5 ఏళ్లుగా రాత్రిళ్లు అలా ఉదయం ఇలా.. బిగ్ బాస్ బ్యూటీ లివింగ్ టుగెదర్
బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ బ్యూటీ ప్రియాంక జైన్. సీరియల్ నటిగా టెలివిజన్ రంగంలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు ఆడియెన్స్ ను తన నటనతో, అచ్చమైన తెలుగుమ్మాయి రూప సౌందర్యంలో ఆకట్టుకోగలిగింది. తెలుగులో పలు సీరియల్స్ తో పాటు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో ద్వారా ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. ఇక తెలుగు ఫ్యాన్స్ కోసం తనకు వీలైనప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో లివింగ్ టుగెదర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రియాంక జైన్ ఫ్యామిలీ వివరాలు..
మనోజ్ ఎస్ జైన్ - ఫల్గుణి జైన్ దంపతులకు 1998 జూలై 2న జన్మించింది. మహారాష్ట్ర ముంబైలో జన్మించింది. కానీ బెంగళూరులో పెరిగింది. తన విద్యాభ్యాసానాన్ని పూర్తి చేసుకుంది. స్కూల్, కాలేజీని బెంగళూరులోనే పూర్తి చేసుకుంది. డిగ్రీ పట్టా పొందింది. ఆమెకు తమ్ముడు జెనీల్ ఎం జైన్ ఉన్నాడు. ఇక వీరికి చిన్న వ్యాపారం, తల్లికి బ్యూటీ పార్లర్ ఉందని తెలుస్తోంది. చిన్న వయస్సులోనే మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా పలు అవకాశాలు అందుకుంది. తమిళం, కన్నడ, తెలుగులో చిత్రాలు చేసింది. రంగి తరంగ, గోలి సోడ, చల్తే చల్తే వంటి సినిమాల్లో నటించింది.

బిగ్ బాస్ తో సెన్సేషనల్ గా..
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుంది. 2023లో హాట్ స్టార్ ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఎంపికైంది. పలు వారాలు హౌజ్లో తనదైన శైలిలో వినోదాన్ని పంచింది. ప్రతి టాస్క్ లోనూ ఫుల్ ఎనర్జీని చూపించి ఆకట్టుకుంది. ఇక ఈ సీజన్లో పార్టిసీపేట్ నటించినందుకు రూ.3 లక్షల వరకు ఛార్జీ చేసినట్టు ప్రచారం. ఇక ఈ షో తర్వాత ప్రియాంక జైన్ కు మరింత క్రేజ్ దక్కింది.
ప్రియాంక జైన్ కామెంట్స్..
టీవీ షోలో, సినిమాలు, బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో మెరిసిన తర్వాత ప్రియాంక జైన్ మరిన్ని సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. మరోవైపు సమయం ఉన్నప్పుడల్లా తన అభిమానుల కోసం స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. కాగా ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. వాళ్లిద్దరూ సహజీవనం చేస్తుండటం విశేషం. లివింగ్ టు గెదర్ తో లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
అయితే లివింగ్ టుగెదర్ లో వారి ప్రయాణం 5 ఏళ్లు పూర్తైందని తెలిపారు. ఈ ఐదేళ్లలో తమకు కష్టమైన పని ఉదయం నిద్ర లేవడం అని చెప్పారు. రాత్రి ఎంత సేపైనా మెళువకగా ఉంటానని, కానీ ఉదయం లేవంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుందని ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు. లివింగ్ టుగెదర్ లో ఇదే తమకు ప్రధాన ప్రాబ్లంగా మారిందని ఫన్నీ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











