతనిని నామినేట్ చేశాడు. ఆ తరువాత హమీదా ఫోటో తీసుకుని నేను ఒక అమ్మాయి గురించి ఇలాంటి మాట మాట్లాడుతున్నాను అంటే అది బయటకు ఎలా వెళ్తుందో అని అంటూ ఉండగానే హమీద కంపలా అరుస్తూ విరుచుకు పడింది.

ఒకరిమీదకు ఒకరు
ఏంటి బయట బయట అంటావ్, లోపల సంగతి చూడు అంటే, ఇక్కడ జరిగింది అంతా బయటకే వెళుతుంది, లోపలి ఏమీ రాదు అంటూ ఆమె గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పింది. ఇక అషు రెడ్డి కూడా హమీదాను నామినేట్ చేస్తూ కారణం చెప్పబోగా నేను ఏమైనా చేస్తా ఇక్కడ ఉండి నువ్వెవరు చెప్పడానికి అంటూ ఆమె మరోసారి రెచ్చిపోయింది. ఒకానొక దశలో వీరు అరుచుకున్న అరుపులు విని అందరూ బిత్తరపోయారు. వీళ్ళు కొట్టుకుంటారా? అన్నట్టు ఒకరిమీదకు ఒకరు దూసుకు వెళ్లారు. నువ్వెవరు అంటే నువ్వెవరు అనుకున్నారు.

నువ్వేం చేస్తావ్?
ఇక ఆ తరువాత అనిల్ రాథోడ్ నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేయగా ఆయన ఎప్పటిలాగే మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నువ్వు రెండు కారణాలతో నన్ను నామినేట్ చేసి ఉండచ్చు, ఎవరైనా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేదా నువ్వు నాకు భయపడి ఉండచ్చు అంటే నువ్వేం చేస్తావ్? నన్నేం చేయగలవు అంటూ అనిల్ రెచ్చిపోయాడు. అయితే ఏం చేస్తానో చూపిస్తా అంటూ నటరాజ్ మాస్టర్ కూడా తనదైన హావభావాలతో రెచ్చిపోయాడు.


Click it and Unblock the Notifications