11 ఏళ్ల బాలికపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ రేప్.. మత్తు మందు ఇచ్చి అత్యాచార ఘటన సంచలనం

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామపెద్దగా, ధర్మాన్ని ఆచరించే వ్యక్తి.. తప్పు చేస్తే సొంత కుటుంబ సభ్యులనైనా ఊపేక్షించని వైనాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపిస్తారు. ఇందులో విలన్‌ ఆనంద్ రాజ్ తన ఇంట్లో పనిచేసే పనిమనిషిపై అత్యాచారం చేస్తాడు. అప్పుడు పాపారాయుడు పాత్రలో ఉన్న రజనీకాంత్ తీర్పు చెబుతూ.. '' మన కింద పనిచేసే వాళ్లకి తిండి, బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమాని ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని , నీ పంచన పడున్న వారి పడకనే పంచుకున్నావంటే మృగానికీ, నీకు తేడా లేదు '' అంటూ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ చప్పట్లు కొట్టిస్తుంది.

సినిమాలోనే కాదు రియల్ లైఫ్‌లోనూ పనిమనుషులపై అత్యాచారం చేసి, వారి జీవితాలను నాశనం చేసిన కీచకులున్నారు. రోజూ ఇలాంటి వార్తలను పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం. ఇకపోతే.. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు అర్మాన్ మాలిక్. అతని గేమ్ ప్లాన్ , ఆటతీరు, మాటలు అన్ని కాంట్రవర్సీయే.. ఇతనిని విమర్శించే వారే కాదు, ఓట్లు వేసి ప్రోత్సహించేవారూ ఉన్నారు.

Bigg Boss OTT 3 contestant Armaan Malik Accused Of Raping His Minor Maid

ఇప్పుడే కాదు అర్మాన్ మాలిక్‌ తీరు తొలి నుంచి వివాదాస్పదమే. అసలే కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచే వ్యక్తులను వెతికి వెతికి పట్టుకునే బిగ్‌బాస్ నిర్వాహకులకు అర్మాన్‌ దొరకడమే ఆలస్యం .. కంటెస్టెంట్‌గా ఛాన్స్ ఇచ్చారు. బిగ్‌బాస్ ఓటీటీ -3లో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఈ సీజన్‌లో అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో ఒకరిగా నిలిచాడు. బహుభార్యత్వాన్ని ప్రోత్సహించడం సహా కొన్ని వివాదాలతో అర్మాన్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. 2011లో పాయల్‌ను మాలిక్ వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు కుమారుడు చిరాయు జన్మించాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో పాయల్‌ - అర్మాన్ విడిపోయారు. కానీ ఆమెకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే.. 2018లో పాయల్‌ ప్రాణ స్నేహితురాలు కృతికను పెళ్లాడాడు.

డిసెంబర్ 4, 2022న తన భార్యలు పాయల్, కృతికా ఇద్దరూ గర్భం దాల్చినట్లుగా ప్రకటించి అర్మాన్ మాలిక్ వార్తల్లో నిలిచాడు. ఇప్పటి వరకు అతను నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడు. వారు చిరాయు, జైద్, అయాన్, తుబా. ఈ క్రమంలో ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపై అర్మాన్ అత్యాచారానికి పాల్పడినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి అర్మాన్‌పై అత్యాచారం కేసు నమోదవ్వగా.. ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Bigg Boss OTT 3 contestant Armaan Malik Accused Of Raping His Minor Maid

2019 జూన్‌లో నమోదైనట్లుగా ఉన్న ఈ కాపీలో అర్మాన్ మాలిక్.. ఓ 11 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడనే అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 23, 2019న అతనిని అరెస్ట్ చేయగా.. వెంటనే బెయిల్ మంజూరైంది. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం రేపగా కొద్దిరోజులకు అంతా సద్దుమణిగింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ మరోసారి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు అర్మాన్ మాలిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

బిగ్‌బాస్ ఓటీటీ -3 నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మాలిక్ మొదటి భార్య పాయల్ మాలిక్‌ను అర్మాన్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా.. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేశారు. అర్మాన్ మాలిక్ వ్యక్తిగత జీవితం, తెరపైకి వచ్చిన ఇతర ఆరోపణలు అతనిని బిగ్‌బాస్ హౌస్ లోపల , వెలుపల వివాదాలకు కేంద్రంగా నిలబెట్టాయి. హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత తనపై వస్తోన్న ఆరోపణలపై అర్మాన్ మాలిక్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: bigg boss ott 3 armaan malik
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X