Bigg Boss Telugu 7: ముద్దు బిడ్డ విషయంలో బిగ్ బాస్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. ఆ కంటెస్టెంట్‌కు గోల్డెన్ ఛాన్స్

ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఒకటి. ఇక ఈ సీజన్ ప్రారంభంలోనే గత సీజన్స్ కంటే కొత్తగా ఉంటుందంటూ ఉల్టా పుల్టా అని చెప్పుకువచ్చారు మేకర్స్. ఇక అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ ప్లాన్ చేశారు. ఇక ఇప్పటికే 80 శాతం పూర్తి అయిన ఈ షో.. చివరి అంకానికి చేరుకుంది. అయితే తాజాగా బిగ్ బాస్ లీక్స్ ప్రకారం.. ఈ వారంలో ఒక కంటెస్టెంట్ కు గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. అంతే కాదు.. బిగ్ బాస్ వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని సమాచారం. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ కొనసాగుతుంది. గత సీజన్స్ కంటే.. ఈ సారి కాస్త కొత్తగా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఇక 10 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7... 11వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్నది పది మంది మాత్రమే. అందులో శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి , రతికా రోజ్, అశ్విని శ్రీ, గౌతమ్ కృష్ణ ఉన్నారు.

Bigg Boss Plan Utter Flop in Rathika Issue and Ambati Arjun Got A Eviction Free Pass in Bigg Boss Telugu 7

ఇక వీరిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. విన్నర్ ఎవరు అనేది ఆసక్తి కరంగా మారింది. ఇదిలా ఉంటే.. 11వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా హాట్ హాట్ గా ముగిసింది. ఇక నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఈ వారం శివాజీ కెప్టెన్ కనుక ఆయన నామినేషన్స్ లో లేరు. ఇక నామినేషన్స్ లో ఉన్నది... ప్రియాంక, యావర్, శోభా శెట్టి, గౌతమ్, అమర్ దీప్, అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ ఉన్నారు.

ఇక బిగ్ బాస్ ముద్దు రతికా రోజ్... నామినేషన్స్ ముందే శివాజీ ఇచ్చిన ట్రైనింగ్ తో రెచ్చిపోయింది. నువ్వా నేనా అంటూ గోడవలు పెట్టుకుంది. అంతే కాదు.. నాగార్జున జస్ట్ హోస్ట్ అంటూ డైలాగులు వేసింది. మరోవైపు ప్రియాంక, అశ్విని రగడ, అర్జున్, ప్రశాంత్, అమర్ యావర్ గొడవలు కూడా హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి నామినేషన్స్ అయితే ముగిశాయి.

Bigg Boss Plan Utter Flop in Rathika Issue and Ambati Arjun Got A Eviction Free Pass in Bigg Boss Telugu 7

ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ కూడా బిగ్ బాస్ ఎవిక్షన్ ప్రీ పాస్ కోసం పోటీలు నిర్వహించాడు. అయితే ఈ సారి రతికా రోజ్ కు వచ్చేలా చేయాలని బిగ్ బాస్ అనుకున్నాడు. ఎందుకంటే.. రతికా రోజ్ ... బిగ్ బాస్ కు ముద్దు బిడ్డ. మొదటి సారి ఎలిమినేట్ అయిపోయినా సరే.. ఆమెకు పిలిచి మరి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక నామినేషన్స్ లో కూడా రతికా తన పవర్ ఏంటో చూపిస్తూ గొడవలు పెడుతుంది. ఇక బిగ్ బాస్ కు కంటెంట్ ఇచ్చే వాళ్లను కాపాడుకుంటాడు అనే టాక్ ఉంది. ఆ క్రమంలోనే రతికా రోజ్ కు ఆ పాస్ ఇప్పించాలని బిగ్ బాస్ ప్లాన్ వేసినప్పటికీ అది ఫ్లాప్ గా నిలిచింది.

Bigg Boss Plan Utter Flop in Rathika Issue and Ambati Arjun Got A Eviction Free Pass in Bigg Boss Telugu 7

ఆ ఎవిక్షన్ పాస్... అర్జున్ అంబటికి దక్కింది. దీనితో ఆయనకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లే అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆ పాస్ ఉంటే.. ఆయనకు ఓట్లు తక్కువ వచ్చి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చినా సరే... ఎలిమినేట్ కారు. ఆయనకు తక్కువ ఓట్లు వచ్చినా సరే... ఆయన తర్వాత ఎవరు తక్కువగా ఉంటే.. వారిని ఇంటి నుంచి పంపించేస్తారు. అలా అర్జున్ కు ఈ వారం గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఇక అర్జున్ అంబటి ఎవిక్షన్ పాస్ తో మరో వారం గట్టెక్కినట్టే. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X