Bigg Boss OTT.. అదరగొట్టిన మలైకా అరోరా, కరీనా కపూర్.. హోస్ట్‌గా కరణ్ జోహర్!
బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రసారానికి రంగం సిద్దమైంది. ఈసారి సరికొత్తగా టెలివిజన్ తెరపై కాకుండా నేరు ఓటీటీ ద్వారా బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభం కానున్నది. ఆరువారాలపాటు సాగే ఈ షోకు బాలీవుడ్ దర్శక, నిర్మాత, నటుడు, హోస్ట్ కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీంతో ఈ షోకు మంచి క్రేజ్ పెరిగింది. వూట్స్ (Voots) యాప్‌లో ప్రసారం కానున్న షో సుమారు ఆరు వారాలపాటు ప్రసారం కానున్నది. ఆరు వారాల తర్వాత ఈ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ జాయిన్ అవుతారు. ఇలాంటి క్రేజీ ఆలోచనతో బిగ్‌బాస్‌పై ప్రేక్షకులకు అంచనాలు పెంచారు.
బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం అయ్యే ఈ రియాలిటీ షోను నేరుగా యాప్‌లో చూడవచ్చు. ఈ షో 24 గంటలపాటు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇంకా ఈ షోను ముందుగా కరణ్ జోహార్, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ భాగం కావడంతో మరింత స్పెషల్ ఎట్రాక్షన్‌గా షో మారింది.
ఇక బిగ్‌బాస్ ఓటీటీ షోకు మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇందులోకి ఎంపిక చేసిన సెలబ్రిటీల లిస్ట్. ఇందులో నేహా భాసిన్, జీషన్ ఖాన్, అక్షర సింగ్, రాధికా పండిట్ ప్రత్యేక ఆకర్షణగా మారారు.

బిగ్‌బాస్ రియాలిటీ ఓటీటీ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా
1. మిలింద్ గాబా: పంజాబీ మంచి క్రేజ్ ఉన్న సింగర్. ఇటీవల కాలంలో వెల్కమ్ బ్యాక్, హౌస్‌ఫుల్ 3 చిత్రంలో పాటలు పాడి ఆకట్టుకొన్నారు.
2. జీషన్ ఖాన్
3. నేహా భాసిన్: కరణ్ జోహర్ హోస్ట్‌గా ప్రారంభించే షోలో తొలి కంటెస్టెంట్‌గా సింగర్ నేహా పేరు బయటకు వచ్చింది. జగ్ ఘూమేయా, స్వాగ్ సే స్వాగత్, ధుంకీ పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకొన్నది.
4. అక్షర సింగ్: భోజ్‌పురి సినీ పరిశ్రమలో నటిగా, మోడల్‌గా రాణిస్తున్నారు. భోజ్‌పురి ఇండస్ట్రీ ప్రతిష్టను పెంచుతాను అంటూ ఆమె కామెంట్ చేసింది.
5. దివ్య అగర్వాల్: ఎంటీవీ స్ల్పిట్‌విల్లా, ఏస్ ఆఫ్ ది స్పేస్, ఖత్రోంకి కి కిలాడి 11 లాంటి షోలో అత్యంత ప్రజాదరణను పొందారు. ప్రస్తుతం బీబీ 11 ఫేమ్ ప్రియాంక్ శర్మతో డేటిగ్ చేస్తున్నది.
6. రిధిమా పండింట్
7. రాకేష్ బాపట్
8. నిషాంత్ భట్
9. ప్రుతీక్ సెహజ్‌పాల్
10. కరణ్ నాథ్
ఇక ఈ సెలబ్రిటీల జాబితా ఇలా ఉంటే.. ప్రేక్షకులకు బాంబు లాంటి వార్త మీడియాలో పేలింది. ఈ షోలో మలైకా అరోరా స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మలైకా అరోరా డ్యాన్సుతో అదరగొట్టింది. పరమ్ సుందరి అనే పాటపై నర్తించింది. సిల్వర్ కలర్ రంగులో ఉన్న గాగ్రాలో మలైకా ఆకట్టుకొన్నది. మెడలో ధగధగా మెరిసే నెక్లెస్‌తో ఆకట్టుకొన్నది.
బిగ్‌బాస్ ఓటీటీలో షోలో కరణ్ జోహార్ తన స్నేహితులు మలైకా అరోరా, కరీనా కపూర్ ఖాన్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారు. బేబో (కరీనా) లేదా మాలా (మలైకా అరోరా)తో ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బిగ్‌బాస్ ఇంటిలో వినోదం మాములుగా ఉండదు. మీ ఫోన్లకు కనెక్ట్ అయి మజా చేయండి అంటూ కరణ్ జోహర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











