Bigg Boss NonStop : అనిల్ రాధోడ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. సైలెంట్ గా కనిపిస్తూనే మొదెలెట్టాడుగా!

బిగ్బాస్ నాన్ స్టాప్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా 24 గంటల పాటు స్ట్రీమింగ్ అవుతూ ఉండడంతో ప్రేక్షకులకు ఇంకా ఈ కొత్త ఫార్మాట్ కి అలవాటు పడలేదు. కానీ లోపల కంటెస్టెంట్ లు మాత్రం తమదైన శైలిలో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. లవ్ ట్రాక్ లు ఉంటే త్వరగా ఎలిమినేట్ చేయరు అనే ఉద్దేశంలో ఉన్న అందరూ ఎవరో ఒకరితో లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.. ఈ క్రమంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరమీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

హెల్ప్ అవుతుందని

హెల్ప్ అవుతుందని


హౌస్ లో ఎంట్రీ మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో ఎంట్రీ ఇచ్చాడు మోడల్ కం నటుడు అనిల్ రాథోడ్. మోడలింగ్లో అనేక అవార్డులు అందుకున్న ఆయన ఇప్పుడు నటన వైపు అడుగులు వేసే పనిలో పడ్డారు. ఈ విషయంలో తనకు బాగా హెల్ప్ అవుతుందని బిగ్ బాస్ కు వచ్చాను అని చెబుతున్నాడు ఆయన.

ఆరోపణలు కూడా

ఆరోపణలు కూడా


తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. ఆ ప్రక్రియలో ఒకరిమీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. రెండో రోజే నామినేషన్లు పెట్టారు కదా ఎవరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోరు అనుకుంటే గట్టిగానే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపించింది.

గుడ్ వైబ్స్, బ్యాడ్ వైబ్స్

గుడ్ వైబ్స్, బ్యాడ్ వైబ్స్


అయితే ఆ నామినేషన్ల ప్రక్రియ తర్వాత గుడ్ వైబ్స్, బ్యాడ్ వైబ్స్ అనే ఒక టాస్క్ ఇచ్చి ఎవరిని చూస్తే గుడ్ వైబ్స్ కలుగుతున్నాయి ఎవరిని చూస్తే బ్యాడ్ వైబ్స్ కలుగుతున్నాయి చెప్పాలి అంటూ టాస్క్ ఒకటి పెట్టడంతో ఎవరికి వారు తమకు నచ్చిన వారిని నచ్చని వారిని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో కూడా ఒకరి మీద ఒకరు మాటల దాడి చేసుకున్నారు అది వేరే విషయం.

అనిల్ కి లవ్ ట్రాక్

అనిల్ కి లవ్ ట్రాక్


అయితే ఈ టాస్క్ పూర్తయిన తర్వాత ముమైత్ ఖాన్ చాలెంజర్స్ టీం లో ఉన్న స్రవంతి, అజయ్, అనిల్ తో కూర్చుని ముచ్చట్లు పెట్టింది. ఆ సమయంలో స్రవంతి అజయ్ కలిసి అనిల్ రాథోడ్ ని సరదాగా ఏడిపించడం మొదలు పెట్టారు. వారియర్స్ టీమ్ లో ఉన్న అషు రెడ్డి, అరియానలతో అనిల్ కి లవ్ ట్రాక్ ఉంది అని అది కూడా ట్రయాంగిల్ లవ్ ట్రాక్ అంటూ ఆటపట్టించడం మొదలుపెట్టారు.

 మేము సెట్ చేస్తాం కదా

మేము సెట్ చేస్తాం కదా


అయితే అదేమీ లేదు అని అనిల్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా స్రవంతి మాత్రం నీకెందుకు నీ లవ్ ను మేము సెట్ చేస్తాం కదా అంటూ సరదాగా ఆట పట్టించింది. మరోపక్క అఖిల్ సార్థక్ అలాగే సరయూ మధ్య కూడా ఏదో ఉంది అనే విధంగా కనిపిస్తోంది. అఖిల్ తో మాట్లాడే ఎందుకో ఎక్కువగా సరయూ ప్రయత్నిస్తూ ఉండడంతో వారిద్దరి మధ్య కూడా ఏదైనా కొత్త ట్రాక్ ఏర్పడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ విషయం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X