అందుకు ఎవరితోనైనా పడుకొంటాను.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతున్న మాటలు వినిపిస్తుంటే అవి నిజంగానే వారి పరిస్థితుల ప్రతిబింబమా? లేక కావాలనే సంచలనం కోసం చెబుతున్నవా? అన్న సందేహం కలుగుతోంది. అలాంటి పరిస్థితిలోనే ఓ బిగ్‌బాస్ బ్యూటీ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. 'పిల్లల కోసం అయితే ఎవరితోనైనా పడుకొంటాను' అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? అసలు ఏ పరిస్థితుల్లో ఆమె ఇలా మాట్లాడాల్సి వచ్చింది? ఇది నిజంగా ఆమె జీవిత పోరాటమా... లేక కేవలం ప్రచారం కోసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read
బికినీలో కరీనా కపూర్‌లా చూపిస్తామంటూ.. వివాదంపై నోరు విప్పిన ప్రియమణి
బికినీలో కరీనా కపూర్‌లా చూపిస్తామంటూ.. వివాదంపై నోరు విప్పిన ప్రియమణి

ఆ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. సోషల్ మీడియాలో 'వడాపావ్ గర్ల్'గా గుర్తింపు పొందిన చంద్రికా దీక్షిత్ (Chandrika Dixit). సాధారణంగా వీధుల్లో వడాపావ్ అమ్ముతూ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఆమె, తన ప్రత్యేకమైన మాట్లాడే స్టైల్‌తో తక్కువ సమయంలోనే వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఆమెకు వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ హిందీ (Bigg Boss OTT 3)లో పాల్గొనే అవకాశం దక్కింది. ఆ షో తర్వాత ఆమె పేరు మరింతగా ప్రజల్లో వినిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రికా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి.

Recommended For You
నాలో అలాంటి లోపాలు.. అయినా నేను ఎవ్వరికీ భయపడను.. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా
నాలో అలాంటి లోపాలు.. అయినా నేను ఎవ్వరికీ భయపడను.. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా
Bigg Boss OTT Fame Chandrika Dixit Shocking Comments Spark Huge Social Media Debate

ముఖ్యంగా తల్లిగా తన బాధ్యత గురించి మాట్లాడిన సమయంలో ఆమె చేసిన కామెంట్స్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆర్థిక సమస్యలు, తన బిడ్డ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఆమె "తన బిడ్డను పెంచడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. అవసరమైతే ఎవరితోనైనా పడుకోవాల్సి వచ్చినా కూడా వెనుకాడను" అని చెప్పినట్లు ఇంటర్వ్యూలో వెల్లడైంది. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. చాలామంది నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

You May Also Like
NtrNeel: ఎన్టీఆర్ సినిమాలో రాజమౌళి హీరోయిన్.. నీల్ మామ స్కెచ్ అదుర్స్
NtrNeel: ఎన్టీఆర్ సినిమాలో రాజమౌళి హీరోయిన్.. నీల్ మామ స్కెచ్ అదుర్స్

'పిల్లలను పెంచడానికి గౌరవప్రదమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి ఉండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు' అంటూ పలువురు స్పందించారు. ఒక తల్లి పాత్రను ఇంత దిగజార్చేలా మాట్లాడటం సమాజానికి తప్పు సందేశం ఇస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కొంతమంది మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం, వార్తల్లో నిలిచేందుకు కావాలనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి కామెంట్స్ ద్వారా ట్రెండింగ్‌లో ఉండాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలా మాట్లాడిందని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Dacoit Day 5 Collections: తగ్గిన డెకాయిట్ జోరు.. అడివి శేష్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటంటే?
Dacoit Day 5 Collections: తగ్గిన డెకాయిట్ జోరు.. అడివి శేష్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటంటే?

చంద్రికా దీక్షిత్ గతంలో కూడా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచారు. ఆమె వ్యక్తిగత జీవితం, వివాహాలపై సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరిగాయి. ప్రతి సారి కూడా ఆమె చుట్టూ వివాదాలు చెలరేగడం గమనార్హం. ఇప్పుడు ఈ తాజా వ్యాఖ్యలు ఆమెపై ఉన్న విమర్శలను మరింత పెంచాయి. ఈ ఘటనతో సోషల్ మీడియాలో మరో ముఖ్యమైన చర్చ ప్రారంభమైంది. ఫేమ్ కోసం ఎంతవరకు వెళ్లాలి? వ్యక్తిగత బాధ్యతలు, ముఖ్యంగా తల్లితనాన్ని గౌరవంగా చూపించాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చంద్రికా దీక్షిత్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X