Bigg Boss: ఓ కంటెస్టెంట్‌కు బంపర్ ఆఫర్.. ఎలిమినేషన్ లేకుండా స్పెషల్ పాస్.. రిజెక్ట్ చేసిన జంట
ఎప్పుడు ఎలాంటి టాస్కులు ఉంటాయో తెలియకుండా.. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనాలే వేయకుండా.. చిత్ర విచిత్రమైన పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో వచ్చే దానికి మాత్రమే భారీ స్పందన దక్కుతోంది. అందుకే ఇది ఐదో సీజన్‌ను కూడా అదే రేంజ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. దీంతో నిర్వహకులు సరికొత్త టాస్కులను పరిచయం చేస్తూ మరింత రసవత్తరంగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

భారీ రెస్పాన్స్‌తో సాగుతోన్న ఐదో సీజన్
గతంలో జరిగిన వాటిని మించిన రేటింగ్‌తో దూసుకుపోతోంది బిగ్ బాస్ ఐదో సీజన్. ప్రీమియర్ ఎపిసోడ్ నుంచే రికార్డు స్థాయి స్పందనను అందుకుంటోన్న ఈ సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో నిర్వహకులు కూడా ప్రేక్షకులకు నచ్చే అంశాలనే ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తున్నారు. దీంతో వారం రోజులతో పాటు వారంతాల్లోనూ మంచి రేటింగ్ సొంతం అవుతోంది.

నామినేషన్‌లో ఎనిమిది మంది ఉండగా
ఐదో సీజన్‌లోకి ఏకంగా మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొత్తం ఇప్పటి వరకూ పది వారాలు పూర్తయ్యాయి. ఇందులో పది మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. పదకొండో వారంలో మానస్, కాజల్, సిరి, ఆనీ, షణ్ముఖ్, వీజే సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయ్యారు.

మీ ఇల్లు బంగారు కానూ టాస్కు సరదాగా
ప్రతివారం ఇంటి కెప్టెన్‌ను ఎన్నుకునేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తుంటాడు. ఈ వారానికి కెప్టెన్సీ కోసం పోటీ పడే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసేందుకు గానూ 'మీ ఇల్లు బంగారం కాను' అనే టాస్క్ ఇచ్చాడు. ఎన్నో మలుపులతో సరదాగా సాగిన ఈ టాస్కులో అందరూ మంచిగానే ఆడారు. అయితే, మానస్, ప్రియాంక, సిరి, ఆనీ మాత్రమే కెప్టెన్సీ కోసం పోటీ పడబోతున్నారు.

ఓ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ బంపర్ ఆఫర్
బిగ్ బాస్ ఐదో సీజన్ తుది దశకు చేరుకుంటోన్న సమయంలో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే ఎపిసోడ్‌లో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కును తీసుకుని వచ్చారు. ఇందులో గెలిచిన సభ్యుడు లేదా సభ్యురాలికి ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు ఎప్పుడైనా వాడుకోవచ్చు. గతంలోనూ ఇది చూపించారు.

నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా అంటూ
ఐదో సీజన్‌కు సంబంధించిన 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కును ఇంట్లో ఉన్న సభ్యులందరికీ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' అనే పేరు పెట్టారు. దీని ప్రకారం.. బజర్ మోగిన వెంటనే ఎవరైనా ఇద్దరు ఇంటి సభ్యులు వెళ్లి.. ఫైర్ ఇంజిన్ వ్యాన్‌లో కూర్చోవాలి. వాళ్లకు ఎదురుగా కనిపించే ఇద్దరు కంటెస్టెంట్ల ఫొటోల్లో ఒక దాన్ని నిప్పుల్లో కాల్చేయాలి.
ఎవిక్షన్ ఛాన్స్ పట్టేసిన రెండు జంటలు
'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఇందులో ఫస్ట్ బజర్ మోగిన వెంటనే షణ్ముఖ్, సిరి వ్యాన్‌లో కూర్చున్నారు. ఆ తర్వాత శ్రీరామ్, ఆనీ మాస్టర్ కూర్చున్నారు. మొదటి జంటకు సన్నీ, ప్రియాంక ఫొటోలు వచ్చాయి. వాళ్లిద్దరూ సిరి, షన్నూను తమను సేవ్ చేయాలంటూ ఒక్కొక్కరూ బాగా అభ్యర్థించడం ప్రోమోలో చూపించారు.
Recommended Video

ఎవిక్షన్ పాస్‌ను రిజెక్ట్ చేసిన సిరి, షన్నూ
ఎలిమినేషన్ తప్పించుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కును అందరూ కావాలని కోరుకుంటారు. అయితే, తాజాగా వదిలిన ప్రోమోలో మాత్రం సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ రిజెక్ట్ చేసినట్లు చూపించారు. తమకు జనాలు ఓట్లు వేయడమే ముఖ్యమని చెప్పడం కనిపించింది. మొత్తానికి ఈ టాస్క్ ఎంతో రసవత్తరంగా సాగనుందని అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











