Bigg Boss యూట్యూబర్‌పై బిగ్ బాస్ విన్నర్ దాడి... 10 మంది గుండాలతో కలిసి దారుణంగా!
బిగ్ బాస్ షో ఎంతో మందికి స్టార్డమ్ ను ఇస్తుందనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్స్, చిన్న పాటి నటులు.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన తర్వాత మరింత స్టార్డమ్ సొంతం చేసుకుంటారు. అలా ఫేమస్ అయిపోతారు. అయితే బిగ్ బాస్ హిందీ ఓటీటీ 2 విన్నర్ గా ఎల్విష్ యాదవ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎల్విష్ యాదవ్ పై ఇప్పుడు ఓ కేసు నమోదు అయింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హిందీ బిగ్ బాస్ షోతో పాటు.. ఓటీటీ సీజన్స్ కూడా నడుస్తుంటాయి. అయితే అందులో ఓటీటీ రెండో సీజన్ లో ఎల్విష్ యాదవ్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న ఎల్విష్ యాదవ్ ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వచ్చి మరింత స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ లో విన్ అవ్వడంతో ఎల్విష్ యాదవ్ పేరు మారు మ్రోగిపోయింది. సోషల్ మీడీయాలో బాగా వైరల్ అయ్యాడు.

సోషల్ మీడియాలో.. యూట్యూబ్ తో డబ్బులను ఎల్విష్ యాదవ్ బాగానే సంపాదించాడు. ఇక ఎల్విష్ ఆర్మీ అని కొంతమంది ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. అయితే తాజాగా ఈ ఎల్విష్ యాదవ్ పై గురుగ్రామ్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొన్నాళ్లుగా మరో యూట్యూబర్ సాగర్ ఠాకూర్ కి, ఎల్విష్ యాదవ్ కి గొడవలు తలెత్తాయి. దీంతో వీరి మధ్య వైరం మొదలైంది.
సాగర్ ఠాకూర్ తన వీడియోలలో సోషల్ మీడియాలో బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వీరి మధ్య గొడవలు తలెత్తాయి. అయితే తాజాగా ఎల్విష్ యాదవ్ సాగర్ ఠాకూర్ ప్లేస్ కి 10 మంది గుండాలతో కలిసి వెళ్లి అతనిపై దాడి చేశాడు. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో ఎల్విష్ యాదవ్ ని అరెస్ట్ చేయమని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. గురుగ్రామ్ లో ఎల్విష్ యాదవ్ పై కేసు కూడా నమోదు కాగా.. దాడికి గురైన సాగర్ కూడా తనపై ఎల్విష్ దాడి చేసాడని, చంపడానికి ప్రయత్నించాడని వెల్లడించారు. అయితే ఈ విషయంలో ఎల్విష్ ని అతని అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎల్విష్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











