Bigg Boss 7 Telugu: ఆ కంటెస్టెంట్లకు లక్షల ఆఫర్.. హీరో టెంప్ట్ అయ్యాడు కానీ.. ఏం ట్విస్టు భయ్యా!
కొందరు సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచడం.. వాళ్లకు రకరకాల టాస్కులు ఇవ్వడం.. వాళ్లలో ఒకరిని ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడం అనే అంశాలతో సాగే షోనే బిగ్ బాస్. అన్ని భాషల కంటే తెలుగులోనే ఈ సీజన్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అందుకే నిర్వహకులు వరుసగా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను విజయవంతంగా పూర్తి చేశారు.
ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు షో నిర్వహకులు ఏడో దాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 3న ప్రీమియర్ ఎపిసోడ్ ద్వారా దీన్ని ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇందులో కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరిస్తున్నారు. అదే సమయంలో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో దీన్ని మరింత కొత్తగా, కలర్‌ఫుల్‌గా ప్రసారం చేస్తున్నారు.

అంగరంగ వైభవంగా జరుగుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో మొదటి నుంచి వరుసగా సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీలు అడుగు పెట్టారు. వీళ్ల ఐదుగురికి హోస్ట్ నాగార్జున పలు రకాల టాస్కులను ఇచ్చాడు.
ఫస్ట్ కంటెస్టెంట్‌గా వచ్చిన ప్రియాంక జైన్‌కు హోస్ట్ అక్కినేని నాగార్జున ఒక బ్రీఫ్‌కేస్ ఇచ్చి పంపించాడు. దాన్ని ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచమని కూడా టాస్క్ ఇచ్చాడు. దీంతో హౌస్‌లోకి అడుగు పెట్టిన వెంటనే ప్రియాంక జైన్ ఆ బ్రీఫ్‌కేస్‌ను జైల్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో దాచేసింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా దాన్ని చూడలేకపోయారు.
మొదటి ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హోస్ట్ నాగార్జున.. వాళ్లందరినీ పిలిచి ఫినాలేలో ఆఫర్ ఇచ్చే విధంగా బ్రీఫ్‌కేస్ గురించి చెప్పాడు. మొదట అందులో రూ. 5 లక్షలు అమౌంట్ ఉందని చెప్పి.. అది తీసుకుని ఎవరైనా వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 35 లక్షలు వరకూ పెంచేసి మరీ తీసుకోమన్నాడు.
ఐదుగురు కంటెస్టెంట్లలో హీరో శివాజి మాత్రమే రూ. 35 లక్షలు మొత్తానికి టెంప్ట్ అయ్యాడు. దీంతో అతడు ఆ మొత్తాన్ని తీసుకుని బయటకు వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా శివాజి కూడా దాన్ని రిజెక్ట్ చేశాడు. దీంతో ఈ ఆఫర్ వృథా అయిపోయింది. మొత్తానికి ఈ టాస్క్ మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని కూడా భారీగానే పెంచేసిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











