అలాంటి డ్రెస్సులేస్తే.. గలీజ్ కామెంట్స్.. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన

సీరియల్ నటి, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో, తెలుగమ్మాయిలా కనిపించే కట్టు, బొట్టు, రూప సౌందర్యంతో ఈ బ్యూటీ బుల్లితెర ఆడియెన్స్ లో మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. పలు సీరియల్స్, టీవీ షోలతో స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది. ప్రస్తుతం ఆయా షోల్లో మెరుస్తూ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో నిర్మోహమాటంగా పంచుకుంటోంది. తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ షోకు గెస్ట్ గా హాజరైంది. ఈ సందర్భంగా తనపై వచ్చిన ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించింది.

ప్రియాంక జైన్ కు గుర్తింపునిచ్చిన తెలుగు సీరియల్స్..
ముంబైకి చెందిన ప్రియాంక జైన్ దక్షిణాది ప్రేక్షకులను అలరించేందుకు సౌత్ టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 1998లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ 25 ఏళ్లలోనే సీనియల్ నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగులో 'అమ్ములు', 'మౌన రాగం' వంటి సీరియల్స్ తో సెలబ్రెటీగా మారిపోయింది. తన నటనకు టీవీ ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. అప్పటి నుంచి వరసగా టెలివిజన్ షోల్లో అవకాశాలు దక్కుతూనే వచ్చాయి.

Bigg Boss Priyanka Jain shocking comments about her Dressing style

హీరోయిన్ గా ప్రియాంక జైన్ సినిమాలు..
సీరియల్స్ ద్వారా తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక జైన్ ఇటు సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. గతంలో వినరా సోదరా వీర కుమార, ఎవడు తక్కువ కాదు, వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలతో తనకు పెద్దగా ఆశించిన ఫలితం రాలేదు. కానీ అంతకంతకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది.

బిగ్ బాస్ తర్వాత ప్రియాంక జైన్ పై ట్రోలింగ్..
నార్త్ కు చెందిన ముద్దుగుమ్మ అయినప్పటికీ ప్రియాంక జైన్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొనడం ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. హౌజ్ లో తనదైన శైలిలో టాస్క్ ల్లో పాల్గొంటూ ఎంటర్ టైన్ మెంట్ పంచింది. ఈ షో నుంచి బయటికి వచ్చాక మరింతగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే బిగ్ బాస్ ద్వారా తను ధరిస్తున్న దుస్తులతో ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ వస్తోంది. నెల రోజుల కింద ప్రియాంక జైన్ ఓ డ్యాన్స్ షోలో పాల్గొన్న సందర్భంగా వేసుకున్న దుస్తుల కారణంగా తీవ్రంగా ట్రోలింగ్ కు గురైంది. దానిపై తాజాగా స్పందించింది.

నచ్చితే ఫాలో అవ్వండి.. లేదంటే అన్ ఫాలో కొట్టండి..
డ్రెస్సింగ్ విషయంలో ఎవరికీ వారికి ప్రత్యేక అభిరుచులు ఉంటాయి. అలాగని డీప్ డ్రెస్సింగ్ తో ఏ అమ్మాయి, ఏ సెలబ్రెటీ బయట తిరగాలని ఆలోచించదు. మేము కూడా అమ్మాయిలమే, మనుషులమే మాకూ మనస్సు ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చిన సందర్భాలున్నాయి. నన్ను గతంలో ట్రోలింగ్ చేశారు. పద్ధతిగా ఉండే అమ్మాయి ఇలా మారిపోయిందంటూ.. కానీ కొన్ని దుస్తుల్లో మెరుస్తూ తనను తను కొత్తగా అభిమానులకు చూపించే ప్రయత్నం చేస్తుంటామని, కొన్ని సార్లు అది వర్కౌట్ కాకపోవచ్చు. అంత మాత్రానా కామెంట్లలో పచ్చి బూతులు తిట్టడం సరికాదు, మీకు నచ్చకపోతే ఫాలో అవ్వకండి.. అన్ ఫాలో కొట్టండి.. అంతే గానీ ఇష్టమొచ్చినట్టు భూతు కామెంట్లు పెట్టడం సరికాందంటూ ప్రియాంక జైన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తనూ అభిమానుకు మెచ్చేలానే ఉన్నానని, ఇకపై అలానే ఉంటామని చెప్పే ప్రయత్నం చేశారు.

More from Filmibeat

Read more about: priyanka jain bigg boss telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X