For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: కాస్ట్యూమ్స్ కోసమే భారీగా డిమాండ్ చేస్తున్న కంటెస్టెంట్స్.. షాకింగ్ రెమ్యునరేషన్స్

    |

    మొన్నటివరకు బిగ్ బాస్ బుల్లితెరపై గంట సేపటి వరకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇక మరొక సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో డిస్ని హాట్ స్టార్ ఓటీటీ బిగ్ బాస్ ను ఎనౌన్స్ చేసింది. సరికొత్తగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించే విధంగా ప్లాన్ చేశారు. రెండు నెలలకు పైగా రోజుకు 24 గంటల పాటు బిగ్ బాస్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఆకట్టుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యింది. అయితే సెలబ్రెటీలు ఈ సారి రోజులో ఎక్కువ గంటలు అలెర్ట్ గా ఉండాలి కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇక హౌస్ లో ఉండేందుకు కంటెస్టెంట్స్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

    హోస్ట్ గా నాగార్జున

    హోస్ట్ గా నాగార్జున

    బిగ్ బాస్ హిందీలో సక్సెస్ అయిన అనంతరం సౌత్ లో స్టార్ట్ చేస్తున్నారు అనగానే అంతగా సక్సెస్ అవ్వదని అందరూ అనుకున్నారు. ఇక తమిళంలో కంటే తెలుగులోనే భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది. ఎన్టీఆర్ , నాని హోస్ట్ గా ముందు గ్రాండ్ గా రెండు సీజన్స్ ను కొనసాగించగా ఆ తరువాత నాగార్జున కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్నారు. వరుసగా మూడు సీజన్స్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున మొత్తానికి ఓటీటీ కంటెంట్ కు కూడా హోస్ట్ గా ఫిక్స్ అయ్యారు.

    మాజీ కంటెస్టెంట్స్ కూడా

    మాజీ కంటెస్టెంట్స్ కూడా

    ఇక దాదాపు కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ కూడా ఈసారి నాన్ స్టాప్ ఓటీటీ కంటెంట్ లో కంటెస్టెంట్స్ గా మరోసారి వారి లక్కును టెస్ట్ చేసుకోబోతున్నారు. దాదాపు ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయ్యింది. కొంతమంది యూ ట్యూబ్ స్టార్స్ టీవీ స్టార్స్ యాంకర్స్ అలాగే సీరియల్ నటీనటులు కూడా కంటెస్టెంట్స్ గా సందడి చేయబోతున్నారు.

    24 గంటలు అలెర్ట్

    24 గంటలు అలెర్ట్

    ఇక ఈసారి బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లో పాల్గొనే వారికి రెమ్యునరేషన్స్ కూడా భారీగానే అందిస్తున్నట్లు సమాచారం. 24 గంటలు కెమెరాలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ఒకవైపు నిద్రను కవర్ చేస్తూనే మరోవైపు గేమ్ లో కొనసాగుతూ ఉండాలి. వీలైనంత వరకు 24 గంటలు నిద్రలో ఉన్నా కూడా అలెర్ట్ గా ఉండాలి. రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే అందిస్తున్నారు కాబట్టి టాస్క్ ల విషయంలో కూడా డోస్ పెంచే అవకాశం ఉంది.

    మొదలయ్యేది ఎప్పుడంటే..

    మొదలయ్యేది ఎప్పుడంటే..

    ఇక బిగ్ బాస్ ఓటీటీ షో ఫిబ్రవరి 26వ డిస్ని హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా 24 గంటలు స్టార్ట్ కనవుంది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ విషయంలో ఒక లిస్ట్ ఫైనల్ అయ్యిందని టాక్ వస్తోంది. ముమైత్ ఖాన్, ఆదర్శ్ , తనీష్, రోల్ రిడా, అషు రెడ్డి, మహేష్ విట్టా, అరియానా, హామీదా, అఖిల్, తేజస్వి వంటి మాజీ కంటెస్టెంట్స్ ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్స్ గా పార్టీసిపెట్ చేస్తారని తెలుస్తోంది. అలాగే యాంకర్ శివ, ఆర్జే చైతు, భమ్ చిక్ బబ్లు ఇలా విభిన్నమైన సెలబ్రెటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

    అడిగిన దానికంటే ఎక్కువగా..

    అడిగిన దానికంటే ఎక్కువగా..

    ఇక రెమ్యునరేషన్స్ కూడా వారి రేంజ్ కు తగ్గట్టుగా కంటే కాస్త ఎక్కువగానే ఇస్తున్నట్లు సమాచారం. చాలామంది కంటెస్టెంట్స్ కు ఒక రోజుకు 25వేలకు పైగానే ఇస్తున్నట్లు సమాచారం. వారంలో కంటెస్టెంట్స్ లక్షన్నర వరకు సంపాదించుకునే అవకాశం ఉందట. ముమైత్ ఖాన్, తేజస్వి వంటి వారి కాస్త ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    కాస్ట్యూమ్స్ కోసం..

    కాస్ట్యూమ్స్ కోసం..

    ఇక షో స్టార్ట్ అయ్యే రోజు మొదలు హౌస్ లో గ్లామరస్ గా కనిపించాలి కాబట్టి కొంతమంది గ్లామరస్ బ్యూటీలు కాస్ట్యూమ్స్ కోసమే లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తేజస్వి, ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ తో పాటు కాస్ట్యూమ్స్ కోసం కూడా లక్షల్లోనే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి హౌస్ లో నుంచి వెళ్లిపోయే సమయానికి ఎవరు ఏ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటారో చూడాలి.

    English summary
    Bigg boss ott telugu first promo released,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X