Bigg Boss Telugu 7: అమర్​దీప్‌ను బలి చేసిన బిగ్ బాస్... ఆ కంటెస్టెంట్‌ను గెలిపించేందుకే అలా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే బెటర్ గా సాగుతోంది. పది వారాలు పూర్తి చేసుకున్న ఈ షో... 11వ వారంలోకి అడుగుపెట్టేసింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే హౌస్ లో కెప్టెన్సీ టాస్కులో నిర్వహించారు. అందులో ఓ కంటెస్టెంట్ ను కాపాడేందుకు బిగ్ బాస్ బిగ్ ప్లాన్ వేశాడని తెలుస్తోంది. అంతే కాదు... ఆ కంటెస్టెంట్ కోసం అమర్ దీప్ ను బలి చేశాడని అర్ధం అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకూ ఆసక్తిగా మారుతోంది. ఇక పదివారాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో... 11వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. మరో నెల రోజుల్లో ఈ షోకు ముగింపు పడనుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. అమర్ దీప్, గౌతమ్, అర్జున్ అంబటి, అశ్విని, ప్రియాంక, శోభా శెట్టి, యావర్, రతికా రోజ్.. నామినేషన్స్ లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఆసక్తిగా మారింది.

Bigg Boss plans to make Priyanka Jain the captain in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక పది వారాల్లో పది మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికా రోజ్, శుభ శ్రీ రాయగురు, నయని పవని, పూజా మూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజ, బోలే షవాలి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఒకటి బిగ్ బాస్ ఎలిమిమేట్ చేయగా.. ఇంకోటి యావర్ కు వచ్చిన ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

అయితే ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక చివరి రౌండ్ లో ప్రియాంక జైన్, అమర్ దీప్ నిలిచారు. అయితే వీరిలో ప్రియాంక గెలిచేలా బిగ్ బాస్ బిగ్ ప్లాన్ వేశారు. ఇద్దరు పొడవైన బ్రిక్స్ కట్టారు. అందులో అమర్ దీప్ పొడవుగా ఉంది. అయితే వాటిని కాపాడుకోవాలని బిగ్ బాస్ చెప్పగా.. దాన్ని కాపాడుకునేందుకు అమర్ దీప్, ప్రియాంక ప్రయత్నం చేశారు.

Bigg Boss plans to make Priyanka Jain the captain in Bigg Boss Telugu 7 Full Details Here

అయితే ఈ ప్రయత్నంలో ప్రియాంకపై హౌస్ మేట్స్ దాడి చేశామా అన్నట్లు గా చేశారు. అదే అమర్ ను గౌతమ్, రతికా టార్గెట్ చేసి మరీ.. అతని బ్రిక్స్ బ్రిడ్జ్ ను కూలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో అమర్ దీప్ ఆవేశపడిపోయాడు. ఇక రతికా రోజ్ వెన్నుపోటు గురించి తెలిసిందే. రతికా.. అమర్ ను టార్గెట్ చేసింది. ఇక అమర్ బ్రిక్స్ కూలిపోయేదాకా బిగ్ బాస్ చూసి.. బజర్ కొట్టాడు. ఇక ప్రియాంకను గెలిపించాడు బిగ్ బాస్.

అసలు ప్రియాంకను టాప్ 5లో పెట్టేందుకు బిగ్ బాస్ ఈ ప్లాన్ వేశాడు. ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాకా స్టార్ మాలో సీరియల్ లో అవకాశం ఉంది. ఇక ఆ సీరియల్ రేటింగ్ రావాలంటే.. ప్రియాంక టాప్ 5లో నిలవాలి. అందుకోసమే.. ప్రియాంకను సపోర్ట్ చేస్తూ... కెప్టెన్ చేశాడు. టాప్ 5లో పెట్టేందుకు కాపాడుకుంటూ వస్తున్నాడు. అదన్న మాట అసలు విషయం. ఇక ప్రియాంకకి కూడా బాగానే కలిసివస్తుంది. చూడాలి మరి ఏంజరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X