Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అభిజిత్ అరిస్తే, మోనాల్ పై కోపాన్ని చూపించిన మాస్టర్.. మొహం మీద కొట్టినంత పని చేశాడు
బిగ్ బాస్ సీజన్ 4 అసలు మజా ఇప్పుడిప్పుడే. మొదలవుతోంది. 60ఎపిసోడ్స్ లు ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోయే ఎపిసోడ్స్ మరోక ఎత్తు అనేలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న గొడవలు పెరుగుతున్న మాటలు ఊహించని వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో వైరల్ గా మారింది. మరోసారి అమ్మా రాజశేఖర్ అసహనానికి గురయ్యాడు.
హారిక సీక్రెట్ టాస్క్
ఇటీవల బిగ్ బాస్ పల్లెకు పోదాం ఛలో ఛలో అనే టాస్క్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కూడా సీక్రెట్ టాస్క్ ఉన్నట్లు చాలా ఈజీగా అర్ధమవుతోంది. గతంలో హోటల్ టాస్క్ లో అవినాష్ ఏ విధంగా అయితే ఇతరులను రెచ్చగొట్టి సొంత టీమ్ సభ్యులను ఇరకాటంలో పెట్టాడో ఇప్పుడు అదే తరహాలో హారిక కూడా అదే రేంజ్ లో షాక్ ఇస్తోంది.
మరోసారి అమ్మా రాజశేఖర్ రచ్చ
చూస్తుంటే హారిక నెక్స్ట్ కెప్టెన్ కిరీటాన్ని అందుకునేలా ఉందనిపిస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమోలో అమ్మా రాజశేఖర్ ఈ రోజు ఎపిసోడ్ లో నానా రచ్చ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. ముఖ్యంగా అభిజిత్ అరిచిన అరుపులకు మాస్టర్ చిరకుతో ఫుడ్ పై చేయితో కొట్టేశాడు. ఎంత కోపం వచ్చిందో అందరికి అర్ధమైపోయింది.
నువ్ పక్కకి వెళ్లిపో.. కెప్టెన్ పై అబిజిత్
ఫుడ్ ప్రాబ్లమ్ ఉందని అంటూ అభిజిత్ ఒక్కొక్కరపై అరిచేస్తూ మరోసారి తన ఆగ్రహాన్ని చూపించాడు. గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని పక్కన పెడితే టాస్క్ లో ఎవరికి వారు పెర్ఫెమెన్స్ తో రెచ్చిపోతున్నట్లు అర్ధమవుతోంది. అరియానా మధ్యలో వచ్చినా కూడా నువ్ పక్కకి వెళ్లిపో అంటూ ఆమెపై కూడా అరిచేశాడు అభిజిత్. కనీసం కెప్టెన్ అని కూడా గౌరవం ఇవ్వలేదు.
హే.. చీ..పో.. మాస్టర్ కి చిరాకు వచ్చేసింది
ఏదో వంటలో పొరపాటు చేసినందుకు మాస్టర్ కి చిరాకు వచ్చే వరకు అరిచేశాడు అభిజిత్. గత వారం నుంచి హౌజ్ లో అభి, మాస్టర్ ల మధ్య గొడవలు ఏ రేంజ్ లో హీటెక్కుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అమ్మా రాజశేఖర్ కూడా అభి ప్రవర్తించిన తీరుకు గిన్నెపై కొట్టేశాడు. అప్పుడు అది మోనాల్ చేతిలో ఉంది. అభి పిలుస్తున్నా కూడా హే.. చీ..పో.. అంటూ మాస్టర్ వెళ్లిపోయాడు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసికుంటాయో చూడాలి.