Priyanka Jain బిగ్ బాస్ షోకి పోయి తప్పు చేశా... ఏడుస్తూ సంచలన విషయాలు బయటపెట్టిన ప్రియాంక
ప్రియాంక జైన్... సీరియల్ యాక్టర్ గా అందరికి సుపరిచితమే. ఇటీవల బిగ్ బాస్ షోకి వెళ్లిన తర్వాత మరింత పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. షార్ట్ హెయిర్ తో క్యూట్ గా కనిపించే ఈ భామ.. తన నిజజీవితంలో చాలా కష్టాలు పడింది. ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పుకువచ్చింది కూడా. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది ప్రియాంక. బిగ్ బాస్ షోకు వెళ్లి తప్పు చేశాను అంటూ ఆవేదన చెందింది. ఏడుస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే...
మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియాంక జైన్.. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 లో సందడి చేసింది. ఇక ప్రియాంక హౌస్ లో ఎంటర్ అయ్యాక.. బీబీ వంటలక్కగా పేరుతెచ్చుకుంది. ఇంట్లోని వారందరికీ తన వంటలతో రుచిచూపించింది. అంతేనా శివంగిలా అన్ని గేమ్స్ లో ఆడుతూ... బిగ్ బాస్ షోలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో చోటు దక్కించుకుంది. ఇక ఈ భామ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక పలు సీరియల్స్ తో పాటు.. తన యూట్యూబ్ ఛానెల్ తో బిజీగా గడుపుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సంచలన విషయాలు బయటపెట్టింది. తాను బిగ్ బాస్ షోకి వెళ్లకుండా ఉండాల్సిందంటూ ఏడుస్తూ.. ఆవేదన చెందింది. దీనితో అసలేమైంది అంటూ ఫ్యాన్స్ అంతా కంగారు పడిపోయారు. అయితే తాను ఎందుకు బాధపడుతున్నానో ఆ వీడియోలో ప్రియాంక చెప్పుకువచ్చింది. బిగ్ బాస్ తర్వాత తన జీవితం చాలా సంతోషంగా ఉంటుందని ప్రియాంక జైన్ అనుకుందంట.
అయితే షో తర్వాత ఆమె జీవితం అందుకు భిన్నంగా జరిగిందని ఆ వీడియోలో చెప్పుకువచ్చింది. తాజాగా తన తల్లికి సర్జరీ జరిగినట్లు ప్రియాంక వెల్లడించింది. ఆమెకి గత కొంతకాలంగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో వయసు పెరుగుతుండడం వల్ల జరిగే మార్పులు అని అనుకున్నట్లు ఆ వీడియోలో శివకుమార్ తో కలిసి చెప్పుకువచ్చింది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్లు డాక్టర్లు చెప్పారట.

ప్రియాంక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన తల్లికి ఈ ప్రాబ్లం మొదలు అయిందట. అయితే ప్రియాంకని బిగ్ బాస్ షోలో చూడాలని ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదని... మేం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా అయిందంటూ చెప్పుకువచ్చింది. ఇక తాను బిగ్ బాస్ షోకు పోకుండా ఉండి ఉంటే... అమ్మను బాగా చూసుకునేదాన్ని అంటూ ఏడుస్తూ చెప్పుకువచ్చింది. అయితే గర్భాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిపింది.
తన తల్లికి సర్జరీ చేసేందుకు ఒప్పుకున్నట్లు వీడియోలో తెలిపింది. ఇక ఆ వీడియోలో తన తల్లిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్లే సమయంలో ప్రియాంక ఆవేదన చెందింది. అయితే సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో ప్రియాంక నార్మల్ అయింది. తానూ బిగ్ బాస్ లోకి వెళ్లకుండా తన తల్లి ఆరోగ్యం పై కేర్ తీసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదంటూ ప్రియాంక ఆ వీడియోలో తెలిపింది. డిశ్చార్జ్ అయినా తర్వాత తన తల్లిని ఇంటికి తీసుకువెళ్లిన ప్రియాంక... ఈ వీడియోను నెటిజన్స్ తో పంచుకుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఆమె తల్లి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











