టెస్టీ తేజకు బిగ్ బాస్ బ్యూటీ మ్యారేజ్ ప్రపోజల్.. కానీ, ఆ కండిషన్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు టేస్టీ తేజ (Tasty Teja)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబర్‌గా ఫుడ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu)లో ఎంట్రీ ఇచ్చారు. దీంతో మరింత పాపులర్ అయ్యారు. ఇలా ఒకసారి కాదు, ఏకంగా రెండు సార్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ప్రేక్షకులను అలరించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సీజన్ 7లో మెయిన్ కంటెస్టెంట్‌గా 9 వారాలు హౌస్‌లో కొనసాగిన తేజ.. సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి 13వ వారం వరకు కొనసాగారు.

బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపును సరిగ్గా ఉపయోగించుకున్న తేజ.. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్, ఫుడ్ బిజినెస్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టార్ సెలబ్రిటీలతో ఫుడ్ వీడియోలు చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారని తెలుస్తోంది. అలాగే 'ఇరానీ నవాబ్స్ టీ' పేరుతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర నగరాల్లో కూడా ఫ్రాంచైజీలు ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు. అయితే ఈ స్థాయికి రావడానికి తేజ ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తాజాగా వెల్లడించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన తన చిన్ననాటి బాధలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss Priyanka Jain Marriage Proposal to Tasty Teja But First That Six Pack Condition

టేస్టీ తేజ మాట్లాడుతూ.. 'నాకు అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ చేసేంత ధైర్యం ఉండేది కాదు. నా బాడీ స్ట్రక్చర్, నా కలర్ వల్ల నాకు ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. స్కూల్‌లో, కాలేజీలో అమ్మాయిల మధ్యగా నడుస్తుంటే వీడు లావుగా ఉన్నాడు, వీడేంటీ ఇలా ఉన్నాడు అంటూ కామెంట్లు చేసేవారు. దాదాపు 8 ఏళ్ల పాటు నేను ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు' అని తేజ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది యువత కూడా ఇలాంటి బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కొంటుంటారు. తేజ చెప్పిన మాటలు చాలామందికి కనెక్ట్ అయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇంకా తేజ మాట్లాడుతూ.. "నా లైఫ్‌లో అమ్మాయిలు లేరు. ఇంట్లో వాళ్లతో తప్ప బయట ఎవరికీ మాట్లాడేవాడిని కాదు. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాతే పరిస్థితి మారింది. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్‌తో ఫ్రెండ్షిప్ పెరిగింది. ముఖ్యంగా శోభ శెట్టి, శుభ శ్రీ వంటి వాళ్లు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు" అని తెలిపారు. ఇదిలా ఉంటే, అదే షోలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు తేజ ఇచ్చిన సమాధానం కూడా వైరల్‌గా మారింది. "ఎవరైనా అమ్మాయి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా.. కానీ ముందుగా సిక్స్ ప్యాక్ చేయ్ అంటే ఏం చేస్తావు?" అని అడగ్గా.. తేజ నవ్వుతూ ఆసక్తికర విషయం బయటపెట్టారు.

'నాకు ఇప్పటికే అలాంటి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్, నటి ప్రియాంక జైన్ (Priyanka Jain)ఒకసారి సరదాగా.. నువ్వు సిక్స్ ప్యాక్ చేస్తే నా లవర్ శివ్ ని వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటా అంది' అని చెప్పాడు. ఆ వెంటనే లైవ్‌లోనే ప్రియాంకకు కాల్ చేయగా.. ఆమె కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ "అవును చెప్పాను.. కానీ తేజ సిక్స్ ప్యాక్ చేయలేడు కాబట్టి చెప్పాను" అంటూ సరదాగా స్పందించిందట. ఈ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ప్రియాంక ప్రస్తుతం నటుడు శివకుమార్‌తో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అలాంటి సమయంలో తేజతో సరదాగా చేసిన ఈ కామెంట్స్ నెటిజన్లలో నవ్వులు పూయించాయి. మరోవైపు, తేజ ప్రయాణాన్ని చూస్తే.. ఒకప్పుడు బాడీ షేమింగ్‌తో ఇబ్బంది పడిన యువకుడు.. ఇప్పుడు తన టాలెంట్‌తో సెలబ్రిటీగా మారడం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. తనపై వచ్చిన కామెంట్లను బలంగా తీసుకుని ముందుకు వెళ్లాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. బిగ్‌బాస్ తర్వాత అతని జీవితమే మారిపోయిందని చెప్పాలి. యూట్యూబ్ స్టార్‌గా, బిజినెస్‌మ్యాన్‌గా, టీవీ సెలబ్రిటీగా ఎదిగిన తేజ.. ఇప్పుడు చాలామందికి 'మోటివేషన్ స్టోరీ'గా నిలిచాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X