Bigg boss 5 : కొట్టుకున్న ఉమా -ఆనీ.. 'సిగ్గు లేదా?, చిల్లర దానా' అంటూ షాకింగ్ కామెంట్స్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఒక వారం పూర్తిగా రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. రెండో వారానికి కెప్టెన్ గా ఎన్నికయ్యేందుకు గాని ఇప్పుడు టాస్కులు నిర్వహిస్తున్నారు. ఈ టాస్క్ లో ఒకరికి ఒకరు బాగానే గొడవ పడుతున్నారు. తాజా ప్రోమో మాత్రం రచ్చ రేపింది ఆ ప్రోమో కి సంబంధించిన వివరాల్లోకి వెళితే

భారీ టాస్క్

భారీ టాస్క్

దాదాపు ఏడుగురు సభ్యులు ఈసారి నామినేషన్స్ లో ఉండగా అందులో ఒకరు ఈ వారాంతంలో ఎలిమినేట్ కానున్నారు. ఇక హౌస్ కి మొట్టమొదటి కెప్టెన్గా సిరి వ్యవహరిస్తూ ఉండగా ఇప్పుడు తరువాతి కెప్టెన్ ఎవరు అనే విషయం మీద టాస్కులు ఆడుతున్నారు. ఇక ఇప్పటి వరకు పెద్దగా ఫిజికల్ టాస్క్ లు ఏమీ ఇవ్వకపోయినా ఈ సీజన్ మొత్తం మీద భారీ ఫిజికల్ టాస్క్ అనిపించేంత టాస్క్ ఒకటి ఇచ్చారు.

ఆడ మగ తేడా లేకుండా

ఆడ మగ తేడా లేకుండా


ఇక ఈ భారీ ఫిజికల్ టాస్క్ లో గెలవడం కోసం రెండు టీములు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి, ఆడ మగ తేడా లేకుండా ఒకరి మీద ఒకరు పడుతూ ఎలా అయినా టాస్క్ గెలవాలనే పట్టుదలతో విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇక తాజా ప్రోమోలో సిరి అలాగే శ్వేత వర్మ కొట్టుకోగా ఉమా దేవి అలాగే ఆని మాస్టర్ కూడా ఒకరి మీద ఒకరు చూసుకున్నారు.

కొడితే చింపుతా

కొడితే చింపుతా

ప్రోమో ప్రారంభంలో ఉమా కొట్టింది అని సిరి గట్టిగా అరవడంతో, అసలు ఎందుకు కొట్టారు అని ఉమా దేవి ఇంకా గట్టిగా అరిచింది, ఇంత లో కింద కూర్చుని ఉన్న ఆని మాస్టర్ ఒసేయ్ ఉమా చింపుతావా సిగ్గు లేదా నీకు, తూ అంటే మీరు కొడితే నేను చింపుతా అని ఉమా కూడా అంతే అరుస్తూ చెప్పింది.

చిల్లర vs క్లాస్

చిల్లర vs క్లాస్

దానికి సీరియస్ అయిన ఆని మాస్టర్ చిల్లర అనే పదం వాడడం తో అవును నేను చిల్లరే నువ్వు పెద్ద క్లాసు నుంచి వచ్చావు మరి అంటూ ఉమ కూడా ఫైర్ అవుతుంది. అయితే అలాగే ప్రియ కూడా తన దగ్గరకు వస్తే కాల్ తో తంతా అని అనడం కూడా ప్రోమోలో చూపించారు, అయితే శ్వేతా వర్మ కెమెరా ముందుకు వచ్చి కాళ్లతో కట్టించుకోవడానికి నేను ఈ బిగ్ బాస్ షో కి రాలేదు అని పేర్కొంది.

నేను ఆడడం లేదన్న శ్వేత

బిగ్ బాస్ సారీ నేను ఈ ఆట ఆడడం లేదంటూ కెమెరా ముందు చెప్పేసి పక్కకు వెళ్లి పోవడం కూడా కనిపిస్తుంది దీంతో ఈ రోజు ఎపిసోడ్ మొత్తం హాట్ హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు ఏ టీం టాస్క్ గెలుచుకోబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడుతున్న ఈ గేమ్ లో ఏ టీం గెలిస్తే ఆ టీం లో ఒకరికి కెప్టెన్ అయ్యే అవకాశం ఇస్తారు. మరి చూడాలి ఈ వారం కెప్టెన్ గా ఎంపిక అయ్యేది ఎవరు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X