‘నేను రొమాంటిక్... నాకు అలాంటి అబ్బాయిలంటే ఇష్టం!'

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్స్‌లో ప్రియా శెట్టి (Priya Shetty)ఒకరు. అగ్నిపరీక్ష దశలోనే తన క్యూట్ లుక్స్, కాన్ఫిడెన్స్‌తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించిన ప్రియా, షో ప్రారంభంలోనే హౌస్‌లో స్పెషల్ అటెన్షన్ తెచ్చుకుంది. కర్నూలుకు చెందిన ఈ డాక్టరమ్మ బిగ్ బాస్ ప్రయాణం కేవలం మూడు వారాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. హౌస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రియా శెట్టి తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది.

తాజాగా బిగ్ టీవీ నిర్వహించిన 'కిస్సిక్ టాక్స్' టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రియ శెట్టి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా హౌస్‌లో తనకు ఎవరు ఇష్టం? ఎవరి తో క్లోజ్‌గా ఫీల్ అయ్యింది? తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి? వంటి ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానాలు చెప్పింది.

Bigg Boss Priya Shetty Opens Up on Love Relationships Bigg Boss Journey in Kissik Talks

యాంకర్ వర్ష ప్రియాను స్వాగతిస్తూ.. ఆమె అందంపై ప్రశంసలు కురిపించింది. "అందరి గుండెల్లో నువ్వే ఉన్నావు... కుర్రాళ్లు 'ప్రియా ప్రియా' అంటూ పాటలు పాడుకుంటున్నారు" అంటూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించింది. దీనికి ప్రియా నవ్వుతూ స్పందించడం ఆకట్టుకుంది. అందంగా ఉండడానికి సీక్రెట్ ఏమిటి అని వర్ష అడిగిన ప్రశ్నకు ప్రియా సరదాగా "ఏమీ లేదు... బాగా తింటా అంతే నా బ్యూటీ సీక్రెట్" అని చెప్పింది. వెంటనే వర్ష "అబ్బాయిల హార్ట్" అని చెప్పడంతో ప్రియా చిరునవ్వు చిందించింది.

ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడిన ప్రియా.. తాను ప్రత్యేకంగా దుర్గా దేవిను ఎక్కువగా నమ్ముతానని తెలిపింది. "దుర్గమ్మ దర్శనం చేసిన వెంటనే బిగ్ బాస్ అగ్నిపరీక్షకు కాల్ వచ్చింది" అంటూ తన అనుభవాన్ని ఎమోషనల్‌గా షేర్ చేసింది. ఇది ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నట్లు తెలిపింది.
బిగ్ బాస్ హౌస్‌లో తనకు ఎవరంటే ఇష్టం అన్న ప్రశ్నకు ప్రియా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "కళ్యాణ్ పడాల అంటే నాకు చాలా ఇష్టం. అతనిపై ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఫీల్ అవుతుంటాను. వాడు ఇలా చేశాడా? అలా చేశాడా? అని అనిపిస్తూ ఉంటుంది" అంటూ తన భావాలను ఓపెన్‌గా వ్యక్తం చేసింది.

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తాను కర్నూలుకు చెందిన రాయలసీమ అమ్మాయని చెప్పింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. "లేదు లేదు... ఐ యామ్ సింగిల్" అని స్పష్టంగా చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తనకు కాబోయే భాగస్వామి గురించి కూడా ప్రియా ఓపెన్‌గా మాట్లాడింది. "నేను ఎక్కువగా కేర్ చేస్తాను, ప్యాంపర్ చేస్తాను... నేను రొమాంటిక్. ప్రపంచానికి విలన్‌లా ఉన్నా, నా దగ్గరికి వచ్చేసరికి హీరోలా ఉండాలి" అంటూ తన ఎక్స్‌పెక్టేషన్స్ వెల్లడించింది. లుక్స్ విషయానికి వస్తే డార్క్ స్కిన్ ఉన్న అబ్బాయిలు తనకు ఇష్టమని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రేమ, బ్రేకప్‌లపై కూడా ప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "అమ్మాయిలు బ్రేకప్ నుంచి త్వరగా బయటపడతారు కానీ అబ్బాయిలు మాత్రం చాలా లోతుగా ఫీల్ అవుతారు. ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం మర్చిపోరు. వాళ్లు ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు" అంటూ అబ్బాయిల గురించి చెప్పింది. ఇక ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ, అది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమని తెలిపింది. "మనమే జాగ్రత్తగా ఉంటే ఆ బంధాన్ని జీవితాంతం కాపాడుకోవచ్చు" అని చెప్పింది.

అయితే ఒక బంధం కొనసాగలేని పరిస్థితి వస్తే బలవంతంగా పట్టుకోవడం కంటే విడిపోవడమే మంచిదని అభిప్రాయపడింది. "ఫ్రెండ్స్ అయినా, ప్రేమ అయినా... విడిపోవాల్సిందే అనిపిస్తే వదిలేయడం మంచిది" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రియా శెట్టి ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, రిలేషన్‌షిప్స్‌పై చేసిన ఓపెన్ కామెంట్స్‌తో మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె మాటలు యువతలో చర్చకు దారి తీస్తుండగా, ఫ్యాన్స్ మాత్రం ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్‌ను మెచ్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X