నా లిప్స్ అంటే ఇష్టమన్నాడు.. బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
బిగ్ బాస్ బ్యూటీ, సీరియల్ నటి ప్రియాంక జైన్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటోంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను చెబుతూ ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఓ సీక్రెట్ ను బయట పెట్టింది. ఇంత వరకు ఆ విషయాన్ని ఎక్కడ చెప్పలేదని చెబుతూ బోల్డ్ గా సమాధానం చెప్పింది.
ప్రియాంక జైన్ తెలుగు సీరియల్స్..
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబైకి చెందిన ప్రియాంక జైన్ తన నటనతో, తెలుగమ్మాయిలా కనిపించే కట్టు, బొట్టు, రూప సౌందర్యంతో ఇక్కడి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. 1998లో పుట్టిన ఈ యంగ్ బ్యూటీ 25 ఏళ్లలోనే సీనియల్ నటిగా రాణిస్తోంది. తెలుగు టెలివిజన్ లో 'అమ్ములు', 'మౌన రాగం' వంటి సీరియల్స్ తో సెలబ్రెటీగా మారిపోయింది.

కిస్సిక్ టాక్ లో ప్రియాంక జైన్ రచ్చ..
యంగ్ బ్యూటీ ప్రియాంక జైన్ తన నటన, అందంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలతో వారిని ఖుషి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వస్తున్న కిస్సిక్ టాక్ షోకు తాజాగా హాజరైంది. ఈ సందర్భంగా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాను నిర్మోహమాటంగా పంచుకుంది. కాస్తా బోల్డ్ సీక్రెట్ ను బయటపెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ప్రియాంక జైన్ చెప్పిన సీక్రెట్..
ప్రియాంక జైన్ ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రామ్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే ఆమెకు యాక్టర్ శివ్ తో రిలేషన్ షిప్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏదైనా చెప్పమని వర్ష అడిగిన సమయంలో ఓ సీక్రెట్ ను చెప్పింది. శివ్ కు తన బాడీలో తన లిప్స్ లో అంటే చాలా ఇష్టమని చెప్పాడని చెప్పింది. తమ వ్యక్తిగత విషయాలను ఇంత ఓపెన్ గా చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రియాంక జైన్ సినిమాలు..
సీరియల్స్ ద్వారా తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ ను అలరించిన ప్రియాంక జౌన్ ఇటు హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. గతంలో వినరా సోదరా వీర కుమార, ఎవడు తక్కువ కాదు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలతో తనకు పెద్దగా ఆశించిన ఫలితం రాలేదు. ఇక తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొనడం ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్ గా తన వంతుగా ఎంటర్ టైన్ మెంట్ ను ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ షోతో ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











