Bigg Boss: షోలో విలన్ల రచ్చ.. ఆ కంటెస్టెంట్లే టార్గెట్.. అవన్నీ తాగిస్తూ ట్రిమ్మర్‌తో తలపై అలా!
ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ఇది ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. అదే సమయంలో ఇక్కడ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రసారం అవుతోన్నా ఐదో సీజన్ కూడా ప్రేక్షకులకు మజాను పంచుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే వచ్చే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు ఊహించని సవాళ్లు ఎదరయ్యాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

ఈ సారి అన్నింటినీ హైలైట్ చేస్తూనే
బిగ్ బాస్ షోలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, లవ్‌తో పాటు బాధలు ఇలా అన్ని రకాల సన్నివేశాలను చూపిస్తుంటారు. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఐదో సీజన్‌లో వాటిని ఇంకాస్త ఎక్కువగా చూపిస్తున్నారు. ఫలితంగా ఇది కూడా భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గానే దూసుకుపోతోంది.

ఇద్దరికి ఇమ్యూనిటీ.. వాళ్లు నామినేట్
9 వారానికి కెప్టెన్ మినహా మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. అయితే, గత ఎపిసోడ్‌లో జరిగిన 'జీవితమే ఒక ఆట' టాస్కులో విజేతగా నిలిచిన ఆనీ మాస్టర్‌కు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది. అదే సమయంలో ఆమెకు గతంలో దక్కిన పవర్ షీల్డ్ వల్ల మానస్ కూడా సేఫ్ అయ్యాడు. దీంతో ఈ వారం సన్నీ, పింకీ, సిరి, శ్రీరామ్, రవి, విశ్వ, జెస్సీ, కాజల్‌లు నామినేట్ అయ్యారు.

కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ఎలాగంటే
ప్రతి వారం ఇంటికి కెప్టెన్‌ను ఎంచుకుంటూ ఉంటారు. అందుకోసం ముందుగా బిగ్ బాస్ ఓ టాస్కును ఇస్తాడు. అందులో ఉత్తమ ప్రదర్శన చేసిన వాళ్లనే కెప్టెన్సీ కోసం పోటీదారులుగా ఎంచుకుంటారు. ఇలా ఈ వారం కంటెస్టెంట్లకు 'సూపర్ విలన్లు వర్సెస్ సూపర్ హీరోలు' అనే టాస్కు ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

వాళ్లు అతడిని.. వీళ్లు ఇతడిని టార్గెట్
'సూపర్ విలన్లు వర్సెస్ సూపర్ హీరోలు' టాస్కులో భాగంగా ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించినట్లు కనిపిస్తుంది. వీళ్లకు పలు రకాల టాస్కులు ఇస్తారని వాటిని పూర్తి చేసిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారని తెలుస్తోంది. ఇక, విలన్ల టీమ్ సభ్యులు సింగర్ శ్రీరామ చంద్రను, హీరోల జట్టు యాంకర్ రవిని టార్గెట్ చేసినట్లు ప్రోమోలో ప్రత్యేకంగా చూపించారు.
అవన్నీ తాగిస్తూ ట్రిమ్మర్‌తో తలపైన
తాజాగా విడుదలైన ప్రోమోలో సూపర్ విలన్ టీమ్ సభ్యులు శ్రీరామ చంద్రను ఎంచుకుని అతడికి టాస్కులు ఇచ్చినట్లు చూపించారు. ఇందులో ముందుగా అతడిని తలస్నానం చేయించారు. ఆ తర్వాత ఏవేవో డ్రింక్స్ ఇచ్చారు. అలాగే, సాస్‌లు కూడా ఇచ్చి మీద వేసుకోమన్నారు. ఇక, చివర్లో ఓ కంటెస్టెంట్ వచ్చి ట్రిమ్మర్‌తో జుట్టు కత్తిరించబోయిన దాన్ని హైలైట్ చేశారు.

ఒక కంటెస్టెంట్‌గా ఎంపిక అయ్యాడని
సూపర్ విలన్స్ ఇచ్చిన అన్ని టాస్కులను సింగర్ శ్రీరామ చంద్ర విజయవంతంగా పూర్తి చేశాడని తాజాగా తెలిసింది. ఎంతో కష్టమైన పనులు చేయించినప్పటికీ అతడు ఓపికగా ఆడి వాటిని పూర్తి చేశాడని అంటున్నారు. దీంతో ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే అర్హతను కూడా అందుకున్నాడని తెలుస్తోంది. మరి అతడు ఎలా ఆడాడో ఈరోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











