హారిక విషయంలో ప్లాన్ మార్చిన బిగ్ బాస్: లాజిక్ మిస్ అవడంతో అనుమానాలు!

తెలుగులో మాత్రమే కాదు.. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ప్రసారం అవుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. పాశ్చాత్య సంస్కృతితో ప్రసారమయ్యే 'బిగ్ బ్రదర్' అనే షో ఆధారంగా రూపొందిన దీనికి.. ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో సూపర్ సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది. అందుకే బిగ్ బాస్ షో ఎప్పుడూ ప్రసారమైనా విశేష స్పందన వస్తోంది. ఏ సీజన్‌లోనైనా ఓ కంటెస్టెంట్‌ కోసం ప్రత్యేక ప్లాన్లు చేయరు షో నిర్వహకులు. కానీ ప్రస్తుత సీజన్‌లో దేత్తడి హారిక కోసం ఏకంగా ఓ ప్లాన్‌నే మార్చేశారట. ఆ వివరాలు మీకోసం.!

 రోజు మొత్తంలో నచ్చినదే చూపిస్తారు

రోజు మొత్తంలో నచ్చినదే చూపిస్తారు

బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడిచేది అని అందరికీ తెలుసు. అందుకు అనుగుణంగానే హౌస్‌లోని కంటెస్టెంట్లు నడుచుకుంటూ ఉంటారు. అయితే, రోజు మొత్తంలో అంటే 24 గంటల పాటు షో నడుస్తూనే ఉంటుంది. కానీ, ప్రేక్షకులకు ఒక గంట మాత్రమే చూపిస్తారు. అది కూడా వాళ్లకు నచ్చిన, కావాల్సిన కంటెంట్‌నే ప్రసారం చేస్తారు. మిగతాదంతా తీసి పడేస్తారు.

 హీరో చేయాలన్నా... విలన్‌ అయినా

హీరో చేయాలన్నా... విలన్‌ అయినా

బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ప్రేక్షకుల మన్ననలు పొందేలా ఆడి ఓట్లను రాబట్టాలి. ఒక్కోసారి వాళ్లు ఎంతగా ఆడినా ఫలితం దక్కదు. దీనికి కారణం షోలో ఎవరిని హీరోను చేయాలి.. ఎవరిని విలన్‌లా చూపించాలి అన్నది నిర్వహకుల చేతిలోనే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన షోలు అన్నింటిలోనూ ఇదే తరహాలో చూపించారు. దీనిపై అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.

ఎలిమినేషన్ కూడా ఆయన చేతిలోనే

ఎలిమినేషన్ కూడా ఆయన చేతిలోనే

ఈ రియాలిటీ షోలోనే అత్యంత ముఖ్యమైనది ఎలిమినేషన్. ప్రతి వారం జరిగే ఈ ప్రక్రియలో ఒక కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగానే నడుస్తుంది. అయితే, ఇది ఓట్లను బట్టి కాదు.. బిగ్ బాస్ నిర్ణయం బట్టే ఉంటుందన్న టాక్ కూడా ఉంది. అందుకే చాలా మంది అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారట.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
టాస్కులు కూడా వాళ్లకే అనుకూలం

టాస్కులు కూడా వాళ్లకే అనుకూలం

బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్లు అందరిలో ఎవరిని హీరోను చేయాలో నిర్వహకులు ముందుగానే ఓ అంచనాకు వస్తారట. అందుకు అనుగుణంగానే వాళ్ల కోసం ప్రత్యేకమైన టాస్కులు క్రియేట్ చేస్తుంటారని ప్రచారం జరుగుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. షో ప్రసారం అవుతోన్న అన్ని భాషల్లోనూ ఇదే పద్దతి కొనసాగుతుందని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

హారిక విషయంలో ప్లాన్ మార్చేశారు

హారిక విషయంలో ప్లాన్ మార్చేశారు

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో జరుగుతోన్న కొన్ని వ్యవహారాలు ప్రేక్షకులకు సందేహాలను రెట్టింపు చేస్తున్నాయి. గత సీజన్లలో లేని విధంగా ఈ సారే ఆ తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో హారికను విజేతగా చేసేందుకు బిగ్ బాస్ ప్లాన్ మార్చేశాడని ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాజిక్ మిస్ అవడంతో అనుమానాలు

లాజిక్ మిస్ అవడంతో అనుమానాలు

హారిక, అభిజీత్, అఖిల్ మధ్య జరిగిన కెప్టెన్సీ టాస్క్.. తమిళ బిగ్ బాస్‌లో రెండో వారంలోనే పూర్తయింది. అక్కడ పోటీలో ఉన్న కంటెస్టెంట్.. ఇంట్లోని సభ్యులను భుజాలపై మోయాలని పెట్టారు. ఇక్కడ మాత్రం టాస్క్ ఆడుతున్న సభ్యులను ఎత్తుకోవాలన్నారు. ఇక్కడ లాజిక్ మిస్సయింది. దీంతో ఇది హారికను గెలిపించేందుకే ప్లాన్ చేశారని చెబుతూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X