Bigg Boss NonStop : ఆమె నా చేయి విరగ్గొట్టింది.. ఇప్పుడు అలా అంటోంది.. ఏడ్చేసిన శ్రీ రాపాక

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. ఫార్మేట్ కాస్త కొత్తగా ఉండటంతో జనాలు ఇంకా అలవాటు పడ లేదనే చెప్పాలి. కానీ షో లో కంటెస్టెంట్ లు మాత్రం తమదైన శైలిలో అలరిస్తూ ముందుకు వెళుతున్నారు. షో మొదలైన రెండో రోజే నామినేషన్లు పెట్టి షాకిచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.

కంటెస్టెంట్ లు కూడా ఎక్కడా తగ్గకుండా నామినేషన్లలో వాడి వేడిగా తమకు ఇష్టం లేని వారిని నామినేట్ చేశారు. అయితే ముమైత్ ఖాన్ తన చేయి విడగొట్టింది అంటూ శ్రీ రాపాక సంచలన విషయాలు బయట పెట్టింది. అంతే కాదు ఆ విషయం గుర్తు తెచ్చుకుని ఏడ్చేసింది.. వివరాల్లోకి వెళితే

నామినేషన్ల ప్రక్రియ

నామినేషన్ల ప్రక్రియ


సాధారణంగా షో మొదలైన వారం రోజులకు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది కానీ ఈ కొత్త ఫార్మేట్ లో మాత్రం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, ఆర్జే చైతు, మిత్ర శర్మ నామినేట్ అయ్యారు.

అప్పుడే మనస్పర్థలు

అప్పుడే మనస్పర్థలు


ఆ తర్వాత కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో తమకు బాడ్ వైబ్స్, గుడ్ వైబ్స్ వస్తున్న వ్యక్తుల గురించి చెప్పాలని, వారికి థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపారు. అయితే ఒక రకంగా నామినేషన్స్, ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ టాస్క్ లతో కంటెస్టెంట్ల మధ్య అప్పుడే మనస్పర్థలు ఏర్పడ్డాయి.

చేయి విరగ్గొట్టిందని

చేయి విరగ్గొట్టిందని


ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వలన హీరోయిన్ శ్రీరాపాక బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె తన తోటి కంటెస్టెంట్స్ తో ముమైత్ తో మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన బయట పెట్టింది. అప్పట్లో ముమైత్ తన చేయి విరగ్గొట్టిందని.. అప్పుడు చేయి దారుణంగా వాచిపోయిందని.. దీనికి ఆర్జే చైతు సాక్ష్యమని కూడా చెప్పింది.

అబద్దాల కోరు అని

అబద్దాల కోరు అని


ఆ సమయంలో ఆర్జే చైతు-ఆర్జే కాజల్ అక్కడే ఉన్నారని, చేయి విరిగినట్లు రిపోర్టులు రావడంతో వారు తనకి అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చింది. అయినా సరే ఆ విషయాన్ని అక్కడితో వదిలేశానని కానీ ముమైత్ ఇంకా దాన్నే మనసులో పెట్టుకుందన ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత తనతో అదోలా మాట్లాడుతుందని బయట పెట్టింది. నేరుగా వెళ్లి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా.. ఆమె మాత్రం పట్టించుకోవడం లేదని.. పైగా తనను అబద్దాల కోరు అని అంటుంది అని శ్రీ రాపాక బాధ పడింది.

కన్నీళ్లు పెట్టుకుని

కన్నీళ్లు పెట్టుకుని


నిజానికి శ్రీ రాపాక ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో ఆమె అనేక మంది సెలబ్రిటీలతో కలిసి పని చేసింది.అలాగే ముమైత్ తో కూడా పని చేసినట్లు చెబుతున్నారు. నా శరీరానికి గాయం చేసినా.. పట్టించుకోలేదని.. కానీ ముమైత్ మాత్రం అదే విషయాన్ని పట్టుకుని వేలాడుతూ తనను టార్గెట్ చేస్తుందని శ్రీ రాపాక ఆవేదన వ్యక్తం చేసింది. చీటర్, అబద్దాల కోరు అనే పదాలు తనకు నచ్చవని.. ఆ మాట నేను భరించలేకపోతున్నాను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X