For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss OTT..తొలి రోజే శిల్పాశెట్టి సోదరి, దీప్తి అగర్వాల్ రచ్చ.. 24 గంటలు లైవ్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

  |

  బిగ్‌బాస్ రియాలిటీ షో కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఎండెమాల్ షైన్ ఇండియా సంస్థ బొనాంజాను అందించింది. బిగ్‌బాస్ రియాలిటీ షోను తొలిసారి డిజిటల్ రూపంలోకి మార్చి చేసిన ప్రయోగం తొలి రోజే ఆకట్టుకొన్నది. షోలోకి వచ్చిన సెలబ్రిటీలు బుల్లితెర ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. Voot యాప్‌లో ప్రసారవుతున్న షో గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

  అంతకు మించిన అందంతో సురేఖవాణి.. కూతురుతో కలిసి ఆ రేంజ్ రచ్చ!

  ఆరువారాలపాటు బిగ్‌బాస్ ఓటీటీ ప్రసారం

  ఆరువారాలపాటు బిగ్‌బాస్ ఓటీటీ ప్రసారం

  బిగ్‌బాస్ 15 షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ షో ప్రారంభానికి ముందు ఆరువారాలపాటు బిగ్‌బాస్‌ను ఓటీటీ ఫార్మాట్‌లోకి మార్చారు. ఈ ఆరువారాల పాటు దర్శక, నిర్మాత, నటుడు కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. తొలి రోజు హోస్టింగ్‌లో కరణ్ తన తడాఖాను చూపించారు. ఆయన తోడుగా మలైకా అరోరా తనదైన శైలిలో వేదికపై మెరిసింది.

  మలైక ఆరోరా స్పెషల్ ఎంట్రీతో

  మలైక ఆరోరా స్పెషల్ ఎంట్రీతో

  బిగ్‌బాస్ ఓటీటీ షోలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ మలైకా అరోరా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. ఒపెనింగ్ వేడుకలో పరమ్ సుందరి అనే పాటపై నర్తించింది. తన స్టైల్‌లో మలైకా అరోరా డ్యాన్సుతో అదరగొట్టింది. సిల్వర్ కలర్ రంగులో ఉన్న గాగ్రాలో మలైకా ఆకట్టుకొన్నది. మెడలో ధగధగా మెరిసే నెక్లెస్‌తో ఆకట్టుకొన్నది. కరణ్ జోహర్‌కు జతగా హోస్టింగ్ చేసింది.

  Bigg Boss OTT‌లో 13 మంది

  Bigg Boss OTT‌లో 13 మంది

  Bigg Boss OTT షోలో మొత్తం 13 మంది సెలబ్రిటీలకు చోటు కల్పించారు. శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి, సింగర్ నేహా భాసిన్, నిషాంత్ భట్, కరణ్ నాథ్, జీషన్ ఖాన్, మిలింద్ గబా, ప్రతీక్ సెహజ్‌పాల్, రాకేష్ బాపట్, రిధిమా పండిట్, ఉర్పీ జావెద్, దివ్య అగర్వాల్, ఆకాంక్ష సింగ్, ముస్కాన్ జట్టన పాలొంటున్నారు. ఈ షోలో కాలికి గాయం కావడంతో కట్టుతో నేహా భాసిన్ ప్రవేశించింది. అయినా నేహా తన గ్లామర్ పంట పండించింది.

  తొలిసారి డిజిటల్ ఫార్మాట్‌లో బిగ్‌బాస్

  తొలిసారి డిజిటల్ ఫార్మాట్‌లో బిగ్‌బాస్

  డిజిటల్ ఎడిషన్‌లోని Bigg Boss OTT 24 గంటలపాటు Voot యాప్‌లో ప్రసారం కానున్నది. దాదాపు ఆరువారాలపాటు 24 గంటలు షో ప్రసారం కావడం ఇదే తొలిసారి. ప్రేక్షకులకు కోసం ఈ యాప్‌లో హైలెట్స్‌ను స్పెషల్ వీడియోలుగా అందించడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి ప్రయోగంతో బిగ్‌బాస్ షో ప్రదర్శిస్తుండటంతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా మారింది.

  వారాంతంలో కరణ్ జోహర్ హంగామా

  వారాంతంలో కరణ్ జోహర్ హంగామా

  Bigg Boss OTT షోను సోమవారం నుంచి శనివారం వరకు Voot‌లో ప్రసారం కానున్నది. ఆదివారం రోజున కరణ్ జోహర్ హోస్ట్‌గా షోలో జరిగిన విషయాలను రివ్యూ చేస్తారు. సెలబ్రిటీలతో మాట్లాడే సెషన్‌ను ఆదివారం 8 గంటలకు గంటపాటు ప్రసారం అవుతుంది.

  Voot Select సబ్ స్క్రైబ్ చేస్తే..

  Voot Select సబ్ స్క్రైబ్ చేస్తే..

  Bigg Boss OTT షోను చూడాలంటే Voot Select యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేయాలి. ఇందుకోసం సంవత్సరానికి 299 రూపాయలు చెల్లించాలి. దాంతో Bigg Boss VVIP Pass, Bigg Boss 24x7 LIVE Channel, BB OTT Episode Premieres, BB OTT Special Voting Privileges లాంటి ఆప్షన్లను యాప్‌లో పొందడానికి అవకాశం కల్పించారు.

  అందాలు ఆరబోసిన దివ్య అగర్వాల్

  అందాలు ఆరబోసిన దివ్య అగర్వాల్

  Bigg Boss OTT దివ్యా అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. కొరియోగ్రాఫర్‌గా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. శిల్పాశెట్టి, ఇలియానా, సన్నీలియోన్ లాంటి తారలకు కొరియోగ్రఫిని అందించారు. ఐపీఎల్ 2010 కోసం కొరియోగ్రఫి చేశారు. అందం, అభినయానికి అడ్రస్‌గా మారిన దివ్య పలు అందాల పోటీల్లో పాల్గొన్నది. మిస్ టూరిజం ఇంటర్నేషనల్ టైటిల్‌ను అందుకొన్నారు.

  Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
  రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత షమితా శెట్టి

  రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత షమితా శెట్టి


  శిల్పాశెట్టి సోదరి షమితాశెట్టి Bigg Boss OTT షోలోకి వచ్చారు. పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి కుటుంబంలో చిన్నపాటి సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో షోలోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. షమితా శెట్టి విషయానికి వస్తే.. షారుఖ్, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ నటించిన మొహబ్బతే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

  English summary
  Bigg Boss OTT Show started with high note. Malaika Arora, Divya Agarwal, Shamita Shetty steal the show on firstday, Karan Johar got full marks as host.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X