బిగ్ బాస్‌లో వారం రోజులకే వైల్ కార్డ్ ఎంట్రీ: అప్పుడామె వచ్చింది.. ఇప్పుడెవరు..?
అతి తక్కువ సమయంలోనే కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న షో 'బిగ్ బాస్'. బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటూ సరికొత్త థీమ్‌తో తెలుగు వారికి పరిచయమైనప్పటికీ.... అద్భుతమైన స్పందనతో గతంలో దేనికీ సాధ్యం కాని రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు, ఈ షో చిన్న వాళ్లను బడా స్టార్లుగా చేసింది.. అదే సమయంలో గొప్ప గొప్ప వాళ్ల గాలి తీసేసింది. అందుకే ఈ షో పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్‌ను ప్రారంభించింది బిగ్ బాస్. ఈ నేపథ్యంలో మొదటి వారంలో సరికొత్త ప్రయోగం చేయబోతుంది. ఆ వివరాలు మీకోసం.!

మూడు సీజన్లు కంప్లీట్.. వివరాలు ఇవే
తెలుగులో బిగ్ బాస్ షో ఏడాదికి ఒక సీజన్ చొప్పున ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి దానిని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. అందులో శివ బాలాజీ విజేతగా నిలిచాడు. రెండో దానిని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా... దాన్ని కౌశల్ గెలుచుకున్నాడు. ఇక, అక్కినేని నాగార్జున నడిపించిన మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ విజేతగా నిలిచాడు.

నాలుగో సీజన్ ప్రారంభం అదిరిపోయింది
బిగ్ బాస్ ప్రియులు నాలుగో సీజన్ గురించి చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా కరోనా ప్రభావం ఉండడంతో ఈ సీజన్ ఆలస్యం అయింది. దీంతో సెప్టెంబర్ ఆరున ఈ సీజన్ ప్రారంభం అయింది. అక్కినేని నాగార్జున హోస్టింగ్‌తో మొదలైన ఈ షో ప్రీమియర్ ఎంతో సందడిగా సాగింది. ఈ ఎపిసోడ్‌లో ఆయన రెండు గెటప్‌లలో కనిపించి మెప్పించారు.

ఉత్కంఠకు తెర.... అందరినీ కలిపేశాడు
ఈ సీజన్‌కు మొత్తం పదహారు మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించాడు నాగార్జున. అందులో ఇద్దరిని మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. వీళ్లతో సరికొత్త ప్రయోగాలు చేసి హౌస్‌మేట్లలో ఉత్కంఠను పెంచాలనుకున్నాడు బిగ్ బాస్. కానీ, వాళ్లకు విషయం అర్థం అయిపోవడంతో... షో ప్రారంభం అయిన రెండు రోజులకే ఈ ఇద్దరిని కూడా ఇంట్లోకి పంపించేశాడు.

కొత్తగా నామినేషన్స్.. జోన్‌లో ఏడుగురు
బిగ్ బాస్ షో మొదటి వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఈ సారి కొత్తగా ఆలోచించిన బాస్.. నామినేట్ చేయాలనుకున్న వారి ముఖానిపై కిటికీ తలుపు వేయాలని సూచించాడు. సాదాసీదాగా సాగిన ఈ ప్రక్రియలో మొత్తం ఏడుగురు సభ్యులు (గంగవ్వ, అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత) ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చారు.

నాలుగో దాని విషయంలో తప్పిన లెక్క
కరోనా నేపథ్యంలో కొనసాగుతోన్న క్లిష్ట పరిస్థితిని అనుకూలంగా మలచుకుని... భారీ టీఆర్పీ రేటింగ్ సాధించాలనుకున్న బిగ్ బాస్ యూనిట్‌కు ఆదిలోనే నిరాశ ఎదురైంది. గత సీజన్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన నాగ్.. ప్రారంభ ఎపిసోడ్‌ను సోసోగా నడిపించాడు. దానికి తోడు కంటెస్టెంట్లలో పెద్దగా పేరున్న వాళ్లు లేకపోవడంతో దీనిపై ఆసక్తి కనిపించడం లేదు.

వారం రోజులకే మొదటి వైల్ కార్డ్ ఎంట్రీ
కంటెస్టెంట్ల కారణంగానో... మరే రీజనో తెలియదు కానీ... బిగ్ బాస్ షోకు అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. దీంతో షో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం... మొదటి వారంలోనే బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందట. వచ్చేది ఎవరో తెలియదు కానీ, పేరున్న కంటెస్టెంట్‌నే ఎంపిక చేశారని అంటున్నారు.
Recommended Video

అప్పుడామె వచ్చింది.. ఇప్పుడెవరు..?
బిగ్ బాస్ సీజన్ 2లో షో ప్రారంభం అయిన మొదటి వారంలోనే ప్రముఖ హీరోయిన్ నందినీ రాయ్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అయింది. రోడ్డు ప్రమాదం వల్ల ప్రారంభ ఎపిసోడ్‌కు అందుబాటులో లేకపోవడం వల్లే ఆమెను ఆలస్యంగా పంపారు. ఇప్పుడేమో పరిస్థితి వేరు. కాబట్టి ఈ సారి హౌస్‌లోకి ఎవరిని పంపుతారన్న ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











