Vada Pav Girl: భర్త అఫైర్ బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. అవి లీక్‌ చేస్తానంటూ నటికి బ్లాక్‌మెయిల్

నటీనటుల జీవితాలు సినిమాల్లో చూపించినట్లుగా ఉండవు. వారి వ్యక్తిగత జీవితాల్లోనూ ఎన్నో కష్టాలు, కన్నీళ్లు. అత్తింటి వాళ్లు, భర్తల చేతిలో వేధింపులు గురవుతూ.. కెమెరాకు ముందు మాత్రం వాటిని పంటిబిగువున భరిస్తూ నటిస్తోన్న మహిళలు ఎందరో ఉన్నారు. వీరిలో కొన్ని బయటకు రాగా.. నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న వారెందరో ఉన్నారు. తాజాగా తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనకు నరకం చూపిస్తున్నాడంటూ బిగ్‌బాస్ బ్యూటీ ఆధారాలతో బయటపెట్టడంతో బుల్లితెర ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..

వడా పావ్ గర్ల్‌గా ఫేమస్ అయ్యారు చంద్రికా దీక్షిత్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన చంద్రిక‌కు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఢిల్లీకి మకాం మార్చింది. నగరంలోని ప్రఖ్యాత తినుబండారాల కంపెనీ హల్దీరామ్స్‌‌లో నాలుగేళ్లు పనిచేసింది. అక్కడ పనిచేస్తుండగా తన కుమారుడికి డెంగ్యూ రావడంతో హల్దీరామ్స్‌లో ఉద్యోగం మానేసి భర్తతో కలిసి ఫుడ్ కోర్ట్‌ను ప్రారంభించింది. ముంబై నగరానికి బ్రాండ్‌గా మారిన వడా పావ్‌ను ఢిల్లీలోని పితంపురలో ఏర్పాటు చేసి విభిన్న వెరైటీలతో అందిస్తూ మంచి ఆదరణ దక్కించుకుంది. అలాగే తను వడా పావ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ కంటెంట్ క్రియేటర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. దాంతో చంద్రికను అభిమానులు ముద్దుగా వడా పావ్ గర్ల్‌ అని పిలుచుకుంటారు.

Bigg Boss OTT Fame Vada Pav Girl Chandrika Dixit Accuses Husband of Cheating

చంద్రిక వడా పావ్ బాగా ఫేమస్ కావడంతో ఆమె ఫుడ్ కోర్ట్ వద్ద జనం బారులు తీరేవారు. ఒకదశలో ఆర్డర్ రావడానికి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేదంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. అయినప్పటికీ నిరీక్షించి మరి వడా పావ్ టేస్ట్‌ను ఆస్వాదించేవారు. అయితే చంద్రిక స్టాల్‌ కారణంగా ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ నేపథ్యంలో ఆ ఫుడ్ కోర్ట్‌ను తీయించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు.. తన ఫుడ్ కోర్ట్‌ను తరలించకుండా ఉండేందుకు గాను మున్సిపల్ కార్పోరేషన్‌కు చెందిన కొందరికీ తాను డబ్బులు ఇచ్చినట్లు చంద్రిక చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.

తన వడా పావ్ బిజినెస్‌తో పాటు ఢిల్లీ పోలీసులతో వివాదం కారణంగా చంద్రికా దీక్షిత్‌కు భారీ ఫాలోయింగ్ వచ్చింది. సహజంగానే వివాదాస్పద వ్యక్తులను వెతికి పట్టుకునే బిగ్‌బాస్ టీమ్‌కు చంద్రిక కనిపించింది. దాంతో బిగ్‌బాస్ హిందీ ఓటీటీ 3లో ఆమెకు కంటెస్టెంట్‌గా అవకాశం కల్పించారు. అయితే తక్కువ ఓటింగ్ కారణంగా ఆమె మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్‌తో చంద్రిక మరింత పాపులర్ అయ్యారు. అలాగే కోటి రూపాయలు విలువ చేసే మూస్టాంగ్ కారులో నుంచి దిగడంతో అంతా షాక్ అయ్యారు. మరోవైపు.. వడా పావ్ బిజినెస్ బాగా జరుగుతుండటంతో అదే చంద్రిక ఫుడ్ కోర్ట్‌కు దగ్గరలోనే ఆమెకు పోటీగా మరికొందరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు.

కాగా.. యుగం గేరా అలియాస్ యష్ గేరాతో ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు రుద్రా గేరా సంతానం. తాజాగా తన భర్తపై చంద్రిక సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త తను మోసం చేస్తున్నాడని, అతనికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అయినప్పటికీ అతని టార్చర్ భరిస్తున్నాను. పిల్లాడిని, ఇంటిని, బిజినెస్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అయినప్పటికీ గేరా ఇలా చేస్తున్నాడు. ఓ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. ఇతనే నా భర్త, నా ఇల్లు అంటూ మాట్లాడుతోంది. రెండు నెలలుగా నరకం చూస్తున్నా... నా మైండ్ బ్లాంక్ అయ్యింది అంటూ చంద్రికా దీక్షిత్ ఓ వీడియో విడుదల చేసి అందులో భర్తతో ఉన్న మరో మహిళ, వారిద్దరి సంభాషణ తాలూకా స్క్రీన్ షాట్లను బయటపెట్టింది.

మరోవైపు.. చంద్రిక ఆరోపణలపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. తప్పు ఒప్పుకుంటున్నాను.. కానీ అదేమంత పెద్దది కాదు. సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నావ్.. నా దగ్గర అలాంటివి చాలా ఉన్నాయి. నేను కూడా అలాగే చేయగలను.. కానీ అలాంటివి చేయను. నీ రెస్టారెంట్ నా వల్ల నడుస్తోందని ఓ రకమైన వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Read more about: bigg boss ott chandrika dixit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X