Bigg Boss Nonstop : రెచ్చిపోయిన హమీదా, అజయ్ మీద ఒక రేంజ్ లో ఫైర్.. మిత్రాను ఏడిపించిన ముమైత్

బిగ్ బాస్ నాన్‌స్టాప్‌ అభిమానుల కోసం మరో ఆసక్తికరమైన ఎపిసోడ్ సిద్దమయింది. గురువారం నాడు టెలీకాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ లో 'నువ్వు నా కెప్టెన్ కాదు' అనే కెప్టెన్సీ టాస్క్‌ నడవబోతోంది. ఈ టాస్క్ లో హౌస్ సభ్యుల మెజారిటీ మద్దతుతో పోటీదారు ఇంటి కొత్త కెప్టెన్ అవుతారు. అయితే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

 టాస్క్

టాస్క్


ఇప్పటిదాకా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఆడి గెలిచిన నలుగురు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం బరిలో దిగారు. యాంకర్ శివ, హమీదా, అషు రెడ్డి, ముమైత్ ఖాన్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఎంపికయ్యారు. ‘బిగ్ బాస్' కెప్టెన్ కావడానికి తోటి సభ్యుల మద్దతు కూడా అవసరమే కాబట్టి ఈ సారి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ‘బిగ్ బాస్'.. ‘యూ ఆర్ నాట్ మై కెప్టెన్'.. టాస్క్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రోమో ఆసక్తికరంగా

ప్రోమో ఆసక్తికరంగా

కంటెస్టెంట్స్ రీజన్స్ చెప్పి ఎవరు యూ ఆర్ నాట్ మై కెప్టెన్ అనేది చెప్పాలి. ఈ క్రమంలో వారు బాణాలు తమకు ఇష్టం లేని వారి మెడలో ఉన్న లవ్ సింబల్ మీద గుచ్చాలి. అలా నలుగురి మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఎవరు గెలిచారు అనే విషయం గురువారం ఎపిసోడ్ లో తేలనున్నా తాజా ప్రోమో మాత్రం ఆసక్తికరంగా మారింది.

 మహేష్ విట్టాతో కూడా

మహేష్ విట్టాతో కూడా


తాజా ప్రోమోలో, మిత్రా శర్మపై ముమైత్ ఖాన్ ఫైర్ అయింది. తనను యూ ఆర్ నాట్ మై కెప్టెన్ అంటూ పొడవడానికి వచ్చిన మిత్రా మీద ఆమె విరుచుకు పడింది. ఆ తర్వాత ముమైత్ మిత్రాను 'బయటికి పొమ్మని' అనడంతో ఆమె హార్ట్ అవ్వడమే కాకుండా అక్కడి నుంచి గార్డెన్ ఏరియాలోకి వెళ్లి ఏడవడం మొదలు పెట్టింది. నిజానికి ముమైత్ ఖాన్ మహేష్ విట్టాతో కూడా అదే విధంగా గొడవ పెట్టుకుంది.

రెచ్చిపోయి

రెచ్చిపోయి


ఇక మరోవైపు, అజయ్ మరియు హమీద మధ్య కూడా చాలా తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. హమీద తనను అజయ్ మోసం చేశాడు అనే ఫీలింగ్తో ఉంది. ఈ క్రమంలోని అందరితో కలిసి గేమ్ ఆడుతూ నన్ను ఇలా చేశావ్ కదా ఇక చూపిస్తా అంటూ రెచ్చిపోయింది. ఈ సీజన్‌లో బహుశా మొదటి సారి ఈ రేంజ్ లో ఫైర్ అయింది అని చెప్పవచ్చు. దానికి అజయ్ కూడా రెచ్చిపోయి నువ్వేమీ తోపు కాదు, నువ్వెక్కడ ఉన్నావో నేనూ అక్కడే ఉన్నా అంటూ సమాధానం చెప్పడంతో హమీదా కూడా రెచ్చిపోయి మాట్లాడ్డం ఆసక్తికరంగా మారింది.

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
 మార్గం సుగమమైంది

మార్గం సుగమమైంది


మరోపక్క బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా అషురెడ్డి ఎంపికైనట్టు లీక్ అయిన సమాచారం సోషల్ మెడలో వైరల్ అవుతోంది. నిజానికి మిగతా వాళ్లతో పోలిస్తే అషు రెడ్డి పెద్ద గొడవలు పెట్టుకోకుండా అందరితో కాస్త సఖ్యతగా మెలగడంతో ఆమె కెప్టెన్ అయ్యేందుకు మార్గం సుగమమైందని అంటున్నారు. చూడాలి ఈ ఎపిసోడ్ లో ఇంకేం ఆసక్తికర అంశాలు ఉన్నాయనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X