Bigg Boss Telugu 7 Winner: కంటెస్టెంట్లకు 10 లక్షలు ఆఫర్.. ఎవరు తీసుకున్నారంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రేపటితో ముగియనుంది. ముఖ్యంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ గా నిలవబోతున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయి ఉంటుంది. కానీ మనకు మాత్రం దాని గురించి ఇంకా తెలియదు. అయితే తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటే మాత్రం.. హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్లకు బిగ్ బాస్ బిగ్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ ఆఫర్ ఏంటి, దాన్ని ఎవరు తీసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ నిర్వాహుకులు తాజాగా 104వ రోజుకు సంబంధించిన మూడో ప్రోమోను విడుదల చేశారు. అందులో బిగ్ బాస్ చాలా ఫన్నీ టాస్క్ ఇచ్చారు. హౌస్ మేట్స్ అందరూ ఫుల్లుగా నవ్వుకునేలా చేశారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించి, కళ్లకు మాస్క్ పెట్టుకొని కుర్చీలో కూర్చోవాలని... మిగతా వారంతా వారిని కొట్టాలని తెలిపారు. అయితే వారిని కొట్టింది ఎవరో గెస్ చేసిన వారు ఔట్ కాగా... నెక్స్ట్ అందరూ వారిని కుర్చీలో కూర్చోబెట్టి సాఫ్ట్ స్టిక్ తో కొట్టాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో చాలా ఫన్ జరిగింది.

ముందుగా అందరూ అమర్ దీప్ కు బ్లౌండ్ ఫోల్ చేసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత శివాజి, అంబటి అర్జున్ లు విపరీతంగా దాడి చేశారు. రేయ్ ఆగండ్రా దొంగను కొట్టినట్లు ఇలా కొడతారేంట్రా అని అనగానే... అంతా సైలెంట్ అయ్యారు. ఒకరొకరుగా కొట్టుకుంటూ వచ్చారు. చివరగా శివాజి అమర్ దీప్ ను కొట్టగా... అమర్ దీప్ కెరెక్టుగా గెస్ చేశాడు. ఇక ఆ తర్వాత శివాజిని కూర్చోబెట్టారు. కూర్చున్న వెంటనే రెండో దెబ్బకే యావర్ కొట్టినట్లు గుర్తించి శివాజి ప్రిన్స్ యావర్ ఔట్ అయ్యేలా చేశాడు. ఇక ప్రిన్స్ యావర్ ఛైర్ పై కూర్చోగా.. అంతా కలిసి దాడి చేశారు.
అంబటి అర్జున్, అమర్ దీప్ రెచ్చిపోయి కొట్టారు. శివాజి కూడా ఊరికే కొడుతూనే ఉన్నాడు. రైతుబిడ్డ కూడా ఓ దెబ్బ వేయగా... యావర్ ఇది ప్రశాంత్ అని చెప్పి కరెక్టుగా చెప్పేశాడు. ఇలా పల్లవి ప్రశాంత్ బ్లైండ్ ఫోల్ చేసుకుని ఛైర్ లో కూర్చోగా శావిజి రెచ్చిపోయి మరీ తగిలించాడు. పాపం పల్లవి ప్రశాంత్... తన అన్న శివాజియే ఇలా కొడుతున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఇక అందరూ కలిసి బాదేసరికి చాలు నేను ఆడను అంటూ ఆపేశాడు. ఇదంతా కాగానే బిగ్ బాస్ వాళ్లందరినీ లివింగ్ ఏరియాలోకి పిలిచి... ఓ సూట్ కేస్ ను చూపించారు.

అందులో పది లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పాడు. అయితే టాప్ 6 కంటెస్టెంట్లలో తమకు నచ్చిన వారు దాన్ని తీసుకుని బయటకు వెళ్లొచ్చని చెప్పారు. అందరూ ఒక్కోసారి ఆ సూట్ కేస్ ను పట్టుకున్నట్లు చూపించారు. అయితే చివర్లో శివాజి మాత్రం ఆ సూట్ కేస్ ను పట్టుకుని నడుస్తున్నట్లు చూపించారు. దాన్ని చూస్తుంటే ఆయనే తీసుకున్నట్లు అనిపించాలనే అలా చేసినట్లు అర్థం అవుతోంది. అయితే ఆ సూట్ కేస్ ను ఎవరూ తీసుకోలేరు. కానీ ఈరోజే అంబటి అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు. ఆయన ఈ ఆఫర్ ను దక్కించుకున్నా బాగుండేది. కానీ పాపం మిస్ చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











