Bigg Boss షణ్ముఖ్ జస్వంత్ బిచ్చపు బ్రతుకు.. ప్రియాంక పాకులట.. ఆనీ మాస్టర్ ఓవరాక్షన్
11వ వారం బిగ్ బాస్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. నామినేషన్ ప్రక్రియతో కూడా సోమవారం నాడు ఒక్కసారిగా మంచి హైప్ ఐతే క్రియేట్ అయ్యింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు నామినేషన్స్ లో ప్రతిసారి డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చిన వారు ఈ వారం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. వీలైనంతవరకు కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యి సేఫ్ జోన్ లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతోందని అర్ధమవుతోంది. ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నామినేటెడ్ కంటెస్టెంట్స్..
ఈ వారం షణ్ముఖ్ జస్వంత్ కాజల్ మానస్ సిరి ప్రియాంక సన్నీ ఆనీ మాస్టర్ శ్రీ రామచంద్ర నామినేటెడ్ కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. వీటిలో ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళి పోతారు అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే అందరి చూపు మాత్రం ఎక్కువగా ఆనీ మాస్టర్ పైనే ఉంది. అసలైతే బిగ్ బాస్ మొదలైన కొన్ని రోజులకే ఆమె ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సోలోగా ఫైట్ చేస్తూ కొనసాగుతోంది.

నీ ఇల్లు బంగారం గాను..
ఇక కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన ప్రోమోలో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా చాలా ఆసక్తికరంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ బలమైన కంటెస్టెంట్స్ కావడంతో ఎవరైతే కెప్టెన్ గా ఎన్నికవుతారో వాళ్ళు సేఫ్ జోన్ లోకి వచ్చినట్లే. నీ ఇల్లు బంగారం గాను అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ కూడా గోల్డ్ మైనర్స్ గా మారాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇక బజర్ మోగిన వెంటనే అందరూ కూడా ఆటలోకి పోటాపోటీగా పరిగెత్తే బంగారాన్ని వెతికారు.
బుచ్చపు బ్రతుకు
ఎవరికి వారు వారి బంగారాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో ఇతర పోటీ దారులు కూడా ఆ బంగారాన్ని దొంగతనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పాట చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. యాంకర్ రవి షణ్ముఖ్ జస్వంత్ మధ్యలో కామెడీగా కొంత రసబస కొనసాగింది. షణ్ముఖ్ రవి బంగారం తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో రవి ఇదేమి బుచ్చపు బతుకు రా నీది అంటూ కామెంట్ చేశాడు.

ఆనీ మాస్టర్ ఓవరాక్షన్
ఇక ఈ పోటీలో ఆనీ మాస్టర్ అయితే వెక్కిరిస్తూ అందరినీ ఆట పట్టించే ప్రయత్నం చేసింది. తప్పకుండా ఈ సారి దొంగతనం చేస్తాను అంటూ సన్నీ నీ కన్ఫ్యూజ్ చేసింది. దీంతో సన్నీ తన బంగారాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆనీ మాస్టారు కొంత చిరాకు తెప్పించింది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆమె కాస్త ఓవరాక్షన్ చేస్తుందని కూడా అంటున్నారు.
Recommended Video

ప్రియాంక పాకులాట
ఇక మరో వైపు ప్రియాంక తనలోని దొంగని చాలా తెలివిగా బయటపెడుతోంది. యాంకర్ రవి బంగారాన్ని దొంగిలించిన ఆమె మెల్లగా పాకుతూ రావడం కామెడీగా అనిపించింది. చూస్తుంటే ఈ కాప్టెన్ టాస్క్ చాలా సరదాగా కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది. అలాగే గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కొనసాగే ఆట ఈ వారం చాలా కీలకం కానుంది. మరి కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు ముందువరుసలో ఉంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











