ఆ కంటెస్టెంట్ క్యారెక్టర్‌తో బిగ్‌బాస్ చెత్త ప్లాన్: మోనాల్‌ గజ్జర్ బలి పశువుగా!

By Manoj Kumar P

ఎవరూ ఊహించలేని మలుపులతో సాగుతూ... విజయవంతమైన కార్యక్రమంగా వెలుగొందుతూ... వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందింది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుందీ షో. గత వాటితో పోలిస్తే ఏమాత్రం హడావిడి లేకుండానే ప్రారంభం అయింది బిగ్ బాస్ సీజన్ 4. మునుపటిలా కాకుండా ఈ సారి పెద్దగా పేరున్న కంటెస్టెంట్లు లేకున్నా షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అందుకు అనుగుణంగా బిగ్ బాస్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇలా చేసిన ఓ ప్లాన్ వల్ల ఓ కంటెస్టెంట్ బలి పశువు అయిపోయింది. ఆ వివరాలు మీకోసం.!

ఏ షోకూ అందని రెస్పాన్స్.. కొత్త రికార్డు

ఏ షోకూ అందని రెస్పాన్స్.. కొత్త రికార్డు

ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి. వాటన్నీంటిలోనూ ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. సరికొత్త థీమ్‌తో ప్రసారమయ్యే ఈ షోకు మాంచి స్పందన వస్తోంది. అందుకే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక, ఇటీవల ప్రారంభమైన నాలుగో సీజన్ కూడా విజయవంతంగా ప్రసారం అవుతూ హిస్టరీ క్రియేట్ చేసేసింది.

ఆసక్తికరంగా సాగుతోన్న నాలుగో సీజన్

ఆసక్తికరంగా సాగుతోన్న నాలుగో సీజన్

ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌ను సైతం మొదలెట్టేశారు నిర్వహకులు. ప్రీమియర్ ఎపిసోడ్ సందడి సందడిగా సాగింది. అయితే, మొదటి వారం మాత్రం నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత నుంచి సరికొత్త టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సహా ఎన్నో ప్రయత్నాలు చేయడంతో సీజన్ 4 ఆసక్తికరంగా సాగుతోంది.

మసాలాను అందించేందుకే ఈ ప్రయోగం

మసాలాను అందించేందుకే ఈ ప్రయోగం

గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి మరింత వినోదాన్ని పంచుతామని బిగ్ బాస్ యూనిట్ చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే షోను నడిపిస్తున్నారు నిర్వహకులు. పక్కా ఎడిటింగ్‌తో ప్రేక్షకులకు కావాల్సిన మజాను పంచుతున్నారు. ఇందులో భాగంగానే లవ్ ట్రాకులను బాగా హైలైట్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో షోపై విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి.

ట్రైయాంగిల్ లవ్ స్టోరీపైనే ఎక్కువ ఫోకస్

ట్రైయాంగిల్ లవ్ స్టోరీపైనే ఎక్కువ ఫోకస్

ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎంటరైన హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో హీరో అభిజీత్, అఖిల్ సార్థక్ చనువుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ వేరు వేరుగా పులిహోర కలుపుతున్నారు. దీంతో దీన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా చెబుతూ బిగ్ బాస్ యూనిట్ ఎన్నో ప్రోమోలు కట్ చేసింది. వీళ్ల ట్రాకుల కారణంగా షోకు మరింత రెస్పాన్స్ వస్తుండడంతో వాటినే హైలైట్ చేస్తున్నారు.

ఇంతకు మోనాల్ ఎవరిని ప్రేమిస్తుంది.?

ఇంతకు మోనాల్ ఎవరిని ప్రేమిస్తుంది.?

షో ఆరంభంలో అభిజీత్‌తో ఎక్కువగా కనిపించేది మోనాల్ గజ్జర్. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె అఖిల్ వైపు వెళ్లింది. దీంతో ఈ హీరోయిన్ ఎవరిని లవ్ చేస్తుందో అర్థం కాక ప్రేక్షకులతో పాటు హౌస్‌లోని సభ్యులందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని నాగార్జున సైతం పలుమార్లు పరోక్షంగా ప్రస్తావించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇది సస్పెన్స్‌గా మారింది.

ఆమె క్యారెక్టర్‌తో బిగ్ బాస్ బ్యాడ్ ప్లాన్

ఆమె క్యారెక్టర్‌తో బిగ్ బాస్ బ్యాడ్ ప్లాన్

తమ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో హౌస్‌లోని ట్రైయాంగిల్ లవ్ స్టోరీపై ఎక్కువ ఫోకస్ చేసింది బిగ్ బాస్ యూనిట్. దీని వల్ల వాళ్లకు టీఆర్పీ రేటింగ్ ఏమేర పెరిగిందో తెలియదు కానీ, హీరోయిన్ మోనాల్ గజ్జర్‌కు మాత్రం చెడ్డ పేరునే మిగిల్చింది. ఇద్దరితో ఆమె ట్రాక్ నడుపుతున్నట్లు చూపించి... పరోక్షంగా క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Recommended Video

Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
పాపం ఆమెను బలి పశువును చేశారు

పాపం ఆమెను బలి పశువును చేశారు

వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ ముందు మోనాల్‌కు సంబంధించిన ఓ డిస్కర్షన్ జరిగింది. ఆ సందర్భంతో ఆమె క్యారెక్టర్‌ను బ్లేమ్ చేసినట్లు ప్రతి ఒక్కరికీ అనిపించింది. ఇది మోనాల్ దృష్టికి కూడా వెళ్లిందో ఏమో ఎలిమినేషన్ సమయంలో జరిగిన ఇష్యూలో.. తనను మధ్యలో తీసుకువచ్చి క్యారెక్టర్ బ్యాడ్ చేయొద్దని అభిజీత్, అఖిల్‌ను వేడుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X