Bigg Boss OTT Telugu Promo: ఉరిశిక్ష కాన్సెప్ట్ తో నాగ్ స్టాప్ ప్రోమో.. అఫీషియల్ డేట్ వచ్చేసింది!
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అసలు తెలుగులో సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహాలు మొదట్లో చాలానే వచ్చాయి. కానీ ఇప్పుడు ఎకంగా బిగ్ బాస్ ఓటీటీ లోకి వచ్చేసింది. గత ఐదు సీజన్స్ టీవీలో మంచి ఎంటర్టైన్మెంట్ అంధించగా ఇప్పుడు ఓటీటీలో అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంధించేందుకు సిద్ధమయ్యారు. ఇక షోకి సంబంధించిన మొదటి ప్రోమో కూడా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రోమోలో వెన్నెల కొషోర్ తో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ తో సరదాగా ఉంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగులోనే ఎక్కువగా..
హిందీలో మంచి సక్సెస్ అందుకున్న అనంతరం బిగ్ బాస్ షో సౌత్ లాంగ్వేజెస్ లో కూడా భారీగానే మొదలు పెట్టారు. అయితే సౌత్ లో అన్ని భాషల్లో కంటే తెలుగు భాషలోనే బిగ్ బాస్ మంచి క్రేజ్ అందుకుంది. గతంలో ఎప్పుడు లేని విదంగా స్టార్ మాకు అదిరిపోయే రేటింగ్స్ వచ్చాయి. ఇక ఎన్టీఆర్ నాని అనంతరం నాగార్జున రెగ్యులర్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. తరువాత సీజన్స్ కు కూడా ఆయనే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు.

న్యూ ప్రోమోలో ట్విస్ట్
ఇక రీసెంట్ గా ఓటీటీ బిగ్ బాస్ పై కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన డిస్ని హాట్ స్టార్ ఇక ఫైనల్ గా మొదటి ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో వెన్నెల కిషోర్ ను ఉరిశిక్షకు సిద్దమైన ఒక ఖైదీగా చూపించి నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ చాలా కామెడీగా అనిపించింది. లాయర్ గా కనిపించిన నాగార్జున చివరిసారి కోరికగా అతనికి బిగ్ బాస్ చూడాలని ఉందని ట్విస్ట్ ఇచ్చాడు.

ప్రోమో అదిరింది
ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో మురళి శర్మ కనిపించగా బిగ్ బాస్ ఒక గంటనే కదా అంటూ బిగ్ బాస్ షోను చూపించేందుకు ఒప్పుకుంటారు. ఇక బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఆ సీన్స్ తో హైలెట్ చేశారు. ఖైదీ ఉరిశిక్ష గురించి మర్చిపోయి అందరూ కూడా జైల్ లోనే బిగ్ బాస్ ఓటీటీ కంటెంట్ ను చూడడం హైలెట్ గా నిలిచింది. మొత్తానికి ప్రోమోతో నాగార్జున బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.

అఫీషియల్ డేట్..
ఇక బిగ్ బాస్ ఓటీటీ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో అఫీషియల్ గా మరో క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 26వ తేదీన బిగ్ బాస్ ఓటీటీ డిస్ని హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా 24 గంటలు ప్రసారం అవుతుందని చెప్పారు. ఇక ఈ షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపు ఫైనల్ అయినట్లుగా టాక్ వస్తోంది. గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఈ సారి షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఫైనల్ లిస్ట్ ఇదేనా?
ప్రస్తుతం కంటెస్టెంట్స్ విషయంలో ఒక లిస్ట్ అయితే వైరల్ గా మారింది. ధన్ రాజ్, ముమైత్ ఖాన్, ఆదర్శ్ , తనీష్, రోల్ రిడా, అషు రెడ్డి, మహేష్ విట్టా, అరియానా, హామీదా, అఖిల్ వంటి మాజీ కంటెస్టెంట్స్ ఓటీటీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా పార్టీసిపెట్ చేస్తారని టాక్ వస్తోంది. అలాగే యాంకర్ శివ, ఆర్జే చైతు, భమ్ చిక్ బబ్లు ఇలా విభిన్నమైన సెలబ్రెటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ లిస్టులో ఎవరు ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్టులో కనిపిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











