Bigg Boss OTT Winner: దుమ్ము దులిపి ట్రోఫీ కొట్టేసిన దివ్య.. సన్నీ లియోన్ తో లింకేంటో తెలుసా?

హిందీలో ఇప్పటికే సీజన్ 15 ప్రసారానికి సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 15 త్వరలో ప్రసారం కానుండగా టీవీలో కంటే ముందుగానే ఓటీటీలో ప్రసారం అయింది. అయితే మిగతా సీజన్‌కి ఈ సీజన్‌కి చాలా మార్పులు ఉన్నాయి. అల మొదటి సారి ప్రయోగాత్మకంగా చేసిన బిగ్ బాస్ ఓటీటీ ఎట్టకేలకు పూర్తయింది. అయితే ఈ ట్రోఫీ ఎవరు గెలిచారు? అనే వివరాల్లోకి వెళితే

దివ్య అగర్వాల్

దివ్య అగర్వాల్

వూట్ యాప్(voot app) ద్వారా బిగ్ బాస్ హౌస్ లైఫ్ ఫీడ్‌ని 24X7 చూసే అవకాశం కల్పించారు. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ 2021 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఇక ఈ బిగ్ బాస్ ఓటీటీ 2021 టైటిల్‌ను దివ్య అగర్వాల్ గెలుచుకోగా.. నిషాంత్ భట్, షమితా శెట్టి ఫస్ట్ అండ్ సెకండ్ రన్నరప్‌స్గా నిలిచారు. ఈ మేరకు బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ.25 లక్షలు క్యాష్ ప్రైజ్ కూడా అందుకుంది దివ్య అగర్వాల్.

మిగిలిన కంటెస్టెంట్లు

మిగిలిన కంటెస్టెంట్లు

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ షోలో టాప్ ఫైనలిస్టులుగా మిగిలిన కంటెస్టెంట్లు అక్టోబర్‌లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 15లో పాల్గొననున్నారు. ఇక ప్రతీక్ సెహజ్‌పాల్ ముందే ఫైనల్ రేసు నుండి డబ్బు బ్యాగ్‌తో బయటపడ్డాడు, రాకేష్ బాపట్ కూడా ముందే అవుట్ అయ్యాడు. దీంతో నిశాంత్ భట్, షమితా శెట్టి మరియు దివ్య అగర్వాల్ టాప్ -3 పోటీదారులకు చేరుకున్నారు.

 'బిగ్ బాస్ 15' ఎంట్రీ టికెట్ మాత్రం

'బిగ్ బాస్ 15' ఎంట్రీ టికెట్ మాత్రం

ఇక టాప్ -3 నుండి సెకండ్ రన్నరప్‌గా షమితా శెట్టి దివ్య అగర్వాల్ మరియు నిశాంత్‌కు వీడ్కోలు పలికి బిగ్ బాస్ హౌస్ నుండి ముందు బయటకు వచ్చింది. చివరిగా పోటాపోటీ ప్రదర్శనలో దివ్య 'బిగ్ బాస్ ఓటీటీ టైటిల్' గెలుచుకుంది మరియు దీంతో ఆమె 'బిగ్ బాస్ 15' ఎంట్రీ టికెట్ మాత్రం కోల్పోయింది. ఇక అదే సమయంలో, నిశాంత్ భట్ మరియు షమితా శెట్టి 'బిగ్ బాస్ 15' లో ఎంట్రీ పొందారు.

సన్నీ లియోన్ మరియు శిల్పా శెట్టి వరకు

సన్నీ లియోన్ మరియు శిల్పా శెట్టి వరకు

దివ్య అగర్వాల్ ఒక టీవీ నటి, మోడల్ అలాగే డ్యాన్సర్. జర్నలిజంలో మాస్టర్స్ చేసిన తర్వాత, ఆమె టెరెన్స్ లూయిస్ డాన్స్ అకాడమీ నుంచి నృత్యం నేర్చుకుంది, తరువాత ఆమె సొంత డ్యాన్స్ అకాడమీని ప్రారంభించింది. దివ్య అగర్వాల్ ఇలియానా డి క్రజ్ నుండి సన్నీ లియోన్ మరియు శిల్పా శెట్టి వరకు కొరియోగ్రఫీ చేశారు. దివ్య అగర్వాల్ అనేక అందాల పోటీలలో కూడా పాల్గొన్నారు.

Recommended Video

Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
అనేక రియాలిటీ షోలు

అనేక రియాలిటీ షోలు

2015 సంవత్సరంలో, ఆమె 'మిస్ నవీ ముంబై' టైటిల్ గెలుచుకుంది. దివ్య 2017 లో 'MTV స్ప్లిట్స్‌విల్లా 10' లో పాల్గొన్నప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. అందులో ఆమె రన్నరప్‌గా నిలిచింది. దివ్య అగర్వాల్ 'రోడీస్ రియల్ హీరో', 'MTV ఏస్ ఆఫ్ స్పేస్ 1' మరియు 'బాక్స్ క్రికెట్ లీగ్' వంటి అనేక రియాలిటీ షోలు కూడా చేసింది. రియాలిటీ షోలతో పాటు, 'రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్', 'పంచ్ బీట్' మరియు 'కార్టెల్' వంటి కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా దివ్య కనిపించి అలరించింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X